ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.5,700, ఐదేళ్లలో రూ.3.4 లక్షల సంపాదన
డబ్బు సంపాదనకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇందులో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) అకౌంట్ ఒకటి. రిస్క్ తీసుకోవడం ఇష్టంలేనివారు ఇందులో చేరవచ్చు. తద్వారా ప్రతి నెల డబ్బులు పొందవచ్చు. రూ.9,00,000 డిపాజిట్ చేయడం ద్వారా నెలకు రూ.5,700 మొత్తం పొందవచ్చు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్దవారు కలిసి జాయింట్ మంత్లీ ఇన్‌కమ్ స్కీంను ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా రూ.9,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.

గరిష్ట పరిమితికి మించకుండా..
పోస్టాఫీస్ వెబ్ సైట్ ప్రకారం ప్రతి ఉమ్మడి ఖాతాలో ఉమ్మడి ఖాతాదారులందరికీ సమాన వాటా ఉండాలి. పోస్టాఫీసులో సింగిల్ లేదా జాయిన్ MIS అకౌంట్స్ ఎన్ని తెరవాలనే దానికి పరిమితి లేదు. కానీ ఈ ఖాతాల డిపాజిట్ల మొత్తం గరిష్ట పరిమితిని మాత్రం మించకూడదు. ఇది ఉమ్మడి ఖాతా విషయంలో రూ.9 లక్షలు మించరాదు. సింగిల్ ఖాతా అయితే రూ.4.5 లక్షలు మించవద్దు. MIS అకౌంట్ మెచ్యూరిటీ అయిదేళ్లు.

నెలకు రూ.5,600
ప్రస్తుతం MIS అకౌంట్‌లోని ఫండ్‌పై వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఈ లెక్కన రూ.9 లక్షల పెట్టుబడిపై నెలకు రూ.5700 అంటే మీ చేతికి వచ్చే మొత్తం రూ.3,42,000 అవుతుంది. అదే సింగిల్ MIS అకౌంట్ అయితే రూ.4.5 లక్షల డిపాజిట్ పైన అయిదేళ్ల కాలపరిమితిలో రూ.1,71,000 వస్తుంది. నెలకు రూ.2,850 చేతికి అందుతుంది.

మైనర్ పేరిట ఖాతా తెరిస్తే...
MIS ఖాతాను మైనర్ పేరిట కూడా తెరవవచ్చు. పది సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల మైనర్ ఖాతాను తెరిచి ఆపరేట్ చేయవచ్చు. మైనర్ మెజార్టీ సాధించిన అనంతరం అతని లేదా ఆమె పేరులోని ఖాతాను మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. MIS డిపాజిట్ పైన వడ్డీని ఆటో క్రెడిట్ ద్వారా అదే పోస్టాఫీస్ వద్ద ఉన్న పొదుపు ఖాతాలోకి మార్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications