మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్)కు నామినీ లేకుంటే ఆన్‌లైన్ ద్వారా సులభంగా జత చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్ మృతి చెందితే ఆ డబ్బులు నామినీకి అందుతాయి. అందుకే నామినీ పేరు యాడ్ చేసుకోవడం మంచిది. మీరు ఒకరి కంటే ఎక్కువమందిని నామినీలుగా ఎంచుకోవచ్చు. ఎవరెవరికి ఎంతశాతం చెందాలో చెప్పవచ్చు. నామినీగా సొంత కుటుంబ సభ్యులను మాత్రమే ఎంచుకోవాలి. కుటుంబానికి చెందని వ్యక్తి అయితే చెల్లదు. మీకు కుటుంబం లేకుంటే మాత్రం బయటివారిని ఎంచుకోవచ్చు. వివాహానికి ముందు మీ నామిని ఇతరులు అయిన సందర్భాల్లో పెళ్లయ్యాక భార్య పేరుకు మార్చుకోవాలి. లేదంటే అంతకు ముందుది చెల్లదు. వివాహం తర్వాత కచ్చితంగా కొత్త నామినీ ఉండాలి.
నామినీ లేకుంటే కుటుంబం మొత్తానికి ఈపీఎఫ్‌ను సమానంగా ఇస్తారు. పద్దెనిమిదేళ్లు నిండని కొడుకులు, అలాగే, 18 ఏళ్లు నిండని కొడుకు కుమారులును నామినీలుగా పరిగణించరు. కూతుళ్ళు వారి భర్తలు జీవించి ఉంటే, చనిపోయిన కుమారుని కూతుళ్ల భర్తలు బతికి ఉంటే వర్తించదు. ఎన్నిసార్లు అయినా నామినీని మార్చుకోవచ్చు.
ఉద్యోగి మృతి చెందాక ఈపీఎప్ మొత్తాన్ని నామినీ స్వీకరించడానికి అర్హులు. కానీ ఫండ్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి మాత్రం నామినీకి హక్కు లేదు. వారసుల చట్టం ప్రకారం ఉద్యోగికి చెందిన చట్టపరమైన వారసులకు మాత్రమే ఈపీఎఫ్ ఫండ్‌ను ఇవ్ాలి. అందుకే చట్టపరమైన వారసుడిని ఎంచుకోవాలి.

నామినీని ఎలా చేర్చాలంటే?
తొలుత ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోకి యూఏఎన్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. మేనేజ్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత ఈ నామినేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో యూఏఎన్, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఉంటాయి. మీ ప్రస్తుత, శాశ్వత చిరునామా వివరాలు తెలియజేయాలి. ఆ తర్వాత సేవ్ చేయాలి. అనంతరం ఫ్యామిలీ డిక్లరేషన్ అప్‌డేట్ కోసం 'యస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
యాడ్ ఫ్యామిలీ డీటైల్స్‌కు వెళ్లాలి. మీరు నామినీగా పెట్టాలనుకున్న వారి వివరాలు ఇవ్వాలి. ఆ వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, వారితో ఉన్న సంబంధం, చిరునామా, ఆధార్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకరికంటే ఎక్కువగా ఉంటే.. నామినేషన్ డీటైల్స్‌కు వెళ్లాలి. నామినీకి ఈపీఎఫ్ మొత్తంలో ఎంత వాటా ఇవ్వాలనుకుంటున్నారో పేర్కొనాలి. ఒక్కరినే నామినీగా పెట్టాలనుకంటే వంద శాతం వాటా వారికే వస్తుంది. ఆ తర్వాత సేవ్ చేయాలి.
అనంతరం ఈ-సైన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్ లైన్ నామినేషన్ తర్వాత మీరు మీ కంపెనీకి ఏ రకమైన డాక్యుమెంట్లు పంపించాల్సిన అవసరం లేదు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్‌డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications