రోజుకు రూ.100, రూ.200, రూ.300 ఇన్వెస్ట్ చేస్తే రూ.లక్షలు, కోట్లు సంపాదించవచ్చు!

డబ్బు విషయంలో క్రమశిక్షణ అవసరం. కొన్నింటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘ కాలంలో మంచి రిటర్న్స్ పొందవచ్చు. పెద్ద మొత్తంలో కాకపోయినా చిన్నమొత్తంలో ఆదా చేస్తూ కూడా లాంగ్ టర్మ్‌లో మంచి ఆదాయం పొందవచ్చు. రోజుకు రూ.100, రూ.200, రూ.300 పెట్టుబడి ద్వారా లాంగ్ టర్మ్‌లో లక్షలు, కోట్లు ఆర్జించవచ్చు. మ్యుచువల్ ఫండ్ సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్ఐపి) ద్వారా ఇలాంటి రిటర్న్స్ పొందవచ్చు. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి మ్యుచువల్ ఫండ్స్‌లలో పెట్టవచ్చు. 5, 10, 15, 20, 25 ఏళ్లలో ఎంత పొందవచ్చో ఇక్కడ చూడండి.

రూ.100 మ్యుచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్‌మెంట్

రూ.100 మ్యుచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్‌మెంట్

రోజుకు రూ.100 పెట్టుబడి పెట్టడం ద్వారా 10 శాతం రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం అయిదేళ్లకు రూ.2,31,514 పొందవచ్చు. ఈ అయిదేళ్ల పాటు మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.1.8 లక్షలు అవుతుంది. మీకు రూ.51 వేలకు పైగా అదనపు ఆదాయం వస్తుంది.

10 ఏళ్లకు 10 శాతం రేట్ ఆఫ్ రిటర్న్‌తో రూ.6,04,371 ఆదాయం పొందవచ్చు. పదేళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసేంది రూ.3.6 లక్షలు. రూ.2,44,000 లక్షల వరకు అదనంగా పొందుతారు.

15 ఏళ్లకు రూ.5.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.12,04,859 పొందుతారు. అంటే రూ.6,64,859 అదనంగా వస్తుంది.

20 ఏళ్లకు రూ.7.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.21,71,949 వస్తుంది. అదనంగా రూ.14,51,949 వస్తుంది.

25 ఏళ్లకు రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.37,29,454 వస్తుంది. అదనంగా రూ.28 లక్షలకు పైగా వస్తుంది.

రూ.200 మ్యుచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్‌మెంట్

రూ.200 మ్యుచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్‌మెంట్

రోజుకు రూ.200 ఇన్వెస్ట్ చేయడం ద్వారా పది శాతం రేట్ ఆఫ్ రిటర్న్‌ అంచనాతో ఆదాయం ఇలా ఉంటుంది.

5 ఏళ్లకు రూ.3.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, రూ.4,63,029 వస్తుంది. అదనంగా రూ.1,03,000కు పైగా వస్తుంది.

10 ఏళ్లకు రూ.7.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.12,08,742 వస్తుంది. అంటే అదనంగా రూ.4,88,000కు పైగా వస్తుంది.

15 ఏళ్లకు రూ.10.8 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.24,09,718 వస్తుంది. అంటే రూ.13 లక్షలకు పైగా అదనంగా వస్తుంది.

20 ఏళ్లకు రూ.14.4 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.43,43,898 వస్తుంది. అంటే రూ.29 లక్షలకు పైగా ఆధాయం వస్తుంది.

25 ఏళ్లకు రూ.18 లక్షలు పెట్టుబడిగా పెడితే రూ.74 లక్షలకు పైగా వస్తాయి. అంటే 56 లక్షలకు పైగా రిటర్న్స్ ఉంటాయి.

 రూ.300 మ్యుచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్‌మెంట్

రూ.300 మ్యుచువల్ ఫండ్ SIP ఇన్వెస్ట్‌మెంట్

రోజుకు రూ.300 ఇన్వెస్ట్ చేయడం ద్వారా పది శాతం రేట్ ఆఫ్ రిటర్న్‌ అంచనాతో ఆదాయం ఇలా ఉంటుంది.

5 ఏళ్లకు రూ.5,40,000 ఇన్వెస్ట్ చేస్తే, రూ.6,94,544 వస్తుంది. అదనంగా రూ.1,54,000కు పైగా వస్తుంది.

10 ఏళ్లకు రూ.10,80,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.18,13,000 వస్తుంది. అంటే అదనంగా రూ.7 లక్షలకు పైగా వస్తుంది.

15 ఏళ్లకు రూ.16.20,000 పెట్టుబడి పెడితే రూ.36,14,578 వస్తుంది. అంటే దాదాపు రూ.20 లక్షల వరకు అదనంగా వస్తుంది.

20 ఏళ్లకు రూ.21 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేస్తే రూ.65 లక్షలకు పైగా వస్తుంది. రూ.43 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది.

25 ఏళ్లకు రూ.27 లక్షలు పెట్టుబడిగా పెడితే రూ.1,11,00,00 పైగా వస్తాయి. అంటే 84 లక్షలకు పైగా రిటర్న్స్ ఉంటాయి.

మీరు కనుక ఇప్పుడు 25 ఏళ్ల వయస్సు ఉండి రోజుకు రూ.300 ఇన్వెస్ట్ చేస్తే యాభై ఏళ్లు దాటేసరికి మీ చేతుల్లో కోటి రూపాయలు ఉంటాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+