For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక్కడ అప్పు తీసుకోని కట్టకపోతే ఏమి అవుతుందో తెలుసా? మీరే చూడండి.

By girish
|

మీరు ఇల్లు కట్టుకోవడానికో లేదా కారు కొనుక్కోవడానికి లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది? దీని గురించి మీరు ఎపుడైనా ఆలోచించారా? బ్యాంక్ ఏమి చేస్తుంది. రుణాలు తీసుకునే ముందు వాటి వివరాల గురించి వాటి ఎంపికల గురించి ముందే తెలుసుకోండి. సొంత ఇల్లు అనేది ప్రతి సామాన్యుడి కల, కోరిక. గతంతో పోలిస్తే, ఈమధ్య కాలంలో, రుణాలతో కలలను నిజం చేసుకోవడం అనేది కాస్త క‌ష్ట‌ప‌డితే సాధ్యమ‌వుతోంది. మొట్టమొదటిసారి మీరు స్వంతంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ముందు మీ విలాసాల‌కు గొళ్ళెం వేయండి. చాలామంది వారి సామర్ధ్యాన్ని బట్టి ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి లోన్ కోసం వెళతారు. స్వంతంగా ఇల్లు కట్టుకున్న తరువాత, నెలసరి వాయిదా డబ్బు (EMI) ని మీరు చెల్లించ లేకపోతే ఏమవుతుంది? ఉదాహరణకు మీరు ఆసమయంలో ఉద్యోగం పోయినా లేదా మీరు జబ్బుపడి ఉంటే ఊహించుకోండి. మీ ఆర్ధిక పరిస్ధితి పడిపోతుంది. మీరు లోను కట్టలేక పోతారు. ఇలాంటి పరిస్ధితులలో ఏమి చేయాలో ఇక్క‌డ తెలుసుకుందాం.

1. మీరు సమయానికి EMI చెల్లించక పోతే ఏమవుతుంది?:

1. మీరు సమయానికి EMI చెల్లించక పోతే ఏమవుతుంది?:

అప్పుల మీద ప్రభావం పడుతుంది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ యాక్ట్ 2005 ప్రకారం, ఆర్ధిక సంస్ధలకు సంబంధించిన అన్ని రుణాలు, చెల్లించాలి చెల్లింపులు, CIBIL, కూడబెట్టిన యూనిట్ల ఇతర సమాచారం గుర్తించబడుతుంది. మీరు లోన్ తిరిగి చెల్లించక పోతే మీ రుణ విలువ తగ్గిపోతుంది.

2. ఎదుర్కోవడం ఎలా:

2. ఎదుర్కోవడం ఎలా:

సరైన సమయానికి ఇంటి లోన్ చెల్లించకపోతే, బ్యాంక్ లు ఆ ఇంటిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తారు. ఇలాంటి పరిస్ధితులలో బ్యాంక్ ఉన్నతాధికారులతో, తత్సంబంధమైన వారితో వాదించడం సరైనది కాదు. పరిస్ధితులను వివరించి, వారితో గౌరవంగా నడుచుకోవాలి. సాధ్యమైతే, సమస్యను స్నేహపూరిత పద్ధతిలో పరిష్కరించుకోవాలి

3. లోన్:

3. లోన్:

లోన్ పునరుద్ధరించడం కొన్ని కేసులలో ఇంటి రుణాలు పూర్తిగా తీరవు. ఒకవేళ అలాంటి పరిస్ధితి వచ్చినపుడు, వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకొని, ఉద్యోగం పోవడం లేదా జబ్బు పాడడం వంటివి. ఇవి తాత్కాలికమైన పరిస్ధితులు. కాబట్టి బ్యాంక్ ఉన్నతాధికారులను సంప్రదించి, వారికి పరిస్ధితిని వివరించాలి. మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఋణం తీరుస్తానని వారికి హామీ ఇవ్వాలి. మీరు ఇంతకు ముందు ఏదైనా లోను తీసుకుని సరైన సమయానికి చెల్లించి ఉంటె, వాటికి సంబంధించిన ఆధారాలను వారికి చూపించండి. బ్యాంక్ ఉన్నతాధికారులు వాటికి తృప్తిపడితే, వారు మీ లోన్ ని తిరిగి పునరుద్దరిస్తారు.

4. బ్యాంకు:

4. బ్యాంకు:

బ్యాంకు అందుకు ఒప్పుకోక‌పోతే... ఒకవేళ బ్యాంకు మీకు మరికొంత సమయాన్ని ఇవ్వడానికి లేదా లోన్ ని పునరుద్ధరించడానికి తిరస్కరిస్తే, మీరు మరో బ్యాంక్ ను సంప్రదించండి. మరో బ్యాంక్ తక్కువ వడ్డీకి లోన్ ఇస్తే, మీరు ఈ లోన్ ని చెల్లించ వచ్చు

5. పెట్టుబడులు:

5. పెట్టుబడులు:

పెట్టుబడులు బదిలీ చేయడం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీలు వంటి ఏవైనా ఇతర పెట్టుబడులు ఉంటే, మీరు లోన్ చెల్లించలేకపోతే, మీరు ఆ ఫండ్స్ ని వీటికి బదిలీ లేదా మార్చవచ్చు. అలాగే, మీ ఇల్లు చెక్కుచెదర కుండా ఉంటుంది.

6. ఇల్లు వదిలేయండి:

6. ఇల్లు వదిలేయండి:

ఇల్లు వదిలేయండి మీ ఆస్థిని కాపాడుకునే అవకాశం లేకపోతే, మీరు దాన్ని అమ్మేయండి. బ్యాంకుల కోసం ఎదురు చూడకుండా మీకు మీరే ఈపని చేయవచ్చు. మీరు సరైన వారికి సరైన ధరలో మీ ఇంటికి అమ్మే అవకాశం ఉంది. మంచి ధరకు ఇల్లు అమ్మి, ఇంటి ఋణం చెల్లించి, మిగిలిన డబ్బుతో సిటీ కి దూరంగా ఉన్న కొత్త ఇంటిని కొనుక్కోండి.

7. రుణగ్రస్తులకు:

7. రుణగ్రస్తులకు:

రుణగ్రస్తులకు కొన్ని అధికారాలు మీరు బ్యాంక్ డబ్బును చెల్లించడానికి మీరు మీ అధికారాలను వదిలేయాల్సిన అవసరం లేదు. ఆస్ధిని అమ్మే ముందు, బ్యాంక్ లు రుణగ్రస్తులకు తగినంత సమయాన్ని ఇస్తుంది. లోన్ చెల్లించ కుండా కనీసం 90 రోజులు గడిస్తే, అది NPA గా భావిస్తారు. బ్యాంక్ లు 60 రోజుల తరువాత నోటీసు పంపిస్తారు. అంటే, మీరు చెల్లించడానికి రెండు నెలల గడువు ఉంటుంది. మీ కాలపరిమితి మరో 30 రోజులు పొడిగించిన తరువాత, ఆస్ధిని వేలం వేసే హెచ్చరికతో ఒక నోటీసు ఇస్తారు. ఒకవేళ ఆస్థిని అమ్మకానికి వచ్చినపుడు, బ్యాంక్ లు ఆస్ధిని విలువ కట్టడానికి వాల్యుఎటర్ ని పంపిస్తారు. అంతేకాకుండా, ఎప్పుడి, ఎక్కడ, ఆయిల్లు ఇంతకు వేలం వేయబడుతుంది అనే వివరాలను నోటీసులో పొందుపరుస్తారు. మీరు ఆ ధర సరైనది కాదు అని భావిస్తే, మీ అభ్యంతరాలను వారికి తెలియచేయవచ్చు. ఒక ఏడు రోజులలో బ్యాంక్ దీనికి స్పందిస్తుంది. మీరు వారికీ మంచి ధర చూపిస్తే, బ్యాంక్ మరలా దాని గురించి ఆలోచిస్తుంది.

Read more about: loan
English summary

ఇక్కడ అప్పు తీసుకోని కట్టకపోతే ఏమి అవుతుందో తెలుసా? మీరే చూడండి. | What Happen If You Dont Pay Loan

What happens if you do not pay the house or take a loan to buy a car? Have you ever thought about it? What does the bank do? Find out about their options before taking the loan
Story first published: Friday, November 30, 2018, 11:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X