For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI flexi deposit: ఈ స్కీంతో ఎన్నో లాభాలు, పూర్తి వివరాలు తెలుసుకోండి

|

ప్రభుత్వరంగ బ్యాంక్ SBIలో కస్టమర్లకు వివిధ రకాల డిపాజిట్ స్కీంలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో SBI flexi deposit ఒకటి. ఇది రికరింక్ డిపాజిట్ (ఆర్డీ) వంటిది. అయితే ప్రతి నెల ఫిక్స్‌డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ కాకుండా మార్చుకోవచ్చు. మీ వార్షిక మొత్తాన్ని ఆ ఏడాదిలో ఎప్పుడైనా చెల్లించే అవకాశముంది.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

SBI ఫ్లెక్సీ డిపాజిట్ అకౌంట్.

SBI ఫ్లెక్సీ డిపాజిట్ అకౌంట్.

ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు లాకిన్ పీరియడ్ ఉంటుంది. లాకిన్ పీరియడ్ పూర్తయ్యే వరకు దీనిని తీయలేము. నెల నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు రికరింగ్ డిపాజిట్ తెరవొచ్చు. నెలకు ఎంతో కొంత మొత్తం డిపాజిట్ చేయాలి. కానీ ఎస్బీఐ మాత్రం మీరు ఎంతైనా డిపాజిట్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇదే SBI ఫ్లెక్సీ డిపాజిట్ అకౌంట్.

SBI ఫ్లెక్సీ డిపాజిట్ ఎంతో లాభం

SBI ఫ్లెక్సీ డిపాజిట్ ఎంతో లాభం

SBI ఫ్లెక్సీ డిపాజిట్‌లో కస్టమర్లు తమకు నచ్చిన అమౌంట్‌ను ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఏడాదికి ఎంత డిపాజిట్ చేస్తామని ముందు చెప్పాలి. ఆ మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నెలకు కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ.50,000 డిపాజిట్ చేయవచ్చు. వార్షిక డిపాజిట్‌ను 10 నెలల్లో అడ్జెస్ట్ చేయాలి. అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు గడువు ఎంచుకోవచ్చు. టర్మ్ డిపాజిట్లకు ఎంత వడ్డీ వస్తుందో SBI ప్లెక్సీ డిపాజిట్ అకౌంట్‌పై కూడా అంతే వడ్డీ వస్తుంది. త్రైమాసికానికి చక్రవడ్డీ లెక్కిస్తారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ కాస్త ఎక్కువగా వస్తుంది. SBI ఫ్లెక్సీ డిపాజిట్ స్కీంలు ముందుగానే మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే అరశాతం వడ్డీ తక్కువగా వస్తుంది. లోన్ సదుపాయం ఉంది.

మరిన్ని వివరాలు

మరిన్ని వివరాలు

- మినిమం ఇన్‌స్టాల్‌మెంట్ రూ.500

- ఏడాదికి కనీస డిపాజిట్ రూ.5,000

- ఏడాదికి గరిష్ట డిపాజిట్ రూ.50,000

- కనీసం అయిదేళ్ల కాలపరిమితి, గరిష్టంగా 7 ఏళ్లు.

- నగదును ముందుగా విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ అప్లికబుల్ ఇంట్రెస్ట్‌కు అరశాతం తక్కువగా ఇస్తారు.

- మూలధనంకు ట్యాక్స్ డిడక్షన్ అప్లికబుల్

- మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ చెల్లించకుంటే ఏడాదికి రూ.50 పెనాల్టీ.

- నామినీ ఫెసిలిటీ ఉంది.

- పాస్‌బుక్ ఉంటుంది.

- ఏడాదికి కనీస ఇన్‌స్టాల్‌మెంట్ రూ.500

- టర్మ్ డిపాజిట్లకు రుణ సౌకర్యం.

- ఓ నెలలో ఎప్పుడైనా మీరు మీ ఇన్‌స్టాల్‌మెంట్ పే చేయవచ్చు. ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేయవచ్చు.

Read more about: sbi savings ఎస్బీఐ
English summary

SBI flexi deposit: ఈ స్కీంతో ఎన్నో లాభాలు, పూర్తి వివరాలు తెలుసుకోండి | Know about SBI flexi deposit scheme

Minimum deposit amount - Rs. 5,000/- per Financial Year (plus in multiples of Rs. 500/-) minimum of Rs. 500/- at any one instance.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X