ఎల్ఐసీ వివిధ రకాల పెన్షన్ పాలసీలను అందిస్తోంది. ప్రభుత్వేతర ఉద్యోగుల కోసం జీవన్ అక్షయ్ పాలసీ ద్వారా పెన్షన్‌దారుల అవసరాలు తీరుస్తున్నారు. కానీ ఆ తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ వల్ల ఎల్ఐసీ ఆ తర్వాత జీవన్ శాంతి స్కీంను ప్రవేశపెట్టింది. జీవన్ శాంతి పాలసీ ద్వారా పెన్షన్‌దారు తక్షణం లేదా భవిష్యత్తులో యాన్యుటీని పొందవచ్చు. అలాగే జీవన్ నిధి పాలసీ ద్వారా భవిష్యత్తులో యాన్యూటీ పొందవచ్చు. అలాగే బీమా, బోనస్ ఉంటుంది. మరో పథకం జీవన్ ఉమాంగ్. ఇది పెన్షన్ పథకం కాదు. జీవిత కాల బీమా స్కీం.

ఎల్ఐసీ జీవన్ శాంతి ప్లాన్ ఏమిటి? లోన్ సౌకర్యం...
ఎల్ఐసీ జీవన్ శాంతి పాలసీ ద్వారా పెన్షన్‌దారు తక్షణం లేదా భవిష్యత్తులో యాన్యుటీ పొందవచ్చు. ఈ స్కీంలో మీరు ఒకే మొత్తాన్ని చెల్లించాలి. ఈ పాలసీ తీసుకున్న వారికి జీవించి ఉన్నంత కాలం పెన్షన్ అందిస్తుంది. ప్లాన్ పైన లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే అదనపు ప్రయోజనం ఉంటుంది.

జీవితం అంతా యాన్యుటీ..
యాన్యుటీ అంటే ప్రతి సంవత్సరం ఒకరికి చెల్లించే స్థిరమైన మొత్తం. సాధారణంగా అతను లేదా ఆమె జీవించి ఉన్నంత వరకు ఈ స్కీంలో చెల్లిస్తారు. గత ఏడాది ప్రారంభించిన ఈ స్కీం ద్వారా జీవితం అంతా పేర్కొన్న యాన్యుటీ మొత్తం వస్తుంది.

యాన్యుటీ రకాలు...
ఈ పాలసీలో 9 రకాల యాన్యుటీ యాప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏడు ఆప్షన్లు వెంటనే పెన్షన్ అందించేవిగా ఉన్నాయి. ఈ పాలసీని ఒకరి పేరు పైన లేదా జాయింట్‌గా కూడా తీసుకోవచ్చు. ఈ స్కీంలో డబ్బు కట్టిన తర్వాత ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు. ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ ఆప్షన్ వర్తిస్తుంది.

ఎంత పాలసీ తీసుకోవాలి?
కనీసం రూ.1,50,000 మొత్తానికి పాలసీని తీసుకోవాలి. దీంతో కనీస మొత్తంలో యాన్యుటీ పొందవచ్చు. గరిష్టంగా పరిమితి లేదు. నెలకు కనీసం రూ.1,000 పొందవచ్చు. ఆరు నెలలకు రూ.6వేలు, ఏడాదికి రూ.12,000 లభిస్తాయి.

రూ.10 లక్షల ఇన్వెస్ట్‌మెంట్‌పై ఎంత రావొచ్చు అంటే?
30 ఏళ్ల నుంచి 80 ఏళ్ళ మధ్య ఎవరైనా ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఒక్కో వయస్సులో తీసుకుంటే ఒక్కో రకమైన యాన్యుటీ ఉంటుంది. ఏడు ఆప్షన్‌లలో ఏడు రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సులో తీసుకుంటే మొదటి ఆప్షన్ నుంచి వరుసగా ఏడో ఆప్షన్ వరకు... రూ.70134, రూ.69828, రూ.66156, రూ.51060, రూ.69012, రూ.67890, రూ.66054 పొందవచ్చు. 80 ఏళ్ల వయస్సులో తీసుకుంటే మొదటి ఆప్షన్ నుంచి వరుసగా ఏడో ఆఫ్షన్ వరకు రూ.182640, రూ.104508, రూ.70032, రూ.162648, రూ.156834, రూ.137556, రూ.69216 వరకు పొందవచ్చు.

ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు..
జీవన్ శాంతి పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్. ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించాలి. ఈ పాలసీ తీసుకోవాలంటే ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

జీవన్ శాంతి లేదా జీవన్ అక్షయ్‌లలో ఏది బెస్ట్
జీవన్ అక్షయ్ పాలసీ ద్వారా తక్షణమే యాన్యుటీ పొందవచ్చు. జీవన్ శాంతి ద్వారా వెంటనే లేదా భవిష్యత్తులో పొందవచ్చు. తక్షణ యాన్యుటీ కోసం ఏదైనా ఎంచుకునే వెసులుబాటు ఉంది. అయితే జీవన్ అక్షయ్‌లో వార్షిక వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. జీవన్ శాంతి పాలసీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కాకుండా కుటుంబ ప్రయోజనాలను అందిస్తుంది. కుటుంబంలోని పాలసీదారుపై ఆధారపడిన దివ్యాంగునికి ఇది ఎంతో ప్రయోజనకరం. దివ్యాంగుడైన కుటుంబ సభ్యుడిని నామినీగా ఎంచుకోవచ్చు. లేదా తక్షణమే యాన్యుటీ పొందడంలో రెండో వ్యక్తిగా నియమించవచ్చు. అదనపు ఆదాయ పన్ను చెల్లించే వారికి జీవన్ శాంతి పాలసి కాస్త బెట్టర్.

జీవన్ శాంతి లేదా జీవన్ నిధి
పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకేసారి ప్రీమియం చెల్లించలేని సందర్భంలో క్రమంగా ప్రీమియం చెల్లించడం ద్వారా తగిన నిధి అందించడమే జీవన్ నిధి ఉద్దేశ్యం. జీవన్ నిధి పాలసీ తీసుకున్న వ్యక్తి యాన్యుటీ తీసుకోవడం ప్రారంభించడానికి ముందే మరణిస్తే నామినీకి బీమా నిధిని, బోనస్‌ను ఇస్తారు. అదే జీవన్ శాంతి పాలసీలో మొత్తం పాలసీ కొనుగోలు ధర, దానిపై వచ్చిన అదనపు మొత్తం నుంచి ఒకవేళ అప్పటి వరకు యాన్యుటీ ఇచ్చినట్లయితే ఆ యాన్యుటీ మొత్తాన్ని తీసివేయగా వచ్చిన మొత్తం లేదా 110 శాతం కొనుగోలు ధర రెండింటిలో ఏది అధికం అయితే దానిని చెల్లిస్తారు.

జీవన్ ఉమాంగ్ వర్సెస్ జీవన్ శాంతి
జీవన్ ఉమాంగ్ పెన్షన్ స్కం కాదు. లైఫ్ టైమ్ ఇన్సురెన్స్ స్కీం. ప్రీమియం పేయింగ్ టర్మ్ పూర్తయితే నగదు రూపంలో హామీతో కూడిన వార్షిక రాబడి అందిస్తుంది. దీని ద్వారా వచ్చే రాబడిపై పన్ను వర్తించదు. జీవన్ ఉమాంగ్ క్రమంగా ప్రీమియం చెల్లించే స్కీం. జీవన్ శాంతి మాత్రం ఒకేసారి ప్రీమియం చెల్లించి భవిష్యత్తులో పెన్షన్ తీసుకునే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒకేసారి చెల్లించే కెపాసిటీ కలిగిన వారు జీవన్ శాంతి, విడతలవారీగా చెల్లించాలనుకునేవారు జీవన్ ఉమాంగ్‌ను ఎంచుకోవచ్చు. జీవన్ ఉమాంగ్ ద్వారా పన్నురహిత రాబడి పొందవచ్చు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications