ఎక్కడ ఎప్పుడు అంటే: మే నెలలో ఈ తేదీల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి
కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా నేడు (మే 1) బ్యాంకులకు సెలవు దినం. ఈ రోజు సెలవుదినం కాబట్టి బ్యాంకుకు వెళ్లి ఏమైనా పనులు ఉంటే చూసుకొని వద్దామనుకునే వారు.. ఈ రోజు బ్యాంకులకు కూడా సెలవు అని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఏడాది మే 1వ తేదీన బ్యాంకులు క్లోజ్ అవుతాయి.
ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్యాలెండర్ ప్రకారం అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, హైదరాబాద్, కేరళ, కోల్‌కతా, మంబై, గౌహతి, పాట్నాలలోని తమ బ్రాంచులు క్లోజ్ ఉంటాయని పేర్కొంది. అసోం, ఆంధ్రప్రదేశ్, బీహార్, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని బ్రాంచీలు క్లోజ్ అవుతాయని పేర్కొంది. పైన పేర్కొన్నవి మినహా మిగతా నగరాల్లోని పలుచోట్ల పబ్లిక్ డీలింగ్స్ కోసం తెరిచి ఉంచే అవకాశాలున్నాయి.

ఎస్బీఐ మార్గంలోనే మిగతా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు నడుస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర బ్యాంకులు క్లోజ్ చేస్తారు.
పశ్చిమ బెంగాల్‌లో మే 9వ తేదీన కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ రోజు రవీంద్రనాథ్ టాగూర్ జయంతి. మే 18వ తేదీన బుద్ధపూర్ణిమ సందర్భంగా హాలీడే ఉంటుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి. ప్రతి నెలలో రెండో, నాలుగో శనివారం కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. వీటిని పరిగణలోకి తీసుకొని, బ్యాంకులకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలి.


Click it and Unblock the Notifications