For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లో భయాలు: ఐనా ఆ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లకు భరోసా ఎందుకంటే?

|

దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ఏ మాత్రం ప్రతికూల వార్త వచ్చినా మార్కెట్లు భారీగా క్షీణిస్తున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ ను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు మాత్రం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పై విశ్వాసాన్ని ఉంచుతున్నారు.

రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...రోడ్డు ఖర్చు కంటే చంద్రయాన్ 2 ఖర్చు తక్కువ, ఇస్రో సంపాదన...

ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్ లోకి రూ.9,000 కోట్లు

ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్ లోకి రూ.9,000 కోట్లు

* గత ఆగస్టు నెలలో ఇన్వెస్టర్లు ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ లోని ఈక్విటీ/గ్రోత్ ఫండ్స్ లో రూ. 9,152 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇన్ కమ్/డెట్ ఫండ్స్ లోను పెట్టుబడులు పెరిగాయి.

* ఇదే నెలలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ.25.47 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందు నెలతో పోల్చితే ఆస్తులు 4 శాతం మేర పెరిగాయి. జులై నెలలో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఆస్తులు రూ.24.53 లక్షల కోట్లుగా ఉన్నాయి.

* ఆగస్టు లో మ్యూచువల్ ఫండ్స్ లోకి రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. వీటిలో లిక్విడ్ ఫండ్స్ లోకి రూ. 79,000 కోట్లు వచ్చాయి.

* ఈక్విటీ, లిక్విడ్ స్కీమ్స్ లోకి పెట్టుబడులు పెరగడం వల్ల మొత్తం ఆస్తులు పెరిగే అవకాశం ఏర్పడుతోంది.

* ఇక హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుబడులు 4,946 కోట్లకు, సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్ పెట్టుబడులు 143.81 కోట్లకు తగ్గాయి.

రిటైల్ ఇన్వెస్టర్లు...

రిటైల్ ఇన్వెస్టర్లు...

* మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెరగడంలో రిటైల్ ఇన్వెస్టర్ల పాత్ర కీలకంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

* వీరి పెట్టుబడులు ఈక్విటీ పథకాలు, లిక్విడ్ ఫండ్స్ లో ఎక్కువగా ఉంటున్నాయి.

* ఆగస్టులో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకాల్లోకి రూ. 9,152 కోట్లు, రాగా క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ ఫండ్స్ నుంచి రూ. 62 కోట్ల పెట్టుబడులు తరలి పోయాయి. దీంతో నికర పెట్టుబడులు రూ. 9,092 కోట్లకు చేరుకున్నాయి.

* జులై నెలలో నికర పెట్టుబడులు రూ. 8,092 కోట్లుగా ఉన్నాయని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి.

* ఈక్విటీ ఫండ్స్ లోని స్మాల్, మిడ్ కాప్ ఫండ్స్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం విభాగంలో ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

* ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరగటం, వర్ధమాన వ్యాపారాలపై ఆసక్తి పెరగడం వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

* ఈ నెల విషయానికి వస్తే సిప్ లలో పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

* క్రమానుగత పెట్టుబడి పథకాల (సిప్)లోకి ఇదే నెలలో వచ్చిన పెట్టుబడులు రూ.8,231 కోట్లుగా ఉన్నాయి.

* ఆగస్టులో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4.81 లక్షల ఫోలియో లను జత చేసుకోగలిగింది.

పెరుగుతున్న సంఖ్య..

పెరుగుతున్న సంఖ్య..

* మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ క్రమంగా విస్తరిస్తోంది. అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలోకి వస్తున్న కంపెనీల సంఖ్య కూడా ఎక్కువవుతుతోంది. ప్రస్తుతం 44 సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటి సంఖ్య రానున్న కాలంలో మరింతగా పెరగడానికి అవకాశం ఉందని అంటున్నారు.

English summary

మార్కెట్లో భయాలు: ఐనా ఆ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లకు భరోసా ఎందుకంటే? | Market crash: Best investment funds

These are indeed very tough times for Indian stock market investors. Especially for those that invested in mid and small cap stocks. But some investors are interested to invest in these funds.
Story first published: Wednesday, September 11, 2019, 12:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X