రూ.3,000తో 25 ఏళ్లకు రూ.56 లక్షల రాబడి, రూ.500 పెంచితే రూ.1కోటి

SIP లేదా సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ భారతీయుల్లో వేగవంతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మిలీనియల్స్, యూవత క్రమబద్ధమైన పెట్టుబడి వైపు చూస్తున్నారు. సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు కూడా కోటీశ్వరులు కావొచ్చు. నెలకు రూ.3,000 రూ.3,500 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే పాతికేళ్ల తర్వాత కోటి రూపాయలు వెనుకేసుకోవచ్చు. మ్యుచువల్ ఫండ్స్ గురించి తెలిసినవారికి SIP గురించి అవగాహన ఉంటుంది. కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారు తమ భవిష్యత్తు లక్ష్యాల కోసం SIPలో ఇన్వెస్ట్ చేస్తారు.

SIP కాలిక్యులేటర్. 25 ఏళ్లలో 56 లక్షలు

SIP కాలిక్యులేటర్. 25 ఏళ్లలో 56 లక్షలు

SBI మ్యుచువల్ ఫండ్ SIP కాలిక్యులేటర్ ప్రకారం ఒక ఇన్వెస్టర్ నెలకు రూ.3,000 చొప్పున ప్రారంభిస్తే 25 ఏళ్ల తర్వాత రూ.56,92,905 మెచ్యూరిటీని పొందుతారు. మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాబడి దీర్ఘకాలంలో 12 శాతం ఉంటుందని నిపుణుల అంచనా. ఆ లెక్కన 56 లక్షల రూపాయలు పొందుతారు.

రూ.500 పెంచుకుంటూ వెళ్తే రూ.1 కోటి

రూ.500 పెంచుకుంటూ వెళ్తే రూ.1 కోటి

అదే సమయంలో SBI మ్యుచువల్ ఫండ్ SIP కాలిక్యులేటర్ ప్రకారం సంవత్సరానికి రూ.500 చొప్పున పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే పైన వచ్చే రాబడికి రెండింతలకు పైగా ఉంటుంది. రూ.3,000తో ప్లాన్ స్టార్ట్ చేసి రూ.500 టాపప్ ప్లాన్ ఎంచుకుంటే 25 ఏళ్లలో వచ్చే మొత్తం ఏకంగా రూ.1,19,11,717 కోట్లు అవుతుంది.

109 రెట్లు అధికం...

109 రెట్లు అధికం...

టాపప్ ప్లాన్ ఎంచుకుంటే రాబడి 109.24 రెట్లు అధికంగా ఉంటుంది. రూ.3,000 పెట్టుబడితో ప్రారంభించి టాపప్ ప్లాన్ ఎంచుకొని ఏడాదికి రూ.500 పెంచుకుంటూ వెళ్తే పాతికేళ్లలో కోటీశ్వరుడు కావొచ్చు.

ఆదాయం పెరిగితే సిప్ మొత్తం పెంచుకోవచ్చు

ఆదాయం పెరిగితే సిప్ మొత్తం పెంచుకోవచ్చు

సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా రోజు లేదా నెలకు లేదా మూడు నెలలకు ఓసారి ఫిక్స్‌డ్ అమౌంట్‌ను పెట్టుబడిగా పెట్టవచ్చునని, ఇలా చేస్తే ఇన్వెస్టర్ ఆదాయం రోజు రోజుకు పెరుగుతుందని, ఇది ఇన్వెస్టర్‌కు అధిక రాబడిని ఇస్తుందని చెబుతున్నారు. ఆదాయం పెరిగినప్పుడు సిప్ మొత్తాన్ని పెంచుకోవచ్చునని చెబుతున్నారు. దీంతో లక్ష్యాలను త్వరితగతిన చేరుకోవచ్చు. SIP టాపప్ ప్లాన్ ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని పెంచుకోవడానికి అనుమతిస్తుందని, సిప్ టాపప్ ప్లాన్‌ను ఏడాదికి.. కొంత శాతం లేదా ఫిక్స్‌డ్ అమౌంట్‌ను ఆప్షన్లుగా ఎంచుకోవచ్చునని చెబుతున్నారు. SIP టాపప్ కనీస అమౌంట్ రూ.500.

SIP టాపప్ ప్రయోజనాలు..

SIP టాపప్ ప్రయోజనాలు..

- పెరుగుతున్న మీ ఆదాయానికి అనుగుణంగా ఉంటుంది.

- మీ ఆర్థిక లక్ష్యాలను మరింత వేగంగా చేరుకోవచ్చు.

- ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది.

- ఎప్పటికప్పుడు కొత్త దానిని ఓపెన్ చేయడం కంటే ఇప్పుడు ఉన్న దాని ద్వారా మరింత పెట్టుబడులకు అవకాశమిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+