For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల హెచ్చరికలు పాటిస్తున్నారా?

By Jai
|

దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎస్ ఎం ఎస్ లు, మెయిల్స్ ద్వారా హెచ్చరికలు, సూచనలు చేస్తున్నాయి. వీటిని పాటించడం ద్వారా మోసగాళ్ల బారిన పడకుండా మీ సొమ్మును కాపాడుకోవచ్చు. అవేమిటంటే..

- గూగుల్ ప్లే స్టోర్ నుంచిగాని ఆపిల్ అప్ స్టోర్ నుంచిగాని ఎనీ డెస్క్ పేరుతో ఉన్న అప్ ను డౌన్లోడ్ చేసుకోకండి. దీని ద్వారా మోసగాళ్లు మీ మొబైల్ ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకుని మీ ఫోన్లోని బ్యాంకు ఖాతాల వివరాలు దోచేస్తారు. అందుకే మొబైల్ ఫోన్ లోకి యాప్ లను డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Banking Alerts Everyone Should Activate

- యాప్ లను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వవద్దు.

-ఎవరికీ కూడా ఓటీపీ, డెబిట్/క్రెడిట్ కార్డు నెంబర్, సీవీవీ, కార్డు ముగింపు తేదీని వెల్లడించవద్దు.

- మీ ఇంటర్నెట్ బ్యాంకింగుకు సంబందించిన పాస్ వర్డులు తరచూ మార్చుతూ ఉండండి. పాస్ వార్డులో ఒక క్యాపిటల్ లెటర్, ఒక సింబల్ ఉండేలా చూసుకోండి.

-మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. యాంటీవైరస్ ను వినియోగించండి.

- బ్యాంకు వెబ్ సైట్ల ద్వారా లావాదేవీలు నిర్వహించడం సురక్షితమైన మార్గం.

-వెబ్ పేజీ డిస్ప్లే ఏరియాలో లాక్ సింబల్ ఉన్నది లేనిది ఒకసారి చూసుకోవాలి.

- యు ఆర్ ఎల్ ను ఒకసారి చెక్ చేసుకోవాలి. యూ ఆర్ ఎల్ ముందు https:// ఉన్నదీ లేనిదీ ఒక్కసారి చూసుకోవాలి.

- సైబర్ కేఫ్ లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాను తెరవక పోవడమే మంచిది.
- పాస్ వర్డ్‌ను ఎంటర్ చేసే సమయంలో వర్చువల్ కీబోర్డ్ ను ఉపయోగించడం మేలు.
- పేరున్న ఆన్ లైన్ వెబ్ సైట్లలో మాత్రమే షాపింగ్ చేయండి. దీనివల్ల మీ ఆన్ లైన్ లావాదేవీలకు భద్రత ఉంటుంది.

-మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డును తరచుగా మార్చుతూ ఉండండి. ఈ పాస్ వార్డులను మీ డైరీలో రాసుకుని ఇంట్లోనే ఉంచుకోండి. ఫోన్లో అన్ని నంబర్లను సేవ్ చేసుకోవద్దు. ఒకవేళ ఫోన్ ఫొతే మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
- బ్యాంకులు ఎప్పుడు తమ ఖాతాదారులకు సంబందించిన వివరాలను ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారా కోరవు.

- సోషల్ మీడియాలో మీకోరుతుంటారు.

- మీ ఖాతా వివరాలు కోరే స్పాం మెయిల్స్ కు స్పందించవద్దు.

-గూగుల్ లో గాని, సోషల్ మీడియాలో గాని కస్టమర్ సపోర్ట్ నెంబర్ కోసం వెతకవద్దు. మోసగాళ్లు బ్యాంకుల పేర్లతో నకిలీ నెంబర్లను ఆన్ లైన్ లో ఉంచుతున్నారు. ఈ నంబర్లకు ఫోన్ చేస్తే మీ సమాచారం అంతా తస్కరించే అవకాశం ఉండవచ్చు.
డేట్ అఫ్ బర్త్, పాన్, బ్యాంకు అకౌంట్ వివరాలు పోస్ట్ చేయవద్దు.
- ఎస్ ఎం ఎస్ అలర్ట్ ల కోసం మీ మొబైల్ నెంబర్ ను మీ బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకోండి. ఏవైన అనుమానాస్పద లావాదేవీలు జరిగినప్పుడు మీ బ్యాంకును సంపాదించండి. లేదా కస్టమర్ కేర్ నెంబర్ కు ఫోన్ చేయండి.

- మీరు కార్డులను కోల్పోయిన సందర్భంలో వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి బ్లాక్ చేయించండి.

- బ్యాంకులు తమ ఖాతాదారులకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ ఇది, పాస్ వర్డ్ , క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, యు పీ ఐ పిన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్లు, డేట్ అఫ్ బర్త్, తల్లి పేరును అడగవు. మోసగాళ్లు మాత్రమే ఈ వివరాలు అడుగుతారు.

- మీరు పోటీలో గెలిచారు, మీకు లాటరీ తగిలింది.. కొంత మొత్తం చెల్లిస్తే సొమ్ము మీ ఖాతాలో చేరుతుందంటే నమ్మవద్దు. డబ్బులు ఎవరికి ఊరకే రావు, ఊరకే ఇవ్వరు అన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి.

English summary

బ్యాంకుల హెచ్చరికలు పాటిస్తున్నారా? | Banking Alerts Everyone Should Activate

A Job Alert is an email notification that is sent to your inbox whenever jobs matching your search preferences are available on our site.
Story first published: Monday, June 3, 2019, 15:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X