For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్వెస్ట్ చేసేందుకు డబ్బు లేదా, ఈ టిప్స్ మిమ్మల్ని ధనవంతుడిగా చేస్తాయి!

|

డబ్బు సంపాదనకు అనేక మార్గాలు ఉన్నాయి. సంపన్నుల గాథల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. కింది నుంచి పైస్థాయికి వెళ్లినవారిలో చాలామంది ఎంతో రిస్క్ తీసుకున్నవారు ఉంటారు. జీవితంలో దెబ్బలు తిని ఆ స్థాయికి వచ్చినవారు ఉంటారు. ముఖ్యంగా చాలామందికి మనీ మేనేజ్‌మెంట్ అనేది ఎంతో అవసరం.

నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకోవడం, తెలుసుకోవడం

ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకోవడం, తెలుసుకోవడం

ప్రస్తుత కాలంలో డబ్బున్న వారికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. కిందిస్థాయి నుంచి పైకి వెళ్లిన ధనంతుల నుంచి ఎంతో స్ఫూర్తి పొందవచ్చు. చాలామంది ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ పెంచుకుంటారు. తెలియని విషయాన్ని తెలుసుకుంటారు. పుస్తకాలు చదువుతారు. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఏడాదికి దాదాపు 50కి పైగా పుస్తకాలు చదువుతారట. మార్కెట్లోకి వస్తున్న కొత్త స్కిల్స్ పెంచుకోవడం, తెలియని విషయాలు తెలుసుకోవడం వ్యక్తులకు ఎంతో ముఖ్యం. మారుతున్న కాలానికి సమానంగా ఎదిగేందుకు తోడ్పడుతాయి. సవాళ్లను టాకిల్ చేసే మనోధైర్యం వస్తుంది. అలాగే, రిస్క్ తీసుకునే అవకాశాలు ఉంటే, ఆచితూచి అందుకు కూడా సిద్ధపడాలి.

వీటిల్లో ఇన్వెస్ట్ చేయండి

వీటిల్లో ఇన్వెస్ట్ చేయండి

చాలామంది రియల్ ఎస్టేట్, ఈక్విటీ షేర్ల ద్వారా ఎక్కువగా నికర లాభాలు పొందుతున్నారు. దీర్ఘకాలంలో మీ పెట్టుబడి మరింత మెరుగుపడాలంటే ఈక్విటీలలో లేదా రియల్ ఎస్టేట్‌లలో పెట్టడం సముచితం. మ్యుచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రయోజనకరం. ఆర్థిక క్రమశిక్షణతో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం లేదా హోమ్ లోన్ ద్వారా ఇళ్లు కొనుగోలు చేయడం మంచిది. ఇలాంటి వాటిపై ఇన్వెస్ట్ అంటే ఇది సరైన పెట్టుబడి.

మల్టిపుల్ ఆదాయ మార్గాలు

మల్టిపుల్ ఆదాయ మార్గాలు

వేతనజీవులు అయినా, మరెవరైనా మల్టిపుల్ ఆదాయ మార్గాలు చూసుకోవడం మంచిది. నిత్యం తెలుసుకోవడం ద్వారా ఫాస్ట్‌గా ప్రొగ్రెస్ అయ్యే ఆదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. కొందరు అనుకోకుండా లాటరీ తగిలినట్లుగా ధనవంతులు అవుతారు. మరికొందరు కష్టపడి పైకి వస్తారు. ప్రస్తుతం మీరు ఏ పరిస్థితుల్లో ఉన్న అంశాన్ని పక్కన పెట్టి, సరైన ఆర్థిక ప్రణాళిక ద్వారా.. పెట్టుబడి పెట్టడం ద్వారా ఎదగవచ్చు. ఖర్చు చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఖర్చు కోసం లోన్ తీసుకోవడం కంటే.. దానికంటే ముందే సేవింగ్స్ చేయడం మంచిది. గోల్ చేరుకునేలా పెట్టుబడులు పెట్టడం మంచిది. పొదుపు ఎంతో ముఖ్యం. అవసరమైన వాటినే కొనుగోలు చేసి, అక్కరలేని వాటికి ఖర్చు చేయకపోవడం మంచిది.

Read more about: rich money funds మనీ
English summary

ఇన్వెస్ట్ చేసేందుకు డబ్బు లేదా, ఈ టిప్స్ మిమ్మల్ని ధనవంతుడిగా చేస్తాయి! | How To Become Rich: these habits can make you wealthy

Frugality is the quality of being economical with money. When you live frugally, you weigh your financial options well.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X