For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI personal gold loans: రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్, వడ్డీ రేటు, అర్హతలు ఇవే

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒక వ్యక్తికి రూ.20 లక్షల వరకు పర్సనల్ గోల్డ్ లోన్ ఇస్తోంది. బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్ వంటి వాటిని తనఖా పెట్టాలి. తక్కువ వడ్డీ రేట్లకు కనీస డాక్యుమెంటేషన్‌తో ఈ బ్యాంకు బంగారంపై రుణాలు అందిస్తోంది. పద్దెనిమిదేళ్లు నిండిన వారు ఎవరైనా ఎస్బీఐ ద్వారా పర్సనల్ గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్‌గా లేదా జాయింట్‌గా అప్లై చేసుకోవచ్చు. వారికి స్థిరమైన ఆదాయం కలిగి ఉండాలి. ఆదాయానికి సంబంధించిన రుజువులు అవసరం లేదు. ఈ షరతులు బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తిస్తుంది.

<strong>SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్</strong>SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్

ఎవరైనా గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం పొందవచ్చు. కనీసం రూ.20,000 రుణం తీసుకోవచ్చు. రుణ మొత్తం చెల్లింపులకు వివిధ కాలపరిమితులు ఉన్నాయి. గోల్డ్ లోన్ ఇచ్చిన మరుసటి నెల నుంచి రీపేమెంట్ ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ అకౌండ్ ద్వారా కూడా రీపేమెంట్ అవుతుంది. దీనికి మంత్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది.

SBI personal gold loans: Get up to Rs 20 lakh gold loan, check rates, eligibility

ఎస్బీఐ గోల్డ్ లోన్ మొత్తం 36 నెలల్లో తిరిగి చెల్లించాలి. ఎస్బీఐ బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్‌ను పీరియడ్‌ను 12 నెలలుగా ఫిక్స్ చేసింది. బ్యాంక్ ఎస్బీఐ గోల్డ్ లోన్ స్కీమ్, ఎస్‌బీఐ లిక్విడ్ గోల్డ్ లోన్, ఎస్‌బీఐ బుల్లట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ వంటి రుణాలను అందిస్తోంది.

ఎస్బీఐ బంగారం రుణ మొత్తంపై 0.50 శాతాన్ని, రూ.500 (కనీసం) ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. ఈ రెండింటికి జీఎస్టీ అదనం. ఇకపోతే బంగారం రుణాలపై వడ్డీ రేటు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు+1.25 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతంగా ఉంది. బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ ఫీజు కూడా ఉంటుంది.

English summary

SBI personal gold loans: రూ.20 లక్షల వరకు గోల్డ్ లోన్, వడ్డీ రేటు, అర్హతలు ఇవే | SBI personal gold loans: Get up to Rs 20 lakh gold loan, check rates, eligibility

SBI offers the facility of personal gold loans under which a person can avail a personal gold loan of up to Rs 20 lakh. According to State Bank of India, the gold loan can be availed from the bank by the pledge of gold ornaments including gold coins sold by the banks with minimum paperwork and low-interest rates.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X