సాధారణంగా టైమ్ ఈజ్ మనీ అనేది వింటుంటాం. అయితే పెట్టుబడి విషయానికి వస్తే సమయం వస్తే డబ్బును సృష్టించుకోవచ్చు. మీరు దీనిని అర్థం చేసుకుంటే ధనవంతులు కావడానికి పెద్ద కష్టం కాకపోవచ్చు!! పెట్టుబడి విషయంలో సమయం మీకు ఎంతో కీలకమైనది. కాంపౌండింగ్ మీకు డబ్బు పెరగడానికి ఉపయోగపడుతుంది. దీనిని అర్థం చేసుకొని ప్లాన్ ప్రకారం వెళ్తే కొన్నేళ్ల తర్వాత కూడబెట్టడం కష్టమేమీ కాకపోవచ్చు. ఇంతకుముందు మీరు పెట్టుబడి పెట్టి ఉంటే అర్థమవుతుంది. ఆచితూచి ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు ఉంటాయి.

నెల ఆలస్యం చేసినా రూ.40వేలు కోల్పోవచ్చు...
ఉదాహరణకు SIP (సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లో మీరు నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే 14 శాతం వడ్డీని లెక్కిస్తే పదేళ్ల తర్వాత రూ.25,90,689 వస్తుంది. ఒకవేళ మీరు మూడేళ్లు ఆలస్యం చేస్తే రూ.11 లక్షలకు పైగా కోల్పోతారు. ఏడాది ఆలస్యం చేస్తే నాలుగున్నర లక్షల రూపాయలు నష్టపోవచ్చు. నెల ఆలస్యం చేసినా రూ.40 వేల వరకు కోల్పోతారు. కాబట్టి ఎదైనా సమయం ముఖ్యం.

వీటి ఉచ్చులో పడొద్దు...
ఏం చేయాలన్నా ఒక్క రోజులో చేద్దామనుకుంటే కుదరదు. దేనికైనా సమయం అవసరం. సంపద సృష్టించేందుకు సమయంతో పాటు ప్రణాళిక కూడా అవసరం. చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ అంశంలో తప్పులో కాలేస్తుంటారు. అనవసర చిట్కాలు, స్టాక్స్ కొనే విషయంలో సత్వర మార్గాల వెంటపడటం, షార్ట్ కట్స్, ఫోంజీ స్కీమ్ వంటి వాటి ఉచ్చులో పడతారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌మెంట్ చేసి టైమ్ కోసం వేచి చూస్తారు. సాధారణంగా చాలా స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయి.

చిన్న మొత్తాలతో మంచి రిటర్న్స్
ఎవరైనా ఎర్లీ ఏజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే రూ.100, రూ.1000 వంటి చిన్న మొత్తాలతో దీర్ఘకాలంలో భారీగా కూడబెట్టుకోవచ్చు. ఆవేశపడి ఎక్కువ పెట్టుబడులు కూడా పెట్టడం సరికాదు. మెల్లి మెల్లిగా ఆదా చేయడం ద్వారా పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయి. చాలామంది నిశ్సబ్ద పెట్టుబడిదారులు ఉన్నారు. హడావుడి లేకుండా పక్కా ప్లాన్‌తో సమయం కోసం వేచి చూస్తుంటారు. తద్వారా వారు మంచి రిటర్న్స్ పొందుతారు.

ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఈజీ గేమ్
మనీ మేనేజ్‌మెంట్, వీలైనంత త్వరగా ప్రారంభించడం మంచిది. మంచి స్కీం వస్తుందా లేదా మంచి ప్రణాళికతో పెట్టుబడి పెడదామా అని ఉత్తినే కాలం వెళ్లదీయవద్దు. ఇంకా చెప్పాలంటే మీ చేతిలో ఉన్న తక్కువ మొత్తంతోనే మంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. అన్నీ అంశాలు పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఈజీ గేమ్!
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications