For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందు ఈ పనులు చేయండి...

|

సంపాదిస్తున్న సొమ్మును సక్రమమైన మార్గంలో పెట్టుబడిగా పెడితే ఆ సొమ్ము మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఈక్విటీ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, బంగారం ఈటీఎఫ్ లు, బ్యాంకు డిపాజిట్లు, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల సంపదను మరింతగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టడానికి ముందు అందుకు అవసరమైన సొమ్మును పోగు చేసుకోవాలి. అందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేమిటంటే...

టీడీఎస్ లో కోత పడిందేమో చూసుకోండి...టీడీఎస్ లో కోత పడిందేమో చూసుకోండి...

ఖర్చుకన్నా... పొదుపు ముఖ్యం

ఖర్చుకన్నా... పొదుపు ముఖ్యం

* ఈ రోజుల్లో యువతకు మంచి వేతనాలు అందుతున్నాయి. తమ ఖర్చులకన్నా ఎక్కువగా సొమ్ము చేతికి అందుతుండటంతో అనవసర ఖర్చులు పెట్టడానికి కూడా సిద్దపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్ లో వారి వద్ద పోగుపడే సొమ్ము చాలా తక్కువగానే ఉంటుంది. కాబట్టి చేతికి అందుతున్న వేతనంలో మొదట కనీసం పది శాతమైనా పొదుపు చేసే ప్రయత్నం చేయాలి. వేతనం పెరిగే కొద్దీ దీన్ని 15 శాతం, 20 శాతం, 25 శాతానికి పెంచుకుంటూ పోవాలి. ఇలా పొదుపు చేస్తూ వెళితే ఆ సొమ్ము మీరు అనుకున్నదానికన్నా ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది.

* కొన్నాళ్ల పాటు పొదుపు చేసిన మొత్తాన్ని ఎక్కువ రాబడులు ఇచ్చే వాటిలోకి మళ్లించవచ్చు. రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈక్విటీ మార్కెట్లు లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. క్రమానుగత పెట్టుబడి ప్లాన్ లేదా టాక్స్ సేవింగ్ ఫండ్స్ లోను పెట్టుబడులు పెట్టవచ్చు.

అప్పులుంటే తీర్చేయండి..

అప్పులుంటే తీర్చేయండి..

* ఉన్నత విద్య లేదా కారు, లేదా ఇతర వ్యక్తిగత రుణాలు ఈ రోజుల్లో తీసుకుంటున్నవారు ఎక్కువే ఉంటున్నారు. అయితే ఇలా అప్పులున్న సందర్బంలో ఒక వైపు నెలవారీ వాయిదాలు చెల్లిస్తూ పొదుపు చేయాలనుకుంటే మీకు ఎక్కువ నష్టమే జరుగుతుంది. కాబట్టి నెలవారీ వాయిదాలు లేదా ఇతర అప్పులు ఉంటే ముందు వాటిని తీర్చివేయండి.

* ఆ తర్వాత మీ దగ్గర సొమ్ము నెలవారీగా మిగులుతుందని అనుకుంటే దాన్ని రీకరింగ్ డిపాజిట్లు లేదా స్వల్పకాలిక డెట్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి. వీటిలో రిస్క్ అంత ఎక్కువగా ఉండదు.

స్థిరాస్తి ఆలోచన అప్పుడే ఎందుకు?

స్థిరాస్తి ఆలోచన అప్పుడే ఎందుకు?

* చాలా మందికి సొంతిల్లు కొనుక్కోవాలన్నది కల. ఇందుకోసం తమ సంపాదన ప్రారంభం కాగానే ముందు ఇల్లును కొనిస్తుంటారు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉద్యోగం చేసేవారికి వారికి రుణాలు ఇచ్చేనందుకు పోటీపడుతున్నాయి. ఈనేపథ్యంలో ముందు వెనకా చూసుకోకుండా చాలా మంది ఇల్లును రుణంతో కొనుగోలు చేస్తున్నారు.

* రుణంతో ఇల్లు తీసుకోవడం వల్ల నెలవారీగా చెల్లించే ఈఎంఐ మొత్తమే భారీ స్థాయిలో ఉంటుంది. అలాంటప్పుడు మీ జీతంలో అధిక సొమ్ము ఇల్లుకే వెళితే ఇక మీరు ఇతర అవసరాల కొత్త పొదుపు చేసి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండదు. ఇల్లు కోసం ఇరవై ముప్పై ఏళ్ళు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇల్లు మాత్రమే మిగులుతుంది. దీని కోసం జీవితాంతం ఇతర ఖర్చుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇంటి విలువ బాగా పెరిగితే ప్రయోజనమే కానీ ఆ ఇంటిని అమ్ముకునే అవసరం రావొద్దు కదా ...

* అయితే మీ దీర్ఘకాలిక లక్ష్యం ఇల్లే అయితే బ్యాంకు నుంచి అధిక మొత్తంలో రుణం తీసుకునే అవసరం రాకుండా ఉండేలా ముందు మీ సొమ్మును మరింత పెంచుకునే ప్రయత్నం చేయండి. స్వల్పకాలానికి విభిన్న ఆర్ధిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టి సంపద పెరిగిన తర్వాత ఇంటి కల నెరవేర్చుకోండి...

English summary

పెట్టుబడులు పెట్టాలనుకుంటే ముందు ఈ పనులు చేయండి... | Things to consider before you make investing decisions

If you intend to purchase securities - such as stocks, bonds, or mutual funds - it's important that you understand before you invest that you could lose some or all of your money.
Story first published: Monday, July 22, 2019, 10:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X