సాధారణంగా గృహ రుణాల మొత్తం అధికంగా ఉండడంతో పాటు ఎక్కువ కాలం పాటు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే కనీసం ఇరవై, పాతిక లక్షల నుంచి మొదలయ్యే హౌసింగ్ లోన్.. పదిహేను నుంచి ఇరవై ఏళ్ల వరకూ వెళ్తుంది. ఇది లాంగ్ టర్మ్ కమిట్‌మెంట్. వడ్డీ రేట్‌లో పావు శాతం మార్పు కూడా ఈఎంఐ భారాన్ని అమాంతం పెంచేస్తుందని చాలా మందికి తెలియదు. అయితే దీన్ని తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలను మీకు సూచిస్తున్నారు నిపుణులు.

హోం లోన్ ట్రాన్స్‌ఫర్
ఈ మధ్యకాలంలో హోం లోన్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్‌ను చాలా మంది వినియోగించుకుంటున్నారు. ఉదాహరణకు మీరు హెచ్‌డిఎఫ్‌సిలో 9.5 శాతం వడ్డీకి మీరు హోం లోన్‌ను నాలుగైదేళ్ళ క్రితం తీసుకున్నారని అనుకుందాం. కానీ ఎస్బీఐలో మాత్రం ప్రస్తుతం వడ్డీ 9 శాతమే ఉన్నా.. మీ బ్యాంక్ తగ్గించడం లేదనుకోండి. అప్పుడు మీరు హోం లోన్ ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు. లేదా కొన్ని బ్యాంకులతో పోలిస్తే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తక్కువ వడ్డీకి లోన్ ట్రాన్స్‌ఫర్‌ను అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా అదనపు ప్రాసెసింగ్ ఫీజును (కన్వర్షన్ ఫీజ్) మీరు చెల్లించి మీరు స్విచ్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వడ్డీ రేట్లను ఎంసిఎల్ఆర్‌కు లింక్ చేసిన బ్యాంకులకు మీరు షిఫ్ట్ అయితే మంచిది. (ఎంసిఎల్ఆర్ - మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్)ను లింక్ చేసిన బ్యాంకుల్లో ఎస్బీఐ ముందు వరుసలో నిలిచింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించినప్పుడల్లా తక్షణమే ఈ రేట్ కూడా మారుతుంది. ఈ మధ్య బ్యాంకులు వడ్డీ రేట్లను సవరణకు కొన్ని తేదీలను పెట్టుకుంటున్నాయి. సదరు తేదీనాటికి ఏవైనా మార్పులు ఉంటే చేస్తున్నాయి. లేకపోతే అధిక వడ్డీ రేటును చెల్లించి మనమే నష్టపోతున్నాం.
అందుకే ఎంసిఎల్ఆర్‌కు వడ్డీ రేటును లింక్ చేసిన బ్యాంకులను ఎంచుకుంటే మీకు వడ్డీ భారం తగ్గుతుంది. అయితే ఇక్కడ మెలిక ఏంటంటే.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ఈ ఎంసిఎల్ఆర్ వర్తించదు.

హోం లోన్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోండి
కొన్ని బ్యాంకులు అందించే హోం లోన్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని పొందండి. మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు ఉంటే వాటిని ఈఎంఐతో కలిపి కట్టేయొచ్చు. అది పదివేలైనా సరే.. పాతికవేల మొత్తమైనా సరే. అవన్నీ మీ హోం లోన్ ఖాతాలో సదరు డబ్బులు జమవుతాయి. ఈ అదనపు మొత్తాన్ని హోం లోన్ ప్రీపేమెంట్‌గా పరిగణిస్తారు. అలాంటప్పుడు ఆ డబ్బును ఈ ఖాతాలో జమ చేసేయండి. దీంతో భవిష్యత్తులో మీరు చెల్లించబోయే లోన్ ప్రిన్సిపల్ మొత్తంతో పాటు వడ్డీ భారం కూడా తగ్గుతుంది.

హోం లోన్ ప్రీపేమెంట్
చేతుల్లో డబ్బులున్నా ప్రతీసారీ హౌసింగ్ లోన్‌ను తీర్చేయడానికే మొదటి ప్రాధాన్యతను ఇవ్వండి. కొంత మంది ఉద్యోగులకు ఏడాదిలో ఒక్కోసారి బోనస్‌లు లేదా పెద్ద మొత్తంలో డబ్బులు అందుతూ ఉంటాయి. అప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోం లోన్ ప్రీపేమెంట్ చేసేయండి. దీనివల్ల వడ్డీ భారం గణనీయంగా తగ్గడంతో పాటు మీరు వడ్డీ చెల్లించే సమయం కూడా తగ్గిపోతుంది.
ఉదాహరణకు మీరు 20 ఏళ్ల సమయానికి 10 శాతం వడ్డీతో రూ.30 లక్షల రుణం తీసుకున్నారనుకోండి. అందులో 5 ఏళ్ల సమయం ఇప్పటికే పూర్తైందనుకోండి. ఇప్పుడు మీరు రూ.2 లక్షల మొత్తాన్ని ప్రీపేమెంట్ చేస్తే.. మీకు కలిగే లాభం అక్షరాలా రూ.6 లక్షలు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కేవలం రూ.2 లక్షల ప్రీపేమెంట్ వల్ల మీకు కలిగే ప్రయోజనం రూ.5,96,254. అంతేకాదు మీరు ఈఎంఐ చెల్లించే భారం 240 నెలలు(20ఏళ్లు) నుంచి 213 నెలలకు తగ్గుతుంది కూడా. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రీ పేమెంట్ ఎంతటి భారాన్ని తగ్గిస్తుందో.

వడ్డీ రేట్లపై ఓ కన్నేయండి
ఈ మధ్య టెక్నాలజీ పెరిగిన తర్వాత వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆన్ లైన్‌లో ఎప్పటికప్పుడు వీటిపై దృష్టిపెట్టండి. మనం రుణం తీసుకున్నా బ్యాంక్ ఎంత వడ్డీకి రుణమిచ్చింది, ఇతర బ్యాంకుల్లో ఎంతుంది, ఒకవేళ లోన్ స్విచ్ అయితే ఎంత ప్రయోజనం ఉంటుంది, ఎలాంటి ఛార్జీలు విధిస్తున్నారు, ఇంకేవైనా అదనపు రుసుములు ఉన్నాయా వంటివి కూడా చూడండి. అప్పటికప్పుడు ఓ నిర్ణయాన్ని తీసుకునేందుకు మీకు వెసులుబాటు కలుగుతుంది. మన డబ్బు కాబట్టి మనమే రీసెర్చ్ చేయాలి. నాలుగు రాళ్ల వెనకేసుకోవాలంటే స్మార్ట్‌గా ఉండాలి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications