For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ఈటీఎఫ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ?

By Jai
|

బంగారంలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన ఉన్నవారు తమ వద్ద పోగు చేసుకున్న సొమ్ముతో ఎంతో కొంత పసిడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే కనీసం పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలన్నా ప్రస్తుత ధరల ప్రకారం రూ. 32,000 వెచ్చించాల్సి వస్తుంది. ఈ బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాలంటే కొంత సమయం కేటాయించాలి. అమ్మాలన్నా ఇదే పరిస్థితి. ఓపికలేని వారు తమ క్రయవిక్రయాలను వాయిదా వేస్తుంటారు. బంగారంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి ఉండి సమయం ఎక్కువగా వెచ్చించలేని వారికోసమే గోల్డ్ ఈటీఎఫ్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అనేక మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేట్ ఆర్ధిక సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. వీటి గురించి తెలుసుకుందామా...

ATM కార్డుతో ఎన్నో ఉపయోగాలుATM కార్డుతో ఎన్నో ఉపయోగాలు

పారదర్శకత

పారదర్శకత

- గోల్డ్ ఈటీఎఫ్ లలో అత్యంత పారదర్శకత ఉంటుంది. ధరల్లో ఎలాంటి దాపరికాలు ఉండవు. మోసానికి తావుండదు.

- బంగారంలో ఎంతో కొంత కల్తీ ఉంటుందన్న సందేహం ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్ లలో అలాంటిదేమీ ఉండదు.

- మనం కొనుగోలు చేసే గోల్డ్ ఈటీఎఫ్ లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి. మార్కెట్ రేటు ఆధారంగానే వీటి ధరలు ఉంటాయి.

- ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్... ఒక గ్రాము బంగారానికి సమానం. కనీసం ఒక యూనిట్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

- మీరు కొనుగోలు చేసిన బంగారం విలువను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అవసరమైతే వెంటనే విక్రయించి నగదు రూపంలోకి మార్చుకోవచ్చు.

- బంగారాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం, నిల్వ చేయడానికి వెచ్చించే మొత్తం కన్నా గోల్డ్ ఈటీఎఫ్ ల కొనుగోలు అమ్మకాల వ్యయం తక్కువ

- గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టాలంటే మీకు డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. ఆ తర్వాత మీ బ్రకర్ ట్రేడింగ్ పోర్టల్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్ లకు ఆర్డర్ చేయవచ్చు.

- మీ అకౌంట్లో జమైన బంగారాన్ని ఎప్పుడంటే అప్పుడు విక్రయించవచ్చు.

- బీ ఎస్ ఈ , ఎన్ ఎస్ ఈ ల ద్వారా ఒక కంపెనీ షేర్ క్రయవిక్రయాలు చేసినట్టే గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ల లావాదేవీలు నిర్వహించవచ్చు.

- మీరు ఒకసారి ఒక ఈటీఎఫ్ ను ఎంచుకున్న తర్వాత మీ ఈటీఎఫ్ మేనేజర్ మీ తరఫున స్టాక్ బ్రోకరుగా వ్యవహరిస్తూ క్రయవిక్రయాలు జరిపే అవకాశం కూడా ఉంటుంది.

- ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ ఏమీ ఉండదు.

- సాధారణంగా గోల్డ్ ఈటీఎఫ్ లపై బ్రోకరేజ్ చార్జీలు 0.5-1 శాతంగా ఉంటాయి.

రిస్క్ తక్కువ

రిస్క్ తక్కువ

షేర్ల మాదిరిగా బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండవు. కాబట్టి మీ రిటర్న్ లు ఒక్కసారిగా తగ్గే అవకాశం ఉండదు. గోల్డ్ ఏటీఎఫ్ లు మీకు అధిక నష్టాలు రాకుండా చూస్తాయి.

ఎందుకు గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టాలంటే..

ఎందుకు గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టాలంటే..

మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటే గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడుల గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే బంగారం అనేది ద్రవ్యోల్బణం, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల కలిగే నష్టాలకు బంగారం హెడ్జింగ్ గా ఉంటుంది. పెట్టుబడుల్లో కనీసం 10 శాతమైనా బంగారానికి కేటాయించాలని మార్కెట్ పండితులు చెబుతుంటారు. అందుకే బంగారంపైనా దృష్టి సారించాలి

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాకు కావాల్సినవి

- మీ స్టాక్ బ్రోకర్ లేదా ఈటీఎఫ్ ఫండ్ మేనేజర్ ద్వారాడీమ్యాట్ ఖాతా తెరవ వచ్చు. దీనికోసం

- పాన్ కార్డు తప్పనిసరి

- ఐడెంటిటీ ప్రూఫ్

- అడ్రస్ ప్రూఫ్

Read more about: gold బంగారం
English summary

బంగారం ఈటీఎఫ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? | Are you investing in gold etf?

Gold ETF is an option to invest in gold online. Gold ETFs are open ended mutual fund schemes that will invest the money collected from investors in standard gold bullion of 99.5 per cent purity.
Story first published: Friday, May 24, 2019, 13:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X