ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకులు జూలై నెల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సమీక్షించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకులు వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. ఆర్బీఐ జూన్ నెలలో రెపో రేటును 0.25 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో 5.75గా ఉంది. దీంతో బ్యాంకులు తమ సేవలపై వడ్డీ రేటును సమీక్షించాయి.

HDFC ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు
HDFC సమీక్షించిన FD వడ్డీ రేట్లు జూలై 22వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పైన 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 5.5 శాతం వడ్డీని, 46 రోజుల నుంచి 6 నెలల వరకు 6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. వన్ ఇయర్ మెచ్యూరిటీ పైన 7.10 శాతం, 1 నుంచి 2 ఏళ్ల వరకు 7.20 శాతం, 2-3 ఏళ్ల మధ్య 7.30 శాతం, 3-5 ఏళ్ల మధ్య 7.25 శాతం వడ్డీని, లాంగ్ టర్మ్ FDలకు సంబంధించి 5-10 ఏళ్ల మెచ్యూరిటీ పైన 7 శాతం వడ్డీని ఇస్తోంది.

PNB ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు
పంజాబ్ నేషనల్ బ్యాంకు 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 5.50 శాతం, 46 రోజుల నుంచి 333 రోజుల వరకు 6.75 శాతం, ఏడాది FDపై 6.8 శాతం వడ్డీని, ఏడాది నుంచి మూడేళ్ల మధ్య 6.75 వడ్డీని, మూడేళ్ల నుంచి పదేళ్ల మధ్య 6.25 శాతం వడ్డీని అందిస్తోంది.

IDFC ఫస్ట్ బ్యాంకు
IDFC ఫస్ట్ బ్యాంకు ఏడు రోజుల నుంచి 90 రోజుల మధ్య 6.5 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల మధ్య 8.5 శాతం, రెండేళ్ల నుంచి అయిదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ పైన 7.50 శాతం, అయిదేళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య 7.25 శాతాన్ని ఆఫర్ చేస్తోంది.

Axis బ్యాంకు
ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పైన యాక్సిస్ బ్యాంకు ఏడు రోజుల నుంచి 6 నెలల మెచ్యూరిటీ పీరియడ్‌కు 6.25 శాతం, ఆరు నుంచి 9 నెలలకు 6.50 శాతం, 9 నెలల నుంచి ఏడాదికి 7 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల వరకు 7.2 శాతం, రెండేళ్ల నుంచి అయిదేళ్ళ మెచ్యూరిటీ పీరియడ్ పైన కూడా 7.2 శాతం అందిస్తోంది. అయిదేళ్ల నుంచి పదేళ్ల మెచ్యూరిటీకి గాను 7 శాతం అందిస్తోంది. ఈ బ్యాంకు సమీక్షించిన వడ్డీ రేట్లు 10 జూలై 2019 నుంచి అందుబాటులోకి వచ్చాయి. రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్‌కు వర్తిస్తుంది.

కొటక్ మహీంద్రా బ్యాంకు
కొటక్ మహీంద్రా బ్యాంకు సమీక్షించిన వడ్డీ రేట్లు 20 జూలై 2019 నుంచి అమల్లోకి వచ్చాయి. 81 రోజుల నుంచి 279 రోజుల మధ్య 5.4 శాతం, 280 రోజుల నుంచి ఏడాది వరకు 7 శాతం, ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు 7.10 శాతం ఆఫర్ చేస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడు రోజుల నుంచి 90 రోజుల వరకు 4.75, 91 రోజుల నుంచి ఏడాది వరకు 6.25 శాతం ఆఫర్ చేస్తోంది. ఏడాది టర్మ్ డిపాజిట్ పైన 6.45 శాతం, ఏడాది నుంచి రెండేళ్ల డిపాజిట్స్ పైన 6.55 శాతం, రెండేళ్ల నుంచి పదేళ్ల మధ్య 6.45 శాతం ఆఫర్ చేస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications