ఖర్చులు బాగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో భవిష్యత్తు కోసం డబ్బులు దాచుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చాలామంది డబ్బు రూపంలో కంటే ఎక్కువగా బంగారం, భూములు, షేర్లు తదితర వాటిల్లో పెట్టుబడులు పెడుతూ కూడబెడుతున్నారు. చాలాకాలంగా పెట్టుబడులు పెట్టే వారికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ చేయవద్దు అనే విషయాలు దాదాపు తెలిసి ఉంటాయి. కానీ కొద్దికాలంగా మాత్రమే ఆదా చేస్తున్న వారు లేదా ఆదా చేయాలనుకునే వారు డైలమాలో ఉంటారు. అలాంటి వారికి కొన్ని టిప్స్....

ఆర్థిక క్రమశిక్షణ అవసరం
భవిష్యత్తు కోసం ఆదా చేయాలంటే అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది ఆర్థిక క్రమశిక్షణ. ప్రతి అంశాన్ని లెక్క వేసుకోవడం ఎంతో అవసరం. ఏది ఖర్చు చేసినా.. ఏం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం.. ఇది అవసరమా అని ఆలోచించి ఆ తర్వాత దాని కోసం ఖర్చు చేయాలి. చాలామంది ప్రతి రోజు రాత్రి కూర్చొని తాము ఈ రోజు ఏం ఖర్చు చేశామని.. పుస్తకంలో రాసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక దీనిని ఉపయోగించుకుంటున్నారు.

కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై సేవ్ చేయండి..
ఒక్కో బొట్టు కలిస్తే సముద్రం అయినట్లుగా.. మీరు సంపాదించే ప్రతి రూపాయిని ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చు చేస్తే ఆదా చేసుకోవచ్చు. ఆదరబాదరాగా ఖర్చు చేయడం సరికాదు. ఏదైనా ఖర్చు చేసే సమయంలో దానికి అంత విలువ ఉంటుందా అనే కోణంలో ఆలోచించాలి. ఉదాహరణకు దుస్తులు కొనుగోలు చేయాలంటే మంచి దుస్తుల కోసం నాలుగైదు షాప్స్ తిరిగి చూసుకుంటాం. అలాగే, మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై సేవ్ చేసేందుకు చూడాలి.

బిల్స్ వెంట వెంటనే చెల్లించండి
కరెంట్ బిల్లు మొదలు క్రెడిట్ కార్డు బిల్లు వరకు.. ఏదైనా వెంటనే చెల్లించడం మంచిది. ఏ బిల్లు చెల్లించడం ఆలస్యం చేసినా ఎంతోకొంత ఫైన్ పడుతుంది. అలాంటి వాటిని తప్పించుకోవడానికి వెంటనే చెల్లింపులు జరపడం మంచిది.

డిస్కౌంట్ డీల్స్, క్యాష బ్యాక్
మీరు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్ డీల్స్ పైన కొనుగోలు చేయడానికి వెనుకాడవద్దు. అయితే వస్తువు మన్నిక చూసుకొని తీసుకుంటే చాలు. ఉదాహరణకు పండుగ సమయంలో ఇలాంటి ఆఫర్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ముందుగా కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ కొద్ది రోజులు ఆగితే తక్కువ ధరకే మీరు కోరుకున్న వస్తువు వచ్చే అవకాశం ఉంటుంది.

లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి..
మీ తాహతకు తగినట్లు ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఉదాహరణకు ఇల్లు కొనుగోలు, కారు కొనుగోలు, ప్లాట్ కొనుగోలు లేదా ఎక్కడికైనా వెళ్లాలి.. అనే లక్ష్యాలను పెట్టుకొని ముందు నుంచే వాటి కోసం పని చేస్తుండాలి.

ఇన్వెస్ట్‌మెంట్
ఆర్థిక నిపుణుల సూచనలతో సిప్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. చిన్న మొత్తం పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే కొంతకాలానికి మీ చేతికి పెద్ద మొత్తం వస్తుంది.

ఎమర్జెన్సీ ఫండ్
ఎమర్జెన్సీ ఫండ్‌పై దృష్టి పెట్టడం మంచిది. ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. కొన్ని సమయాల్లో అత్యవసరంగా డబ్బులు అవసరం పడతాయి. అలాంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ ఫండ్ అవసరం.

సేఫ్టీ నెట్
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి ఇన్సురెన్స్ పాలసీ వంటివి కూడా అవసరం. బీమా పాలసీలు చేసుకోవడం మంచిది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications