అక్టోబర్ 1 నుంచి మార్పులు, కొత్త రూల్స్!: ఆదాయం, ఖర్చులపై ప్రభావం

అక్టోబర్ 1వ తేదీ నుంచి బ్యాంకుల వడ్డీ రేట్ల నుంచి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవి మీ వ్యక్తిగత ఆదాయంపై ఏదో రకంగా ప్రభావం చూపనుంది. ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్, క్రెడిట్ కార్డు డిస్కౌంట్స్, ట్రావెల్ ఇన్సురెన్స్‌లలో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. మంగళవారం (సెప్టెంబర్ 1) నుంచి చోటు చేసుకోనున్న ఐదు ముఖ్యమైన మార్పులు ఇక్కడ తెలుసుకోండి...

లోన్స్‌పై ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్కింగ్

లోన్స్‌పై ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్కింగ్

బ్యాంకులు అన్ని కూడా పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోమ్ లోన్స్‌ను ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్‌తో లింక్ చేయాలని, అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ రెపో రేటు, మూడు నెలలు లేదా ఆరు నెలల ట్రెజరీ బిల్స్ ఈల్డ్ లేదా ఫైనాన్షియల్ బెంచ్ మార్క్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఇతర మార్కెట్ వడ్డీ రేటును బ్యాంకులు ఎంచుకోవచ్చు.

బాహ్య బెంచ్ మార్కుతో అనుసంధానం చేస్తే...

బాహ్య బెంచ్ మార్కుతో అనుసంధానం చేస్తే...

ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు బాహ్య బెంచ్ మార్కుతో అనుసంధానించబడిన వడ్డీ రేట్లను కనీసం మూడు నెలలకు ఓసారి రీసెట్ చేయాలి. దీంతో ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్కు రేులో మార్పు ఉంటే ఈ ప్రభావం ఈఎంఐ పైన కూడా ఉంటుంది. దీంతో రుణాలు చౌక అయ్యే అవకాశముంది.

DIN నెంబర్

DIN నెంబర్

అక్టోబర్ 1వ తేదీ నుంచి అన్ని ఆదాయపన్ను నోటీసులు, లేఖలు లేదా ఇతర అధికారిక పన్ను సంబంధిత కరస్పాండెంట్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (DIN) కలిగి ఉంటాయి. ఇది కంప్యూటర్ జనరేటెడ్ నెంబర్. ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్‌లో ధృవీకరించబడుతుంది.

క్రెడిట్ కార్డ్స్‌పై పెట్రోల్ బంకుల్లో నో డిస్కౌంట్

క్రెడిట్ కార్డ్స్‌పై పెట్రోల్ బంకుల్లో నో డిస్కౌంట్

బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తే డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహంలో భాగంగా క్రెడిట్ కార్డ్స్ పైన 0.75 శాతం డిస్కౌంట్ ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డు ద్వారా ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనతో ఆయిల్ కంపెనీలు రెండున్నరేళ్ల క్రితం ఈ డిస్కౌంట్‌ను ప్రారంభించాయి. అయితే డెబిట్ కార్డులు, డిజిల్ పేమెంట్స్ పైన మాత్రం డిస్కౌంట్స్ కొనసాగుతాయి.

గవర్నమెంట్ పెన్షనర్లకు శుభవార్త

గవర్నమెంట్ పెన్షనర్లకు శుభవార్త

పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగంలో చేరిన ఏడేళ్ల లోపు ఓ ఎంప్లాయి మృతి చెందితే వారి కుటుంబానికి మెరుగైన పెన్షన్ రానుంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలను ప్రభుత్వం 19 సెప్టెంబర్ 2019 రోజున నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. ఇది అక్టోబర్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

డ్రైవింగ్ లైసెన్స్

డ్రైవింగ్ లైసెన్స్

అక్టోబర్ 1వ తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్సు నిబంధనల్లోను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక నుంచి ఒక DL, ఒక RC ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్‌లల్లో మైక్రో చిప్స్ అమరుస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఉంటుంది.

హోటళ్లపై జీఎస్టీ

హోటళ్లపై జీఎస్టీ

- జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. హోటళ్లపై జీఎస్టీ నేటి నుంచి తగ్గుతుంది. అద్దెకు తీసుకున్న దుకాణాల్లో హోటల్‌‌ను నడిపిస్తే అద్దె రూ.7,500 లోపు ఉంటే అప్పుడు జీఎస్టీ 12% ఉంటుంది. రూ.1,000 వరకు అద్దెకు ఎలాంటి జీఎస్టీ లేదు.

- అలాగే జీఎస్టీ రిటర్న్స్ ఫామ్ మారుతుంది. బిజినెస్‌మెన్ జీఎస్టీ ANX1 ఫారంను ఫైల్ చేయాలి. 2020 నుంచి చిరు వ్యాపారులకు వర్తిస్తుంది.

- బీవరేజస్ పైన జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచారు. పాసింజర్ కోచ్‌లు, రైల్ కార్ వ్యాగన్స్ పైన జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారు.

ప్లాస్టిక్ నిషేధం

ప్లాస్టిక్ నిషేధం

అక్టోబర్ 1వ తేదీ నుంచి మానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏర్పాటు చేసే కంపెనీలు పదిహేను శాతం కార్పోరేట్ ట్యాక్స్ కడితే చాలు. దీనిని ప్రభుత్వం ఇటీవలే తగ్గించింది.

అక్టోబర్ 2వ తేదీ నుంచి కేంద్రం ప్లాస్టిక్ బ్యాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇండియన్ రైల్వేస్ ప్లాస్టిక్ వాడకాన్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి నిషేధించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+