మీ స్నేహితుడు, కుటుంబ సభ్యులు లేదా తెలిసిన వారు బ్యాంకు లేదా ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి తీసుకునే రుణానికి మీరు హామీదారు సంతకం చేయబోతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. దాని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకున్న తర్వాతనే సంతకం చేయండి. అది మీకే మంచిది. మనవారే, తెలిసినవారే కాదా అని చాలా మంది హామీ దారు సంతకాన్ని ఆటోగ్రాఫ్ అడిగితే సంతకం చేసినంత ఈజీగా చేసేస్తారు. దాని గురించి కొన్ని రోజుల తర్వాత మరిచి పోతారు.
మీరు హమీదారు సంతకం పెట్టిన వ్యక్తి రుణాన్ని చెల్లించడం మానేస్తే అప్పుడు ఉంటుంది అసలు మజా. ఆ రుణ బాధ్యత మీ మెడకు చుట్టుకుంటే గాని తెలియదు మీ సంతకానికి ఉన్న పవర్ ఏంటో? అందుకే ఒకరు తీసుకునే రుణానికి హమీదారు సంతకం చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అవసరమైతే సంతకం చేయలేను అని మొహమాటం లేకుండా చెప్పేయాలి. మొహమాటం కన్నా సంతకం చేస్తే ఆ తర్వాత మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త. సాధారణంగా గృహ రుణం, విద్యారుణానికి హమీదారు అవసరం ఉంటుంది.

హమీదారు అవసరం ఎప్పుడు ఉంటుందంటే..
బ్యాంకులు కొన్ని సందర్భాల్లో ఇచ్చే రుణానికి ఎవరో ఒకరి హామీ సంతకం కావాలని కోరుతుంటాయి. రుణం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు, రుణ మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు, దరఖాస్తుదారు చేస్తున్న ఉద్యోగం రిస్కుతో కూడుకున్నప్పుడు బ్యాంకులు మంజూరు చేసే రుణానికి హమీదారు సంతకం కోరుతుంటాయి. కొన్ని బ్యాంకులు కచ్చితంగా హమీదారు ఉంటేనే రుణాన్ని ఇస్తుంటాయి.

నమ్మకముంటేనే సంతకం పెట్టండి
మీకు బాగా తెలిసిన వారు తీసుకునే రుణానికి మాత్రమే హమీదారు సంతకం చేయడం మంచిది. అతను రుణం ఇందుకోసం తీసుకుంటున్నాడు, దాని వినియోగం ఏవిధంగా ఉంటుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నదా లేదా అనేది తెలుసుకొని మాత్రమే సంతకం చేయండి. లేకపోతే ఆ రుణ ఊబిలో మీరు చిక్కుకు పోతారు.

మీ క్రెడిట్ స్కోర్ కు దెబ్బ
బ్యాంకులు తమ వద్ద రుణం తీసుకున్న వారిని ఆ రుణానికి హామీ ఇచ్చిన వారిని ఒకే విధంగా పరిగణిస్తాయి. ఒకవేళ రుణం తీసుకున్న వారు చెల్లించకపోతే ఆ భాద్యత మీమీదే ఉంటుంది మరి. అందుకే రుణం తీసుకున్న వారు ఆ రుణాన్ని ఎగవేస్తే దాని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ పై పడుతుంది.మీరు రుణానికి హామీ దారుగా ఉన్నప్పుడు మీకు సంబంధించిన వివరాలు కూడా క్రెడిట్ స్కోర్ కంపనీలకు బ్యాంకులు అందజేస్తాయి. అందుకే రుణ ఎగవేత ప్రభావం మీపై కూడా ఉంటుంది. అంతే కాకుండా మీరు మీ అవసరం కోసం రుణం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ రుణ చెల్లింపు సామర్థ్యాన్ని బ్యాంకులు లెక్కించి నిర్ణయం తీసుకుంటాయి.

ఏం చేయాలంటే...
మీరు ఒకరి రుణానికి హమీదారుగా ఉండాలనుకుంటే మీ బాధ్యత ఎంత వరకు ఉంటుందో బ్యాంకును అడిగి తెలుసుకోండి. నిబంధనలకు అంగీకరిస్తూ సంతకం చేసేముందు ఒక్కసారి మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లోని వివరాలు క్షుణ్ణంగా చదవండి.అనుమానాలు ఉంటే బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోండి. మీ భాద్యత తక్కువ ఉండేలా చూసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications