For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందా? అయితే ఇలా చేసి పెంచుకోండి

By girish
|

మీరు క్రెడిట్ స్కోర్‌ను మెరుగుప‌రుచుకున్నంత మాత్రాన మీకు ప్ర‌త్యేక బ‌హుమ‌తులు, ప్రోత్సాహ‌కాలు ఏమీ ఉండ‌వు. కానీ మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీ వ్య‌క్తిగ‌త రుణానికి, గృహ రుణ ద‌ర‌ఖాస్తుకు అది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాంటి క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు కొన్ని సూచ‌న‌లు ఇక్క‌డ తెలుసుకోండి.

 మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందా? అయితే ఇలా చేసి పెంచుకోండి

రీపేమెంట్ షెడ్యూల్: మీ క్రెడిట్ స్కోర్ ఇది వ‌ర‌కే చాలా బాగా ఉంటే, మీరు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇది ఎలా సాధ్య‌మంటే స‌మ‌యానికి చెల్లింపులు చేయ‌డం వ‌ల్లే. అలా కాకుండా స‌మ‌యానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు ఇబ్బంది ప‌డుతుంటే ఈసీఎస్ మ్యాండేట్ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి పేమెంట్ తేదీకి చెల్లించే ఏర్పాటు చేసుకుంటే మంచిది.

క్రెడిట్ కార్డు ప‌రిమితి :విష‌యంలో మ‌న ఆర్థిక స్థితి, చేసే ఉద్యోగం, బ్యాంకు ఖాతాలో నిల్వ‌ వంటివి చూసి క్రెడిట్ కార్డు ప‌రిమితిని నిర్ణ‌యించి ఉంటారు. ఉదాహ‌ర‌ణ‌కు మీ క్రెడిట్ కార్డు ప‌రిమితి రూ.1 ల‌క్ష‌గా నిర్ణ‌యించార‌ని అనుకుందాం. అప్పుడు దాన‌ర్థం ప్ర‌తిసారి అదంతా ఉప‌యోగించుకోమ‌ని కాదు. మీకు అంత అర్హ‌త ఉంది. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు చేసి ఎక్కువ ప‌రిమితిని ఉపయోగించుకోకూడ‌దు. సాధార‌ణంగా మీ క్రెడిట్ కార్డుకు ఉన్న ప‌రిమితిలో 30 నుంచి 40 శాతం వ‌ర‌కూ ఉంచుకోవ‌డం ఉత్త‌మం.

రుణం తీసుకునే ముందు: సాధార‌ణంగా ఉద్యోగంలో చేరిన త‌ర్వాత క‌నీసం ఒక క్రెడిట్ కార్డయినా వాడేవారు ప్ర‌స్తుతం చాలా మంది ఉన్నారు. అయితే 30ల త‌ర్వాత చాలా మంది వేత‌న ఉద్యోగులు ఇల్లు కొనేందుకు ప్లాన్ వేసుకుంటారు. ఒక వేళ వాహ‌న రుణం లేదా గృహ రుణం వంటివి ద‌ర‌ఖాస్తు చేసుకునే ఆలోచ‌న ఉంటే దానికి ఆరు నెల‌ల ముందు మ‌ళ్లీ కొత్త‌గా క్రెడిట్ కార్డు లేదా మ‌రో వ్యక్తిగ‌త రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌క‌పోవ‌డం సూచ‌నీయం. అది మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఏ విధమైన ప్ర‌భావం చూపుతుందంటే ఈ వ్య‌క్తి ఎక్కువగా రుణాల మీద ఆధార‌ప‌డి జీవితం సాగిస్తున్నాడ‌ని.

ఇత‌ర స‌ల‌హాలు :ఒక‌టి కంటే ఎక్కువ‌గా క్రెడిట్ కార్డులు మీ ద‌గ్గ‌ర ఉంటే లేదా కుటుంబ స‌భ్యుల‌కు అద‌న‌పు కార్డును ఇచ్చి ఉంటే వాటన్నింటి చెల్లింపులు స‌మ‌యానికి జరిగేలా చూడ‌టం ముఖ్యం. లేదంటే అది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల‌దు. హామీగా ఉన్న వ్య‌క్తుల ఖాతాల‌ను, ఉమ్మ‌డి బ్యాంకు ఖాతాల‌ను అప్పుడ‌ప్పుడు ప‌రిశీలిస్తూ ఉండాలి. ఒక వేళ వారు రుణాల‌ను స‌క్ర‌మంగా చెల్లించ‌క‌పోతే ఆ ప్ర‌భావం హామీదారుపై ఉంటుంది. అది మీ రుణ మంజూరును సైతం నిర్ణ‌యించే అవ‌కాశం ఉంది.

Read more about: credit score
English summary

మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందా? అయితే ఇలా చేసి పెంచుకోండి | Tips to Hike Your Credit Score

As you improve credit scores, you will have no special prizes and promotions. But if it has a good credit score, it is very useful for your personal loan and home loan application. Here are some tips to increase such credit score.
Story first published: Wednesday, January 23, 2019, 17:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X