For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెన్షన్ పొందుతున్న వారికీ SBI బ్యాంకు ఇస్తున్న వరాలు!మీకోసం.

By girish
|

మలి వయసులో ఉన్న వారికి కోసం ప్రత్యేకించి ఎస్‌బీఐ లైఫ్ పేరుతో మూడు పెన్షన్ పథకాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉత్పత్తే ఈ ఎస్‌బీఐ లైఫ్.

జీవితంలో:

జీవితంలో:

మనిషి తన జీవితంలో చివరి క్షణాలను ఆనందంగా జీవించాలంటే పెన్షన్ అవసరం. జీవన కాలపు అంచనా రేటు పెరుగుతుండటం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగుతుండటం, భారతదేశంలో సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం వంటి ముఖ్య కారణాలు పదవీవిరమణ ప్రణాళికను బాగా క్లిష్టతరం చేస్తున్నాయి.

ఉమ్మడి కుటుంబాలు:

ఉమ్మడి కుటుంబాలు:

మనిషి తన జీవితంలో చివరి క్షణాలను ఆనందంగా జీవించాలంటే పెన్షన్ అవసరం. జీవన కాలపు అంచనా రేటు పెరుగుతుండటం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగుతుండటం, భారతదేశంలో సామాజిక భద్రతా వ్యవస్థ లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం వంటి ముఖ్య కారణాలు పదవీవిరమణ ప్రణాళికను బాగా క్లిష్టతరం చేస్తున్నాయి.

పదవీ విరమణ:

పదవీ విరమణ:

మీ జీవితం పదవీ విరమణ తర్వాతి కాలం ఆనందమయం చేసుకోవడాన్ని కొనసాగించడంలో సహాయం చేయడం కోసం, ఎస్‌బిఐ లైఫ్ మీకు సులభమైన, వినూత్న పెన్షన్ పథకాలను అందిస్తోంది. పెన్షన్ కోసం ఎస్‌బీఐ ప్రత్యేకంగా మూడు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి ఎస్‌బీఐ లైఫ్ యాన్యుటీ ప్లస్, రెండోది ఎస్‌బీఐ సరళ్ పెన్షన్, మూడవది ఎస్‌బీఐ లైఫ్ రిటైర్ స్మార్ట్.

ఎస్‌బీఐ లైఫ్ - సరళ్ పెన్షన్:

ఎస్‌బీఐ లైఫ్ - సరళ్ పెన్షన్:

ఎస్‌బిఐ లైఫ్-సరళ్ పెన్షన్ అనేది వ్యక్తిగత, లాభాలతో కూడిన, సాంప్రదాయమైన పెన్షన్ ప్లాన్, మీకు భద్రతతో కూడిన భవిష్యత్తు, సంతోషకరమైన పదవీవిరమణ అందించి మార్కెట్ ఒడిదుడుకుల నుంచి పూర్తి భద్రత కలిగిస్తుంది.

పథకం యొక్క ముఖ్యాంశాలు:బోనస్:

మొదటి 5 సంవత్సరాలకు హామీపూరిత సులభమైన బోనస్‌లు వస్తుంది, మొదటి మూడు సంవత్సరాలకు బీమాపై 2.50 శాతం, ఆ తర్వాతి రెండు సంవత్సరాలకు గాను 2.75 శాతం బోనస్ లభిస్తుంది. అమలులో ఉన్న పాలసీలకు మాత్రమే హామీపూరిత బోనస్ వర్తిస్తుంది.

గడవు ముగింపు (మేచ్యురిటి) లాభం: పాలసీలో జమ అయిన బోనస్‌, బోనస్‌లు ముగింపు, ఏవైనా ఉంటే, బీమాపై 0.25 శాతం చొప్పున ప్రతి సంవత్సరం చక్రవడ్డీ కూడా కలుపబడుతుంది.‍‌

మృత్యువు లాభం: (చెల్లించిన ప్రీమియం మొత్తం 0.25% చక్రవడ్డీతో కలిపి + బోనస్‌) లేదా కనీసంగా చెలిలంచిన మొత్తంపై 105శాతంగా లభిస్తుంది. జీవిత భద్రత: ఎస్‌బిఐ లైఫ్ - అదనపు జీవిత భద్రత ఎంపిక. పెన్షన్‌ ప్రారంభ తేదీనాడు, మెచ్యూరిటీ మొత్తంతో తక్షణ పెన్షన్‌ పాలసీ కొనుగోలు చేసుకొనవచ్చు లేదా 1/3వ వంతు నగదు రూపంలో తీసుకుని, మిగిలిన మొత్తంతో పెన్షన్‌ పాలసీ కొనుగోలు చేయవచ్చు.

సౌకర్యం: మీ గడవు ముగింపు తేదిని 70 సంవత్సరాల వయసు వరకు పొడిగించుకోవచ్చు లేదా మీ పాలసీ ముగింపు వ్యవధిని పొడిగించుకోవచ్చు.

ఎస్‌బీఐ రిటైర్ స్మార్ట్ పాలసీ:

ఎస్‌బీఐ రిటైర్ స్మార్ట్ పాలసీ:

ఈ పాలసీ లో, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలోని పెట్టబడి రిస్క్‌ పాలసీదారునిచే భరించబడుతుది. "ఒప్పందం మొదటి ఐదు సంవత్సరాలలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు ఎలాంటి లిక్విడిటి అందించవు. ఐదో సంవత్సరం ముగింపు వరకు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులలో పెట్టిన డబ్బు పెట్టుబడులను పూర్తిగా లేదా పాక్షికంగా అప్పగించుకునే వీలు పాలసీదారులకు ఉండదు.

పథకం యొక్క ముఖ్యాంశాలు:వార్షిక ప్రీమియం యొక్క 210 శాతం వరకు హామీతో మీ ఫండ్ విలువను పెంపొందించడం జరుగుతుంది. (నిబంధనలు వర్తిస్తాయి).

15వ పాలసీ సంవత్సరం ముగింపు మొదలునుంచి, తదనంతరం పాలసీ వ్యవధి ముగింపు వరకు ప్రతి సంవత్సరం క్రమబద్ధంగా వార్షిక ప్రీమియం యొక్క 10% హామీపూరితంగా చెల్లించడుతుంది.

గడువు ముగింపు లేదా ముందుగానే మృత్యువు సంభవిస్తే ఫండ్ విలువ యొక్క 1.5% అదనపు ముగింపును పొందవచ్చు. మీ పెట్టుబడుల నిర్వహణ చింతను ‘అడ్వాంటేజ్ ప్లాన్' ద్వారా ఎస్‌బీఐ లైఫ్ వదలండి.

గడువు ముగింపు నాడు చెల్లించిన అన్ని ప్రీమియమ్స్ యొక్క కనీసం 101శాతానికి ఈ ప్లాన్ హామీ ఇస్తుంది. ముందుగానే మృత్యువు సంభవిస్తే అన్ని ప్రీమియమ్స్ యొక్క కనీసం 105శాతం హామీపూరితంగా పొందొచ్చు.

ప్రీమియమ్స్ క్రమబద్ధంగా లేదా పరిమిత వ్యవధికి చెల్లించుకునేలా ఎంపిక చేసుకునే సౌకర్యం. మీ గడువు ముగింపు వయసును పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఎస్‌బీఐ యాన్యుటీ ప్లస్:

ఎస్‌బీఐ యాన్యుటీ ప్లస్:

ఇదో సాంప్రదాయమైన, తక్షణ ఎన్యుటి ప్లాన్, అంతర్నిర్మిత సౌకర్యాలతో విస్తృత శ్రేణి ఎన్యుటి ఎంపికలను ఇది అందిస్తోంది. ఎల్లప్పుడూ మంచి జీవిత ప్రమాణాలను కొనసాగించుకునేందుకు ఇది చక్కని అవకాశాలను అందిస్తుంది.

ముఖ్యమైన అంశాలు:

విస్తృత శ్రేణి ఎన్యుటి ఎంపికలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ 40 సంవత్సరాల వయసు నుండే క్రమబద్ధమైన ఆదాయం పొంది సంతోషంగా ఉండండి.

మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం జీవితాంతం ఎన్యుటి చెల్లింపులు పొందే ఎంపికను ఎంచుకోవచ్చు.

మీ అవసరాల ప్రకారం ఎన్యుటి చెల్లింపుల వ్యవధిని ఎంచుకునే సౌకర్యాన్ని మీరు పొందవచ్చు- నెల, మూడు నెలలు, ఆరు నెలలు లేదా సంవత్సరానికి.

పెద్ద ప్రీమియమ్స్‌కి అధిక ఎన్యుటి ధరల పారితోషికాలు మీ ఎన్యుటి చెల్లింపులను ముందుగానే తీసుకొనే సౌకర్యం ప్రీమియం లేదా బాలన్స్ ప్రీమియం తిరిగి పొందే అవకాశం

Read more about: sbi
English summary

పెన్షన్ పొందుతున్న వారికీ SBI బ్యాంకు ఇస్తున్న వరాలు!మీకోసం. | SBI Life Pension Plans

The State Bank of India offers three pension schemes, especially SBI Life, for those in the age group. SBI Life is the product of State Bank of India, the largest bank in India.
Story first published: Wednesday, December 5, 2018, 14:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X