For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు బ్యాంకు అకౌంట్లు ఉన్నవారు జాగ్రత్త! ఒక లుక్ వేయండి.

By girish
|

మనలో చాలా మంది... ఒకటికి మంచి బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటున్నాం. ఇటీవల కాలంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల సంఖ్య ఉన్నవారి సంఖ్య బాగా పెరిగింది. ఇలా ఒకటికి మంచి బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండటం మంచిదేనా అంటే, మంచిది కాదని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రెండు నుంచి ఐదు:

రెండు నుంచి ఐదు:

ఒక వ్యక్తికి రెండు నుంచి ఐదు వరకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని అనుకోండి. అయితే, వీటిలో అన్నింటినీ వాడుతున్నారా అంటే? సమాధానం మాత్రం వెంటనే చెప్పడం లేదు. జీతం పడే ఖాతాతో పాటు, ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాకింగ్‌ సౌకర్యాలను పూర్తి స్థాయిలో అందిస్తున్న బ్యాంకు ఖాతాలను మాత్రమే విరివిగా ఉపయోగిస్తున్నారని ఒక సర్వేలో తేలింది.

బ్యాంకు ఖాతా:

బ్యాంకు ఖాతా:

మరికొంత మంది అయితే తమకు ఫలానా బ్యాంకు ఖాతా ఉన్న విషయాన్నే మరిచిపోయామంటున్నారు. ఇలా ఉపయోగం లేని ఖాతాల వల్ల మున్ముందు సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే, ముందే వాటిని గుర్తించి రద్దు చేసుకోవడమే మంచిది.

కార్పోరేట్ ఉద్యోగ:

కార్పోరేట్ ఉద్యోగ:

సాధారణంగా కార్పోరేట్ ఉద్యోగ సంస్ధలు అందించే అకౌంట్లలో నిల్వ ఉంచక్కర్లేదు. సాధారణంగా వేతనం ఖాతాలు సున్నా నిల్వతో లభిస్తాయి. ఆయా సంస్థలు, బ్యాంకులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బ్యాంకులు ఈ వెసులుబాటును అందిస్తున్నాయి.

 ఉద్యోగం చేస్తున్నంత కాలానికే:

ఉద్యోగం చేస్తున్నంత కాలానికే:

ఇది ఆ సంస్థలో ఉద్యోగం చేస్తున్నంత కాలానికే వర్తిస్తుంది. ఒకసారి మీరు అక్కడ ఉద్యోగం మానేశారనుకోండి. వెంటనే ఆ ఖాతాను కూడా రద్దు చేసుకోండి. లేకపోతే మూడు నెలల తర్వాత ఆ ఖాతాను సాధారణ ఖాతాగా పరిగణిస్తారు. అప్పుడు మీరు కనీస నిల్వ ఉంచాల్సి వస్తుంది.

 పైన్:

పైన్:

ఒకవేళ మీరు ఆ ఖాతాను పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. నిర్ణీత సమయం తర్వాత పైన్ విధిస్తారు. కొంతకాలం తర్వాత ఇవి పెద్ద మొత్తం అయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు మీరు ఖాతా రద్దు చేసుకోవాలంటే ఈ మొత్తం అంతా చెల్లించాల్సి ఉంటుంది.

 క్రెడిట్‌ స్కోరుపైనా:

క్రెడిట్‌ స్కోరుపైనా:

వాడకంలో లేని ఖాతాలను వీలైనంత వెంటనే రద్దు చేసుకోండి. లేదా అన్నింట్లోనూ కనీస నిల్వ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అపరాధ రుసుములు విధిస్తే.. అది మీ క్రెడిట్‌ స్కోరుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీరు ఎక్కువగా ఉపయోగించని ఖాతాలకు నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాన్ని రద్దు చేయడం మంచిది.

 ఎప్పటికైనా మంచిదే

ఎప్పటికైనా మంచిదే

మీ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చూసుకోవడం మంచిది. అవసరాలను బట్టి, ఖాతాలను తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, వీలైనంత వరకూ వేతన ఖాతాకు తోడుగా మరో ఖాతాను తీసుకోవడం ఎప్పటికైనా మంచిదే.

Read more about: bank account
English summary

రెండు బ్యాంకు అకౌంట్లు ఉన్నవారు జాగ్రత్త! ఒక లుక్ వేయండి. | Do You Have Two Bank Accounts?

Many of us ... have a good bank account. In recent years, the number of people with more than one bank account has increased. Banking sector experts believe that good bank accounts such as good or bad are not good.
Story first published: Saturday, December 1, 2018, 15:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X