For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంపై ఎంతకాలానికి రుణం తీసుకోవాలో తెలుసా మీకు?

|

బంగారంపై రుణాన్ని అత్యంత వేగవంతంగా, సులభంగా తీసుకునే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది. వివిధ రకాల బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలు బంగారం తనఖా తో రుణాలను ఇస్తున్నాయి. ఈ ఆర్ధిక సంస్థలు ఇచ్చే కనిష్ట, గరిష్ట రుణ మొత్తంలోనే కాకుండా తీసుకునే రుణంపై వసూలు చేసే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ చార్జీలు భిన్నంగా ఉంటాయి. వీటి గురించి ముందుగానే తెలుసుకుంటే ఈ సంస్థ వద్ద రుణం తీసుకుంటే ప్రయోజనం ఉంటుందో చూసుకోవచ్చు. అంతే కాకుండా రుణ కాలపరిమితి కూడా చాలా ముఖ్యం. ఎంత కాలానికి రుణం తీసుకుంటే లాభం, ఎంత కాలానికి తీసుకుంటే వడ్డీ భారం తక్కువగా ఉంటుందో తెలుసుకోవాలి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

తగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండితగ్గిన బంగారం ధర: గూగుల్ పే ద్వారా ఇలా... సులభంగా కొనండి

బంగారం రుణాలకే మొగ్గు

బంగారం రుణాలకే మొగ్గు

* బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు విభిన్న రకాల రుణాలను ఇస్తుంటాయి. అయితే ఇప్పుడు మాత్రం బంగారం పై రుణాలు ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో ఈ రుణాలకు డిమాండ్ పెరుగుతోంది. బంగారం కుదువ పెట్టుకొని రుణం తీసుకుంటారు కాబట్టి రుణానికి తగిన హామీ ఉంటుంది.

* బంగారంపై రుణాన్ని అరగంట సమయంలో తీసుకోవచ్చు. రుణం తీసుకునేవారు సంభందించిన ఏదో ఒక గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

* బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలు .. బ్యాంకులకన్నా ఎక్కువ కాలానికి రుణాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఎక్కువ వడ్డీ రేటు కూడా ఉంటుంది.

* తీసుకున్న రుణం, వడ్డీని సులభంగా చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు.

* వడ్డీని వాయిదాల్లో, అసలును ఒక్కసారిగా చెల్లించవచ్చు.

* బంగారం ధరల్లో మార్పులుచేర్పులు జరుగుతుంటాయి కాబట్టి తక్కువ కాలానికి రుణాన్ని తీసుకోవాలని ఎక్కువ కాలానికి తీసుకుంటే డీఫాల్ట్ కావడానికి అవకాశం ఉంటుందని పరిశీలకులు సలహా ఇస్తున్నారు.

* బంగారం ధర పెరిగితే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటారు చాలామంది. అయితే ధర తగ్గితే రుణాన్ని ఎగవేశే వేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.

రుణం - వడ్డీ రేటు - కాలపరిమితి ... ఫైనాన్స్ కంపెనీలు..

రుణం - వడ్డీ రేటు - కాలపరిమితి ... ఫైనాన్స్ కంపెనీలు..

* ముత్తూట్ ఫైనాన్స్

- గరిష్ట వడ్డీ రేటు : 27 శాతం వరకు ఉంటుంది.

- ప్రాసెసింగ్ ఫీజు రుణంలో ఒక శాతం వరకు ఉంటుంది.

- రుణ మొత్తం రూ.1,500 నుంచి ప్రారంభం

* మణప్పురం ఫైనాన్స్

- వడ్డీరేటు : 29 శాతం వరకు ఉంటుంది.

- రుణం : రూ. 1,000-1.5 కోట్లు

రుణం - వడ్డీ రేటు - కాలపరిమితి ... బ్యాంకులు..

రుణం - వడ్డీ రేటు - కాలపరిమితి ... బ్యాంకులు..

* స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

- వడ్డీ రేటు : 9.5 శాతం

- ప్రాసెసింగ్ ఫీజు: 0. 50 శాతం

-రుణం : రూ. 20,000- 20 లక్షలు

* కెనరా బ్యాంక్

- వడ్డీ రేటు : 10.20-10.30

- ప్రాసెసింగ్ ఫీజు : రూ. 1,000-5,000

- రుణం : 10,000-10 లక్షలు

* యాక్సిస్ బ్యాంక్

- వడ్డీ రేటు : 14.85-17.35

- ప్రాసెసింగ్ ఫీజు : 1 శాతం

- రుణం : 25,001-20 లక్షలు

* పంజాబ్ నేషనల్ బ్యాంక్

- వడ్డీ రేటు : 10.9 శాతం

- ప్రాసెసింగ్ ఫీజు : 0.25 శాతం

- రుణం : 10 లక్షల వరకు

మరిన్ని బ్యాంకులు కూడా బంగారంపై రుణాన్ని అందిస్తున్నాయి.

English summary

బంగారంపై ఎంతకాలానికి రుణం తీసుకోవాలో తెలుసా మీకు? | Which bank is best for loan against gold?

You can easily get best gold loan from top Gold Loan Companies In India like Canara Bank, SBI Bank, Punjab National Bank etc.
Story first published: Thursday, September 12, 2019, 11:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X