For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బు సంపాదించడం ఎలా?, మీకు ఫేస్‌బుక్ ఫ్రీగా చెప్పనుంది

|

ప్రస్తుతం చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ పైన దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగాలు, బ్యాంకులు, బంగారం, మార్కెట్లు, రియల్ ఎస్టేట్.. ఇలా ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియని వారు తెలిసిన వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా ఇలాంటి సూచనలు ఇవ్వనుందట.

రైల్వే టిక్కెట్ దాదాపు ఉచితం!!: SBI కార్డుతో ఇలా చేయండి...రైల్వే టిక్కెట్ దాదాపు ఉచితం!!: SBI కార్డుతో ఇలా చేయండి...

డబ్బు ఎలా సంపాదించాలి

డబ్బు ఎలా సంపాదించాలి

ఈ మేరకు ఫేస్‌బుక్ ఓ ప్రకటన చేసింది. 2 బిలియన్ల మంది యూజర్లకు డబ్బును ఎలా సంపాదించాలి, హానికరమైన కంటెంట్ తొలగింపు వంటి వాటిపై అవగాహన కల్పించే వివరాలు ఇస్తామని తెలిపింది. ఇది జూలై 31వ తేదీ నుంచి అందుబాటులోకి రానుందట. ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇది క్రిప్టో కరెన్సీ రంగంలోకి అడుగు పెట్టింది. లిబ్రా పేరుతో సొంత క్రిప్టో కరెన్సీని విడుదల చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది.

దానికి చార్జ్ ఉండదు

దానికి చార్జ్ ఉండదు

డబ్బు సంపాదన, హానికరమైన కంటెంట్ తొలగింపు తదితర అంశాలపై ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్, అసోసియేట్ జనరల్ కౌన్సెల్ అన్నా బెంకెర్ట్ మాట్లాడుతూ... మనం డబ్బు ఎలా సంపాదించాలనే అంశంపై తాము మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. బిజినెస్ పీపుల్, పలు సంస్థలు తమ యాడ్స్ వేసినందుకు డబ్బులు చెల్లిస్తున్నాయని, కాబట్టి ఇలాంటి సూచనలకు తాము మీ నుంచి డబ్బులు వసూలు చేయమని స్పష్టం చేశారు.

కంటెంట్ డిలీట్ చేస్తే...

కంటెంట్ డిలీట్ చేస్తే...

అలాగే, ఫోటోలు, వీడియోలు వంటి తమ సొంత కంటెంట్‌ను షేర్ చేసుకున్నప్పుడు, వారు మేథో సంపత్తి హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఆ కంటెంట్‌ను ప్రదర్శించేందుకు మీరు అనుమతి ఇచ్చారని, ఎప్పుడైతే ఫేస్‌బుక్ నుంచి డిలీట్ చేస్తారో ఆ పర్మిషన్ ముగిసిపోతుందన్నారు. మీరు షేర్ చేసిన కంటెంట్ తొలగించిన అంశాలకు సంబంధించిన వివరాలు కూడా ప్రొవైడ్ చేస్తుందన్నారు. ఉదాహరణకు, మీరు షేర్ చేసిన ఏదైనా కంటెంట్, మీరు డిలీట్ చేశాక అది కనిపించదు. అయితే తమ సిస్టం నుంచి తొలగించేందుకు 90 రోజుల సమయం పడుతుందన్నారు. మీ పర్సనల్ అంశాలను తాము బహిరంగపర్చమని, విక్రయించమని చెప్పారు.

English summary

డబ్బు సంపాదించడం ఎలా?, మీకు ఫేస్‌బుక్ ఫ్రీగా చెప్పనుంది | Facebook will tell you how to make money

Facebook has announced to introduce new terms of service, providing its over 2 billion users more details on how it makes money, removes harmful content and takes care of users intellectual property rights.
Story first published: Friday, June 28, 2019, 11:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X