For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్టుబడులు వివిధీకరించుకోండి.. లేకుంటే కొంప మునుగుతుంది జాగ్రత్త...

By Jai
|

మీ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకున్నప్పుడు కొంత సమయం తీసుకుని అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో చెప్పారని ఏమీ తెలుసుకోకుండా పెట్టుబడి పెడితే కలిగే నష్టం మేకేనన్న విషయాన్ని మరచిపోవద్దు. డబ్బులు సంపాదించడానికి రోజులు, నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఆ సొమ్మును పోగొ ట్టుకోవడానికి మాత్రం నిమిషాలు చాలు. అందుకే ముందు వెనుకా చూసుకోవాలి. పెట్టుబడులకు ఉన్న మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాతనే ముందడుగు వేయాలి.

బ్యాంకుల కంటే మంచి ఆఫర్, ఇలా మీ డబ్బు రెండింతలు అవుతుందిబ్యాంకుల కంటే మంచి ఆఫర్, ఇలా మీ డబ్బు రెండింతలు అవుతుంది

అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెడితే ఎలా?

అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెడితే ఎలా?

ఈ మాట ఇప్పటికే విని ఉంటారు. గుడ్లన్నీ ఒకే బుట్టలో ఉన్నప్పుడు ఆ బుట్ట కింద పడితే ఒక్క గుడ్డు కూడా చేతికి అందదు. ఇదే పెట్టుబడులకు కూడా వర్తిస్తుతుంది. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారి విషయానికి వస్తే... ఈ మార్కెట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు కుప్పకూలుతాయో ఊహించడం ఎవరి తరం కాదు. లాభాలు వచ్చినప్పుడు అందరికి సంబరంగానే ఉంటుంది. నష్టాలు వచ్చినప్పుడు మాత్రం గోడచాటుకు వెళ్లి ఘొల్లుమంటారు. కానీ చేసేది ఏమి ఉండదు. ఖాతా చూస్తే ఖాళీ అయి ఉంటుంది.

పెట్టుబడులు విభజించుకోండి..

పెట్టుబడులు విభజించుకోండి..

మీ చేతిలో ఉన్న సొమ్మును ఏదో ఒక దాంట్లో మాత్రమే పెట్టుబడిగా పెట్టకండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే మీ పెట్టుబడులు మొత్తం గాల్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది.

* మీకు స్టాక్ మార్కెట్ మీద అవగాహన ఉంటే దానికి కొంత సొమ్ము కేటాయించండి.

* స్టాక్ మార్కెట్ వద్దనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోండి.

* బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందుకే బంగారంలోను కొంత పెట్టుబడి పెట్టండి. ఒకవేళ స్టాక్ మార్కెట్ కుప్పకూలినా మీ పెట్టుబడులను బంగారం రక్షిస్తుంది. బంగారాన్ని భౌతికంగా లేదా ఈటీఎఫ్ ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. బంగారం ధరలో భారీ స్థాయిలో క్షీణత ఉండదు. ఒకవేళ కొన్ని రోజులు తగ్గినా మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి మీ పెట్టుబడికి రక్షణ ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. లేదా తనఖా పెట్టి నగదు పొందవచ్చు. ప్రతి ఇన్వెస్టర్ పోర్టుఫోలియోలో బంగారం తప్పనిసరిగా ఉండాలని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.

* డెట్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు.

* పెట్టుబడుల రక్షణకు ఉన్న వాటిలో రియల్ ఎస్టేట్ కూడా ఒకటి. ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే ధరలు పెరగడానికి అవకాశం ఉండే చోట ప్లాటు లేదా ఫ్లాటు కొనుగోలు చేయవచ్చు. ధరలు పెరిగితే పెద్ద మొత్తంలో లాభం రావడానికి అవకాశం ఉంటుంది.

*పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, ప్రభుత్వం జారీ చేసే బాండ్లు, ఆర్బీఐ జారీ చేసే బాండ్లలోను పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో పెట్టుబడులకు భరోసా ఉంటుంది.

* బ్యాంకు డిపాజిట్లలోనూ కొంత సొమ్మును పెట్టాలి. దీనిపై స్థిర ఆదాయం వస్తుంది. అంతే కాకుండా ఎప్పుడంటే అప్పుడు సొమ్మును వెనక్కు తీసుకోవచ్చు.

*ఆడ పిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు.

* పెళ్లి కానీ వారు తమ భవిష్యత్ కలలను సాకారం చేసుకోవడానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెట్టుబడులు ప్రారంభించాలి. పెళ్లయిన వారు తమ పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలు కోసం పెట్టుబడులు పెట్టడమే మంచిది.

పెట్టుబడులు మార్చుకోండి...

పెట్టుబడులు మార్చుకోండి...

* మీరు పెట్టిన పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. పెట్టుబడి పెట్టి మరచిపోతే ఆ సొమ్ము ఏమైనా కావొచ్చు. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు మార్కెట్ నష్టాల బాటలో సాగితే పెట్టుబడులను ఉపసంహరించుకుని బయటపడాలి. లేకపోతే మొత్తం పెట్టుబడుల విలువ కరిగిపోయే అవకాశం ఉండవచ్చు.

* ఏదైనా పెట్టుబడి పై ఆశించిన స్థాయిలో రాబడి రాకపోతే వెంటనే ఉపసంహరించుకుని రాబడి ఎక్కువ వస్తున్న దాంట్లోకి మళ్లించాలి.

English summary

పెట్టుబడులు వివిధీకరించుకోండి.. లేకుంటే కొంప మునుగుతుంది జాగ్రత్త... | should you deversify your investments?

Mutual fund distributions consist of net capital gains made from the profitable sale of portfolio assets, along with dividend income and interest earned by those assets.
Story first published: Saturday, June 29, 2019, 11:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X