స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇటీవల సరికొత్త రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీం (ఆర్-జీడీఎస్) ఆఫర్ చేస్తోంది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం. మీ వద్ద అవసరం లేకుండా ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేసేదే ఆర్-జీడీఎస్. ఆర్-జీడీఎస్ స్కీం కింద కస్టమర్లు వారి గోల్డ్ డిపాజిట్‌పై భద్రత, ఇంటరెస్ట్ ఎర్నింగ్స్ (వడ్డీ) పొందవచ్చు. గోల్డ్ బార్, కాయిన్స్, జ్యువెల్లరీ రూపంలో బంగారం డిపాజిట్ చేయవచ్చు. రాళ్లు, ఇతర లోహాలను మాత్రం అనుమతించరు. సాధారణంగా మీ వద్ద ఉన్న డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ వస్తుంది. అలాంటిదే ఈ గోల్డ్ స్కీం కూడా. ఆర్-జీడీఎస్ స్కీం వల్ల ఉన్న లాభాలు తెలుసుకుందాం.

3 రకాల ఆర్-జీడీఎస్ డిపాజిట్లు
ఆర్-జీడీఎస్ (R-GDS) స్కీంలో కనీసం 30 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు. గరిష్టంగా లిమిట్ లేదు. ఈ స్కీం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి.. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD). దీని కనీస కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి 3 ఏళ్ల వరకు ఉంటుంది. రెండోది... మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD). దీని కాలపరిమితి అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు ఉంటుంది. మూడోది... లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LTGD). దీని కాలపరిమితి 12 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది.

దేనికి ఎలాంటి వడ్డీ రేటు
ఈ స్కీంలోని మూడు టైప్స్‌కు మూడు రకాల వడ్డీ రేట్లు ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు ఏడాదికి లెక్క కడతారు. STBDలో ఒక్క సంవత్సరం వరకు 0.50 శాతం, రెండు సంవత్సరాల వరకు 0.55 శాతం, మూడేళ్ల వరకు 0.60 శాతం ఉంటుంది.
MTGDలో అయిదేళ్ల నుంచి ఏడేళ్ల వరకు ఒకే వడ్డీ రేటు ఉంటుంది. 2.25 శాతంగా ఉంటుంది.
LTGDలో కూడా 12 నుంచి 15 ఏళ్లకు ఒకే వడ్డీ రేటు ఉంటుంది. 2.50 శాతంగా ఉంటుంది. MTGD & LTGDలలో డినామినేషన్ గోల్డ్. కానీ మార్చి 31వ తేదీన రూపాయల్లోను తీసుకోవచ్చు.
రీపేమెంట్ విషయానికి వస్తే.. STBD కస్టమర్లు మాత్రం మెచ్యూరిటీ డేట్ తర్వాత గోల్డ్ రూపంలో లేదా నగదు రూపంలో తీసుకోవచ్చు. MTGD, LTGD కస్టమర్లు మెచ్యూరిటీ తర్వాత బంగారం లేదా బంగారం ధర సమానమైన నగదును తీసుకోవచ్చు. గోల్డ్ రూపంలో తీసుకుంటే 0.20 అడ్మినిస్ట్రేటివ్ చార్జ్ ఉంటుంది.

లాకిన్ పీరియడ్
డిపాజిట్లపై వచ్చిన వడ్డీని వార్షికంగా తీసుకోవచ్చు (మార్చి 31) లేక మెచ్యూరిటీ సమయంలో తీసుకోవచ్చు. ఈ విషయాన్ని డిపాజిట్ సమయంలో తెలియజేయాలి.
STBD స్కీంలో ఏడాది కాలం, MTGDలో మూడేళ్లు, LIGD స్కీంలో అయిదేళ్లు లాకిన్ పీరియడ్ ఉంటుంది. లాకిన్ పీరియడ్ తర్వాత ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. పిల్లల పెళ్లి కోసమో, పెట్టుబడి రూపంలో ఇంట్లో బంగారం దాచుకనే వారికి ఈ స్కీం ఎంతో ఉపయోగం.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications