అలాంటి మోసాలకు చెక్ పెట్టండి ఇలా....

పెద్ద నోట్ల రద్దు తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం ఊపందుకుంది. ఆన్ లైన్ లావాదేవీలు కూడా పుంజుకున్నాయి. ఇదేకాలంలో సైబర్ మోసగాళ్లు సైతం ఎక్కువయ్యారు. కార్డుల వినియోగదారుల సమాచారాన్ని దొంగిలించి వారి ఖాతాలోని సొమ్మును ఖాళీ చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కొంతమంది ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకొని మరీ మోసాలకు పాల్పడుతున్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. కొంతమంది యాప్ లను తెచ్చి వినియోగదారుల మొబైల్లోని సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. మరికొంత మంది స్వైపింగ్ మిషన్ల ద్వారా కస్టమర్ల సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. అప్రమత్తంగాఉండకుంటే మీకు కూడా ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అప్రమత్తంగా ఉండండి. మీరు ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయండి...

ఏటీఎంలో ఇలా ఉండండి...

ఏటీఎంలో ఇలా ఉండండి...

డబ్బులు తీసుకోవడానికి మనం ఏటీఎంకు వెళతాం. ఏటీఎం కార్డును ఇన్సర్ట్ చేసే చోట కొంతమంది మోసగాళ్లు స్కిమ్మింగ్ మిషన్లను, హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటారు. దీన్ని గమనించక పోతే మీ కార్డు సమాచారం మోసగాళ్లకు చిక్కినట్టే. మీతోపాటే ఉంది మీ పిన్ నెంబర్ ను కూడా తెలుసుకుని సొమ్ము కాజేస్తారు. పొరపాటున కూడా ఏటీఎంలో మీ పిన్ నెంబర్ మరొకరికి తెలియనివ్వ వద్దు. మీ ఏటీఎం పిన్ నెంబర్ను మారుస్తూ ఉండండి. ఏటీఎం పిన్ నెంబర్ ను ఎప్పుడు కూడా కార్డుపై రాయకండి. కార్డు నెంబర్ ను గుర్తుంచుకోవడం మంచిది. దీనివల్ల కార్డును పోగొట్టుకున్నా మీకు నష్టం జరగదు. ఒకవేళ కార్డు పోయినట్లయితే వెంటనే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి మీ కార్డును బ్లాక్ చేయండి. కొత్త కార్డు కోసం వెంటనే బ్యాంకును సంప్రదించండి.

ఫోన్ కాల్స్ వస్తే...

ఫోన్ కాల్స్ వస్తే...

మోసగాళ్లు బ్యాంకు అధికారులమని చెప్పి ఫోన్ చేసి మీ కార్డు వివరాలు చెప్పమని అడుగుతుంటారు. వివరాలు చెప్పకుంటే కార్డు బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తారు. పొరపాటున మీరు వాళ్ళు అడిగిన నెంబర్లు చెబితే ఖాతాలో సొమ్ము ఖాళీ అయిపోయినట్టే. ఎట్టి పరిస్థితిలోను బ్యాంకు అధికారులు తమ కస్టమర్ల కార్డు వివరాలు అడగరు. అవసరం అయితే బ్యాంకుకు వచ్చి తమను కలవమని కోరతారు. ఈ విషయం గుర్తుంచుకోండి.

సీవీవీ, ఓటీపీ ఎవ్వరికి చెప్ప వద్దు

సీవీవీ, ఓటీపీ ఎవ్వరికి చెప్ప వద్దు

కార్డు ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు నిర్వహించినప్పుడు ఆ కార్డు/ఇంటర్నెట్ బ్యాంకుతో అనుసంధానించిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే లావాదేవీ పూర్తవుతుంది. మీ ఖాతా వివరాలు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని తస్కరించిన మోసగాళ్లు లావాదేవీ నిర్వహించి ఓటీపీ రాగానే వారి మొబైల్ నెంబర్ కు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడుగుతారు. ఒకవేళ చెబితే మీ సొమ్ము గల్లంతు అయినట్టే. డెబిట్ కార్డు ముందు వైపు ఉండే నెంబర్లతో పాటు వెనుకవైపు ఉండే మూడు అంకెల సీవీవీ నెంబర్ చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ నెంబర్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.

మిస్డ్ కాల్స్ కు ఫోన్ చేయవద్దు..

ఈమధ్య మోసకారులు కొన్ని కొత్త ట్రిక్ లు ఉపయోగిస్తున్నారు. ఫోన్లకు మిస్డ్ కాల్స్ చేస్తున్నారు. ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే మీ మొబైల్ నెంబర్ తో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు పొందుతున్నారు. వీటి ద్వారా మోసపూరిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు.

అలాంటి యాప్ ల జోలికి వెళ్ళవద్దు

అలాంటి యాప్ ల జోలికి వెళ్ళవద్దు

మోసగాళ్లు ఈ మధ్య కాలంలో మొబైల్ యాప్ లను కూడా తెస్తున్నారు. వీటిని డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్ ఫోన్ వారి ఆధీనంలోకి వెళ్ళినట్టే. మీ మొబైల్ ఫోన్ కు వచ్చే సమాచారం అంతా వారికీ తెలిసిపోతుంది. అప్పటికే తస్కరించిన మీ ఖాతా వివరాల ద్వారా లావాదేవీలు నిర్వహించి మీ సొమ్ము కాజేస్తారట. ఈ మధ్యనే ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకోవద్దని భారత రిజర్వ్ బ్యాంకు ప్రకటన చేసిందంటే ఆ యాప్ మోసం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.

 పబ్లిక్ వైఫై వాడొద్దు..

పబ్లిక్ వైఫై వాడొద్దు..

షాపింగ్ మాల్స్, హోటళ్లు ఇతర ప్రాంతాల్లో పబ్లిక్ వైఫై ని చాలా మంది అందుబాటులోకి తెస్తున్నారు. చాలా మంది వీటిని వినియోగిస్తుంటారు. కానీ కొంతమంది ఇలాంటి వాటి ద్వారా వినియోగదారుల సమాచారాన్ని దొంగిలిస్తారు. వాటిని దుర్వినియోగం చేస్తారు. అందుకే బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి పబ్లిక్, ఉచిత వైఫై జోలికి వెళ్లకపోవడం మంచిది. ఇక ఎక్కడ పడితే అక్కడ కార్డులను స్వైప్ చేయకండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+