For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI గుడ్‌న్యూస్: SBI, HDFC, ICICI, PNB ఆర్టీజీఎస్ టైమింగ్స్, ఛార్జీలు

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం (RTGS) ద్వారా చేసే కస్టమర్ ట్రాన్సాక్షన్ సమయాన్ని పెంచింది. లాస్ట్ కట్ ఆఫై టైమింగ్స్ సమయాన్ని సాయంత్రం గం.4.30 నుంచి సాయంత్రం గం.6.00 పెంచారు. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ఈ ట్రాన్సాక్షన్లు మూడు విండోలుగా ఉన్నాయి. ఉదయం గం.8 నుంచి గం.11 వరకు, మధ్యాహ్నం గం.11 నుంచి గం.1 వరకు, మధ్యాహ్నం గం.1 నుంచి సాయంత్రం గం.6 వరకు.

అదనపు ఛార్జీ

అదనపు ఛార్జీ

మొదటి విండో ద్వారా చేసే ట్రాన్సాక్షన్‌కు ఫిక్స్‌డ్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. కానీ అడిషనల్ ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత రెండు, మూడో విండోలకు మాత్రం వరుసగా రూ.2, రూ.5 అదనపు ఛార్జీ విధిస్తారు. ఇదివరకు కట్ ఆఫ్ టైమింగ్స్ సాయంత్రం గం.4.30 వరకు ఉండగా, దానిని గం.6 వరకు పెంచామని, మధ్యాహ్నం గం.1 నుంచి సాయంత్రం గం.6 వరకు చేసే ట్రాన్సాక్షన్‌కు రూ.5 వసూలు చేస్తారని ఆర్బీఐ ప్రకటించింది.

ఆర్టీజీఎస్ సేవలు

ఆర్టీజీఎస్ సేవలు

హైవ్యాల్యూ ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కోసం ఫాస్టెడ్ పేమెంట్ మెథడ్ ఆర్టీజీఎస్. గరిష్టంగా రూ.2 లక్షల మొత్తం ఇన్‌స్టాంట్ మనీ ట్రాన్సుఫర్ సర్వీస్ ఇమ్మిడియేడ్ పేమెంట్ సర్వీస్ (IMPS). రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చేసే పేమెంట్ సర్వీస్ ఆర్టీజీఎస్. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బ్యాంకులు, కస్టమర్లు మొత్తంగా 1.14 కోట్ల ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్‌లు రూ.112 లక్షల కోట్ల మేర చేసుకున్నారు. ఆర్టీజీఎస్ సేవలను ఆయా బ్యాంకులు కూడా అందిస్తున్నాయి. ఆయా బ్యాంకుల ఛార్జీలు, టైమింగ్స్ ఇలా ఉన్నాయి.

ఎస్బీఐ

ఎస్బీఐ

SBIలో ఉదయం గం.9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.25 ఛార్జ్ వసూలు చేస్తారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ అయితే రూ.51.

మధ్యాహ్నం గం.12 నుంచి మధ్యాహ్నం గం.15.30 వరకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.26 వసూలు చేస్తారు. రూ.5 లక్షల కంటే ఎక్కువకు రూ.52.

మధ్యాహ్నం గం.15.30 నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.31 వసూలు చేస్తారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ అయితే రూ.56 వసూలు చేస్తారు.

ఐసీఐసీఐ మరియు హెచ్‌డీఎఫ్‌సీ

ఐసీఐసీఐ మరియు హెచ్‌డీఎఫ్‌సీ

ఐసీఐసీఐలో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.25+అప్లికబుల్ జీఎస్టీ

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రూ.50+అప్లికబుల్ జీఎస్టీ

హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు ఛార్జీ వసూలు చేయడం లేదు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకు

పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉదయం గం.8 నుంచి మధ్యాహ్నం గం.11 వరకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.25+జీఎస్టీ. రూ.5 లక్షల కంటే పైన అయితే రూ.50+జీఎస్టీ.

మధ్యాహ్నం గం.11 నుంచి గం.1 వరకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.27+జీఎస్టీ. రూ.5 లక్షల కంటే ఎక్కువ అయితే రూ.52+జీఎస్టీ.

మధ్యాహ్నం గం.1 నుంచి సాయంత్రం గం.6 వరకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య రూ.30+జీఎస్టీ. రూ.5 లక్షల కంటే ఎక్కువ అయితే రూ.55+జీఎస్టీ.

సాయంత్రం గం. తర్వాత రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రూ.30+జీఎస్టీ. రూ.5 లక్షల కంటే ఎక్కువ పైన రూ.55+జీఎస్టీ.

English summary

RBI గుడ్‌న్యూస్: SBI, HDFC, ICICI, PNB ఆర్టీజీఎస్ టైమింగ్స్, ఛార్జీలు | RBI extends last cut off timing for RTGS transactions from 4.30 pm to 6pm

The Reserve Bank of India has extended the last cut-off timing for customer transactions through Real Time Gross Settlement Systems (RTGS) from 4.30pm to 6pm on all working days, effective June 1, 2019.
Story first published: Sunday, June 2, 2019, 19:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X