3నిమిషాల్లో ఈ అకౌంట్ తెరవొచ్చు: లోన్, క్రెడిట్ కార్డ్ సహా బెనిఫిట్స్...
కేవలం మూడు నిమిషాల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) అకౌంట్‌ను తెరిచే డిజిటల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రాడక్ట్ ఎక్స్‌ప్రెస్ FDని ప్రారంభించినట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. యాక్సిస్ బ్యాంకులో సేవింగ్ అకౌంట్ తెరవకుండానే డిజిటల్ మోడ్ ద్వారా దీనిని ఓపెన్ చేయవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, జీరో అస్యూరెన్స్ ఫీజు, ప్రీమెచ్యూర్ విత్ డ్రా పైన పెనాల్టీ లేకపోవడం (మొత్తంలో 25 శాతం వరకు) ఎక్స్‌ప్రెస్ FD ఆకర్షణీయ ప్రయోజనాలు.

రూ.5వేల నుంచి రూ.90వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు
ఒక కస్టమర్ 6 నెలల నుంచి 12 నెలల కాలంలో ఎక్స్‌ప్రెస్ FD అకౌంట్‌లో రూ.5,000 నుంచి రూ.90,000 వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ నిధులను నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా ఎక్స్‌ప్రెస్ FD అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చు.

అదనపు ప్రయోజనాలు..
KYC ప్రాసెస్ పూర్తయిన తర్వాత కస్టమర్‌కు అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్స్, ఫారెక్స్ కార్డ్ ఆఫరింగ్స్, డైనింగ్ డిలైట్స్ వంటి లైఫ్ స్టైల్ బెనిఫిట్స్‌తో పాటు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. క్రెడిట్, డెబిట్ కార్డులలో ఇతర అదనపు ఆఫర్ల్‌ను కూడా ఎంచుకోవచ్చు.

సేవింగ్ అకౌంట్ ఓపెన్
బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. ఇందుకు బ్యాంకు అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లి ఆధార్, పాన్ కార్డు వివరాల సాయంతో అకౌంట్ తెరువవచ్చు. రెగ్యులర్ FDలపై ఎంత వడ్డీ ఉందో వీటికి కూడా అదే వర్తిస్తుంది.

వీరికోసం.. ఈ సౌకర్యం
యాక్సిస్ బ్యాంకు రిటైల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ భట్ మాట్లాడుతూ... కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎక్స్‌ప్రెస్ FDని ప్రారంభించామని, స్వల్ప కాలంలో చేతిలోని డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చునని, డిపాజిట్లపై క్రెడిట్ కార్డు, లోన్ సౌకర్యం ఉందని తెలిపారు. డిజిటల్ అవగాహన ఉన్న కొత్త కస్టమర్లకు, FD షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆసక్తి ఉన్న వారికి ఈ సేవలు తీసుకొచ్చామన్నారు.

యాక్సిస్ బ్యాంక్ సేవలు కొన్ని...
ఎక్స్‌ప్రెస్ FD, పర్సనల్ లోన్, కారు లోన్, హోమ్ లోన్స, సేవింగ్స్ అకౌంట్, క్రెడిట్ కార్డు, సేవింగ్స్ అకౌంట్, FD, ఎడ్యుకేషన్ లోన్ వంటి ఎన్నో ఆఫర్స్ యాక్సిస్ బ్యాంకు అందిస్తోంది.


Click it and Unblock the Notifications