భారతీ ఎయిర్ టెల్ కు చెందిన ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో వినూత్న బ్యాంక్ ఖాతాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఖాతా పేరు *భరోసా సేవింగ్స్ ఖాతా'. ఈ ఖాతా తెరిచిన కస్టమర్లు కనీస నిల్వను కొనసాగిస్తే ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ఖాతాలో ఎంత కనీస నిల్వ ఉండాలి, ఎంత ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది తదితర వివరాలు తెలుసుకుందామా...

కనీస నిల్వ రూ.500
* దేశంలో ఇప్పటికీ అనేక మందికి బ్యాంకు ఖాతా సదుపాయం అందుబాటులో లేదు. బీమా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ తెచ్చిన కొత్త ఖాతా ఈ రెండు అవసరాలను తీర్చేవిధంగా ఉంది.
* ఈ ఖాతాలో నెలవారీ కనీస నిల్వ కేవలం రూ.500 ఉంటే చాలు...రూ. 5 లక్షల ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని అందిస్తోంది.
* ఈ సదుపాయం లభించాలంటే నెలలో కనీసం ఒక డెబిట్ లావాదేవీ నిర్వహించాలి.
* ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తున్న సబ్సిడీలను తమ భరోసా ఖాతా ద్వారా పొందాలని నిర్ణయించుకున్నా లేదా ఖాతాలో నగదు డిపాజిట్ చేసినా కూడా క్యాష్ బ్యాక్ కు అర్హులని చెబుతోంది.
* మార్కెట్లో పరిశోధన చేసిన తర్వాతనే ఈ ఖాతాను అందుబాటులోకి తెచ్చినట్టు బ్యాంకు చెబుతోంది. ఈ ఖాతా ద్వారా అధికారిక బ్యాంకింగ్ లావాదేవీలు మరింతగా పెరగడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
* భరోసా సేవింగ్స్ ఖాతా కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న 6.50 లక్షలకు పైగా ఏఈపీఎస్ ఎనేబుల్డ్ ఔట్లెట్ల ద్వారా నగదును తీసుకోవచ్చు. తమ ఖాతాలో నిల్వను చెక్ చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మినీ స్టేట్ మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది.
* దేశంలో తొలుత ప్రారంభమైన పేమెంట్స్ బ్యాంక్ ఎయిర్ టెల్ పేమెంట్స్. ఇది సులభతరంగా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది.

మొబైల్ నెంబర్.. ఖాతానెంబర్ ఒకటే
* ఇప్పటికే ఎయిర్ టెల్ ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను అందిస్తోంది. ఖాతా దారు మొబైల్ నెంబరే వారి ఖాతా నెంబర్ గా ఉంటుంది.
* ఈ ఖాతాపై 4 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. ఆన్ లైన్ కార్డు కూడా ఉంటుంది. దీన్ని ఆన్ లైన్ లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చు.
* ఈ ఖాతాపై కూడా ఉచిత పర్సనల్ యాక్సిడెంట్ బీమాను అందిస్తున్నారు.
* లావాదేవీలు నిర్వహిస్తున్నదాన్ని బట్టి బీమా కాలపరిమితి పెరుగుతుంది.

నష్టం రూ. 339 కోట్లు
* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు పన్నుకు ముందు నష్టం రూ.338.8 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పన్నులకు ముందు నష్టం రూ.272.6 కోట్లుగా ఉంది.
* 2019 మార్చి 31 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మొత్తం రాబడి దాదాపు 59 శాతం పెరిగి రూ. 254 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications