ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం గెట్ ఆన్ బోర్డ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు ప్రకటించింది. ఇందు కోసం క్లియర్ ట్రిప్, ఈజీమై ట్రిప్, యాత్ర, ట్రావెల్ యారి, రెడ్ బస్ వంటి వివిధ సంస్థతో జత కట్టింది. ఎస్బీఐ దీపావళి బంపర్ ఆఫర్లో భాగంగా ఎస్బీఐ యోనో కస్టమర్లు అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఆఫర్లను ప్రకటించింది.
ఎస్బీఐ ట్రావెల్ ఆఫర్లు
SBI గెట్ ఆన్ బోర్డ్ పేరుతో సూపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుతం పండుగ సీజన్. పైగా ఏడాది చివరికి వస్తోంది. ఈ సమయాన్ని ఎంతోమంది విహార యాత్రల కోసం ఉపయోగించుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ గెట్ ఆన్ బోర్డ్‌ను లాంచ్ చేసి ఆఫర్లు ఇస్తోంది. 'ఎస్బీఐ యోనో యాప్ ద్వారా గ్రేట్ ఆఫర్లు పొందండి. మీ నెక్స్ట్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకోండి, ఈ రోజే బుక్ చేసుకోండి. ఈ ఆఫర్ చివరి తేదీ డిసెంబర్ 31, 2019' అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ యోనో లేని వారు దానిని డౌన్ లోడ్ చేసుకొని, ఆఫర్లు పొందవచ్చు.

క్లియర్ ట్రిప్ ఆఫర్
డొమెస్టిక్ ఫ్లైట్స్ బుకింగ్ పైన 20 శాతం వరకు తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. గరిష్టంగా రూ.1,000 వరకు ఉంటుంది. అలాగే డొమెస్టిక్ హోటల్ రిజర్వేషన్స్ పైన రూ.10,000 వరకు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్స్ పైన రూ.15,000 వరకు క్యాష్ బ్యాక్స్ పొందవచ్చు.

ఈసీ మై ట్రిప్ ఆఫర్
ఎస్బీఐ ప్రకారం... కస్టమర్లు ఈజీ మై ట్రిప్ ద్వారా బుక్ చేసుకుంటే ప్లైట్ బుకింగ్స్ పైన రూ.1,000 వరకు తగ్గింపు ఉంటుంది. టిక్కెట్ బుకింగ్ విలువ కనీసం రూ.2,000 ఉండాలి. అలాగే హోటల్ బుకింగ్స్ పైన రూ.700 వరకు, బస్ బుకింగ్స్ పైన 5 శాతం వరకు తగ్గింపు ఉంది.

యాత్రా బుకింగ్
యాత్రా ద్వారా ఫ్లైట్ బుకింగ్ చేసుకుంటే కస్టమర్లకు రూ.5,000 వరకు తగ్గింపు ఉంటుంది. హోటల్ బుకింగ్స్ పైన 20 శాతం వరకు ఉంటుంది. గరిష్టంగా మాత్రం రూ.1,000 వరకు తగ్గింపు ఉంది.

ట్రావెల్ యారీ
ఆన్ లైన్ బస్ బుకింగ్ పోర్టల్ ట్రావెల్ యారీ ద్వారా బుక్ చేసుకుంటే 10 శాతం తగ్గింపు ఉంటుంది. బస్సు బుకింగ్ పైన రూ.120 వరకు గరిష్టంగా తగ్గింపు ఉంది.

రెడ్ బస్ ఆఫర్
ఆన్ లైన్ బస్సు టిక్కెటింగ్ ప్లాట్‌ఫాం రెడ్ బస్సు ద్వారా టిక్కెట్ బుక్ చేసుకుంటే 5 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు ఉంది.


Click it and Unblock the Notifications