For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు డబ్బులు కావాలా? అయితే ఈ విషయాలు పాటించండి.

By girish
|

చిన్నచిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారుచేస్తాయి" అనే ప్రసిద్ధ నానుడి ఉంది అంటే అర్ధం మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంతో మొదలుపెట్టి దీర్ఘ‌కాలంలో ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయ‌వ‌చ్చు. ఆదాయాన్ని, ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించే వారు బాగా పొదుపు చేయ‌గ‌ల‌రు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఎదైనాసరే ముందు, ఒక బడ్జెట్ తయారుచేసుకుని, ఖర్చుల ప్రణాళిక వేసుకుని, ఒక డైరీ ని ఏర్పాటుచేసుకోవాలి, మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే, అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్నచిన్న ఖర్చులను లేక్కచేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తం అయి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని 10 డబ్బు ఆదా చేసే సలహాలు మీ కోస‌మే..

సరుకులు

సరుకులు

మీకు కావలసిన సరుకుల జాబితాను తయారుచేసుకుని బడ్జెట్ వేసుకోండి లేదా మీరు చివరకు అవసరంలేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారుచేసుకుంటే చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది, దానివల్ల అవసరంలేని వస్తువులను కొన‌కుండా ఉండ‌వచ్చు. పండుగ సీజన్ల‌లో లేదా అతిధులను ఆహ్వానించినపుడు ఒక జాబితాను పరిగణలోనికి తీసుకోవాలి. దాని ప్ర‌కార‌మే కొనుగోళ్లు చేయ‌డం మంచిది.

ఆన్ లైన్

ఆన్ లైన్

మీరు ఆన్ లైన్ లేదా విడిగా కోనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏమైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చి చూసుకోండి. అంతేకాకుండా, ఉదాహరణకు మీరు ఒక మొబైల్ కొనాలి అనుకుంటే, ఒక ధర మత్రమే కాకుండా ఆన్ లైన్ లో రివ్యూ కూడా చూడండి. ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై ఆన్‌లైన్‌లో అప్పుడప్పుడు ఆఫ‌ర్లు వ‌స్తుంటాయి. వాటిని వినియోగించుకోండి.

 మందులు

మందులు

మీరు మందులు కొనుగోలు చేసేటపుడు మీ బిల్ పై కొంత తగ్గింపు వచ్చే మెడ్ ప్లస్ లేదా అపోలో ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే, మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ID ని ఇస్తారు. ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించేటపుడు దీన్ని చూపించుకోవచ్చు. ఇటీవ‌ల చాలా రాష్ట్రాల్లో జ‌న‌రిక్ దుకాణాలు ప్రారంభిస్తున్నారు. వీటిని సైతం కొనుగోలు చేసి మీ బిల్లును త‌గ్గించుకోవ‌చ్చు.

 రెస్టారెంట్లలో

రెస్టారెంట్లలో

ఒక నిజంగా విశ్రాంతి కావాలంటే, డిన్నర్ లేదా మూవీ కి వెళ్ళాలి అనుకుంటే గాబ‌రా ప‌డి వెళ్ల‌వ‌ద్దు. ఏ రెస్టారెంట్లలో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో సమాచార జాబితాను కొన్ని వెబ్ సైట్లలో పరిశీలించుకోండి. మీరు సినిమా టికెట్లు బుక్ చేసే ముందు ఆ ఆపరేటర్ ఏమైనా కార్డ్స్ పై ఆఫర్లు పెట్టదేమో తెలుసుకోండి, కొన్ని బ్యాంకులకు వీటితో టై అప్ ఉంది.

 పండగ సీజన్లలో

పండగ సీజన్లలో

మీరు ఏదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురుచూడండి, పండగ సీజన్లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండగ సమయాలలో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి, కొన్ని వస్తుమార్పిడి ఆఫర్లు కూడా ఉంటాయి. పెద్ద వ‌స్తువు కొనుగోలు చేసేట‌ప్పుడు నాణ్య‌త‌కే ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే దాని కోసం మ‌ళ్లీ మ‌ళ్లీ ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం రాకూడ‌దు.

ఓఎల్ఎక్స్

ఓఎల్ఎక్స్

డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి, కొంతమంది అనవసరమైన వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే, వస్తువులను అమ్మేటపుడు తెలివి అవసరం. ఇటీవ‌ల ఓఎల్ఎక్స్ లాంటి వెబ్‌సైట్లు పాత వ‌స్తువుల‌ను అమ్మ‌డాన్ని సుల‌భ‌త‌రం చేశాయి.

క్రెడిట్ కార్డు

క్రెడిట్ కార్డు

క్రెడిట్ కార్డు అత్య‌వ‌స‌రాల్లోనే వాడండి. అవును, ఇది ప్రతి ఒక్కరికీ చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించడం చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడ‌క‌పోవడానికి ప్రధాన ఉద్దేశం అనవసరమైన కొనుగోలు చేయకుండా ఉండడం. క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే, మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్ లో ఉంచితే అవసరమైనపుడు వాటిని వాడుకోవచ్చు. ఇంధన స్టేషన్ల వంటి సర్ చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది.

 కారు -బైకును

కారు -బైకును

సాధ్యమైనంత వరకు కారుకు బదులు బైకును వాడండి. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. త‌క్కువ దూరాల‌కు న‌డ‌క మార్గాన్నే ఎంచుకోండి. ఇందుకు మీరు స‌మ‌య పాల‌న పాటించ‌డం అవ‌స‌రం. ఈ చిన్ని చిన్ని అంశాలు మీ ఇంధన చెల్లింపులను తగ్గించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డబ్బును

డబ్బును

మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. అనేక బ్యాంకులు ఆటో స్వీప్ సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి, అంటే మీ అకౌంట్ కొంత మొత్తానికి నిర్దేశిస్తే దానంతట అదే ఆ మొత్తం డబ్బు ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతాలోకి మ‌ళ్లింప‌బ‌డుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన FD లపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందవచ్చు.

ఆర్ధికపరమైన

ఆర్ధికపరమైన

అవును, ఆర్ధికపరమైన సమాచారం తెలుసుకుంటే, మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్లపై ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్ధిక వస్తువు కొనుగోలు చేసేముందు, ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి, సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి.

Read more about: business
English summary

మీకు డబ్బులు కావాలా? అయితే ఈ విషయాలు పాటించండి. | Tips to Save Money

Small water droplets together make a big sea, "which means you can start with a small amount of time and save a large amount in the long run.
Story first published: Thursday, November 8, 2018, 13:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X