ఎవరికైనా సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా అకేషన్ అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అకేషన్ లేకుండా ఇచ్చే బహుమతి పట్ల అవతలి వారు ఎంతో ఆనందపడతారు. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి మొదలు దాదాపు ఎన్నో రకాలుగా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే వీసా మంచి ఆఫర్ ఇస్తోంది. వివిధ మార్గాల్లో డిస్కౌంట్, మంచి డీల్స్ ఇస్తోంది. ఇది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉంది. వీసా కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అవేమిటో తెలుసుకుందాం....

బుక్ మై షో
వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును ఉపయోగించి బుక్ మై షో ద్వారా పేమెంట్ చేస్తే 50 శాతం ఫ్లాట్ ఆఫర్ ఉంది. గరిష్టంగా రూ.300. బుక్ మై షో ద్వారా కనీసం రెండు టిక్కెట్లు బుక్ చేస్తే ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ వర్తిస్తుంది.

గోల్డ్స్ జిమ్ ఔట్‌లెట్
ఇప్పుడు అందరూ ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందుకోసం చాలామంది జిమ్‌లకు వెళ్తున్నారు. గోల్డ్స్ జిమ్ ఔట్‌లెట్‌లలో ప్రోమో కోడ్ వినియోగించి వీసా కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే 50 శాతం ఫ్లాట్ ఆఫర్ ఉంది. గరిష్టంగా రూ.300.

జూమ్‌కార్
వీసాకార్డు చెల్లింపుతో జూమ్‌కార్‌లో కూడా డిస్కౌంట్ ఉంది. 20 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశముంది. వీసా ఆఫర్స్ సైట్‌లోకి వెళ్లి జూమ్ కార్ ఆఫర్స్‌పై జనరేట్ కూపన్ కోడ్‌ను క్లిక్ చేయడం ద్వారా మీకు యూనిక్ కూపన్ కోడ్ వస్తుంది. ఆ తర్వాత మీ వీసా కార్డు ఫస్ట్ ఎనిమిది డిజిట్స్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడి అడుగుతుంది. మీకు కోడ్ ఎస్సెమ్మెస్ లేదా మెయిల్ ద్వారా వస్తుంది.

అర్బన్ క్లాప్
హెల్త్, వెల్త్, హోమ్ మసాజ్ లేదా హోమ్ షిఫ్టింగ్ వంటి వాటికి చెల్లింపులు జరిపే సమయంలో 15 శాతం డిస్కౌంట్ ఉంది. దీనికి ప్రోమోకోడ్ ఉపయోగించాలి. ఇందుకోసం అర్బన్ క్లాప్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించాలి. గానాప్లస్‌లో కూడా 70 శాతం వరకు ఆఫర్ ఉంది. దీనికి కూడా కూపన్ కోడ్ ఉపయోగించాలి.


Click it and Unblock the Notifications