For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయ్ ! ఇప్పుడిలా చేస్తేనే లాభం

By Chanakya
|

ఫిక్సెడ్ డిపాజిట్లు. భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి సాధనం. ఒకప్పుడే కాదు.. ఇప్పుడు కూడా చాలా మంది ఎఫ్.డిలకే అధిక ప్రాధాన్యతనిస్తారు. మన పాత జనరేషన్లు అన్నీ తమ డబ్బును ఎక్కువ కాలం దాచుకునేందుకు ఈ ఒక్క మార్గాన్ని తప్ప వేరే రూట్ పొరపాటున కూడా సెలక్ట్ చేసుకునే వారు కాదు. అయితే ఇప్పుడు అలా కాదు. ఎన్నో పెట్టుబడి ఆప్షన్స్ ఉన్నా.. ఇంకా కొంత మందికి ఎఫ్.డిలు అంటేనే ఇష్టం. అయితే వడ్డీ రేట్లు పడిపోతున్న నేపధ్యంలో వీటిల్లో పెట్టుబడి పెట్టేవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాల్సిన టైమొచ్చింది.

రెపో రేటు ఎఫెక్ట్: డిపాజిట్లపై ICICI, యాక్సిస్, కొటక్ వడ్డీరెపో రేటు ఎఫెక్ట్: డిపాజిట్లపై ICICI, యాక్సిస్, కొటక్ వడ్డీ

వడ్డీరేట్లు పడిపోతున్నాయా ?

వడ్డీరేట్లు పడిపోతున్నాయా ?

అవును.. వడ్డీ రేట్లు దిగొస్తున్నాయి. గత కొద్దికాలం నుంచి ఆర్బీఐ స్టాండ్ మారింది. ద్రవ్యోల్బణం అందుబాటులో ఉన్న నేపధ్యంలో రిజర్వ్ బ్యాంక్.. వడ్డీ రేట్లను తగ్గించేందుకే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ ఏడాదిలోనే ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ రెపో రేట్‌ను 0.75 శాతం తగ్గించింది. అయితే ఈ స్థాయిలో కాకపోయినా బ్యాంకులు కూడా కొద్దోగొప్పో వడ్డీ రేట్లను తగ్గించాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్లకంటే తక్కువున్న, ఐదేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై ఇంట్రెస్ట్ రేట్‌ను 6.85 నుంచి 6.6 శాతానికి తగ్గించింది. ఈ లెక్కన పావు శాతం వడ్డీ రేట్లు ఫిక్సెడ్ డిపాజిట్లపైన కూడా తగ్గాయి.

ఇప్పుడేం చేయాలి

ఇప్పుడేం చేయాలి

పడిపోతున్న వడ్డీ రేట్లు ఇన్వెస్టర్లకు చేదువార్త. అయితే హౌసింగ్, పర్సనల్, వెహికల్ లోన్ తీసుకున్న వాళ్లకు మాత్రం గుడ్ న్యూసే. ఎందుకంటే ఈఎంఐల భారం గణనీయంగా తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.

రాబోయే రోజుల్లో కూడా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఎఫ్.డి.ల స్థానంలో కొద్దిగా డెట్ ఫండ్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే సాధారణ బ్యాంకులతో పోలిస్తే వీళ్ల దగ్గర ఇంట్రెస్ట్ రేట్ కొద్ది ఎక్కువగా వర్కవుట్ అవుతుంది. కొన్న సందర్భాల్లో 2 శాతం వరకూ ఎక్కువ వడ్డీ ఆదాయం లభించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

చిన్న బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కదా ?

చిన్న బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కదా ?

పెద్ద బ్యాంకుల కంటే చిన్న బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే. ప్రధానంగా కో ఆపరేటివ్ బ్యాంకులు, సొసైటీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఒకటి నుంచి రెండు శాతం ఎక్కువగా వడ్డీని ఇస్తాయి. అయితే వీటిల్లో ఎంత వరకూ సేఫ్ అనే సంగతిని కూడా మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆర్బీఐ.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ స్కీం కింద ఇలాంటి వాటిల్లో ఎంత పెట్టుబడి పెట్టినా మనకు కేవలం రూ. లక్ష వరకూ మాత్రమే గ్యారెంటీ ఉంటుంది. అందుకే చిన్న బ్యాంకుల్లో ఎఫ్.డీ.లు చేసే ముందు బాగా ఆలోచించుకుని తక్కువ మొత్తాలకే పరిమితం కావాలనే సూచన చేస్తున్నారు నిపుణులు.

చివరగా..

చివరగా..

చెప్పేదేంటంటే.. ఇది వడ్డీ రేట్లు తగ్గే కాలం. అందుకే ఎఫ్.డిల్లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నప్పుడు ఎక్కువ కాలానికి ఎఫ్.డి. చేయండి. అప్పుడు కాస్త రేట్ ఎక్కువగా వస్తుంది. అంతే కాదు ఒక వేళ మూడు లక్షలు డిపాజిట్ చేద్దామనుకున్నప్పుడు దాన్ని రెండు భాగాలుగా చేసి లక్షన్నర చొప్పున డిపాజిట్ చేయండి. మీకు ఏదైనా అవసరమొచ్చి ముందే తీయాల్సివచ్చినప్పుడు ఒక్క బాండ్ తీస్తే సరిపోతుంది. దాని వల్ల వడ్డీ లాస్ కాకపోవడంతో పాటు, పెనాల్టీల ఇబ్బంది కూడా ఉండదు.

ఒక్క ఫిక్సెడ్ డిపాజిట్లకే పరిమితం కాకుండా డెట్ ఫండ్స్‌ను కూడా పరిగణలోకి తీసుకోండి. వీలైతే 40-50 శాతం మొత్తాన్ని వాటివైపునకు కూడా మళ్లించండి. అది రిస్క్‌ను తగ్గించడంతో పాటు లాభాలను కూడా పెంచుతుంది.

English summary

ఫిక్సెడ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయ్ ! ఇప్పుడిలా చేస్తేనే లాభం | Fixed Deposit interest rates dropping

In the past, it has been observed and recorded that banks reduce deposit rates swiftly in a falling rate regime, while not being equally quick to raise deposit rates when the benchmark rates go up.
Story first published: Monday, June 24, 2019, 15:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X