ఈరోజుల్లో మనము అప్పు తీసుకోవాలి అంటే ప్రతి ఒకరు ష్యూరిటీ అడుగుతారు ఆఖరికి మన ప్రభుత్వ బ్యాంకులు మరియు ప్రైవేట్ బ్యాంకులు ష్యూరిటీ లేకుండా లోన్లు అసలు ఇవ్వదు. ఇలా చాలామందికి ష్యూరిటీ ఇచ్చి వారు ఒకవేళ కట్టకపోతే ష్యూరిటీ ఇచ్చిన వారు కట్టాలి ఇలా ఇబ్బంది పడుతున్నవారికోసం మరియు ష్యూరిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నవారి కోసం మేము ఇస్తున్న కొన్ని సలహాలు.

హోమ్ లోన్
బ్యాంకులు హోమ్ లోన్ ఇచ్చేప్పుడు డాక్యుమెంట్లపై కో-సైన్ తీసుకుంటూ ఉంటాయి. హోమ్ లోన్ అనే కాదు చాలావరకు లోన్స్ సమయంలో ష్యూరిటీ సంతకం తప్పనిసరి. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో మొత్తం రుణం చెల్లిస్తే ఏ సమస్యా ఉండదు. కానీ లోన్ చెల్లించకపోతే.ష్యూరిటీ సంతకం పెట్టినవాళ్లు ఇబ్బందులు పడాల్సిందే. అందుకే మీరు ష్యూరిటీ సంతకం పెట్టే కొంచెం ఆలోచించండి.

ష్యూరిటీ
ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి రుణం చెల్లించలేకపోతే నిబంధనల ప్రకారం వాయిదాలు కట్టాల్సిన బాధ్యత ష్యూరిటీ ఇచ్చిన వ్యక్తిపై ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ లోన్ తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు, రికవరీ పద్ధతులు ఎదుర్కోవాల్సి వస్తుంది. క్రెడిట్ రేటింగ్ కూడా పడిపోతుంది. అందుకే స్నేహితులకో, బంధువులకో కో-సైనర్‌గా సంతకం చేసే ముందు నియమనిబంధనలన్నీ చదువుకోవాలి.

సెక్యూరిటీ కోసం
లోన్ సెక్యూరిటీ కోసం బ్యాంకులు, అప్పులు ఇచ్చే సంస్థలు కొన్ని రుణాలపై కో-సైన్, ష్యూరిటీ సంతకాన్ని తప్పనిసరి చేశాయి. భారీ మొత్తంలో లోన్‌కు దరఖాస్తు చేసిన వ్యక్తికి సరైన క్రెడిట్ హిస్టరీ లేకపోయినా బ్యాంకులు ష్యూరిటీ సంతకం అడుగుతుంటాయి. కో-సైన్ పెట్టేవాళ్ల క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ లాంటివి ఖచ్చితంగా పరిశీలిస్తాయి బ్యాంకులు.

మీరే
హోమ్ లోన్స్, కార్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ లాంటివాటికి అస్సలు కో-సైన్ చేయకూడదు. వాటి వాయిదాలు, టెన్యూర్, వడ్డీ చాలా ఎక్కువ. ఎడ్యుకేషన్, బిజినెస్ లోన్ల విషయంలోనూ ష్యూరిటీ సంతకం పెట్టకపోవడమే మంచిది. ఈ రుణాలు తీసుకునేవాళ్లు మంచి ఉద్యోగంలో చేరిన తర్వాతో, వ్యాపారం పుంజుకున్నప్పుడో రుణాలు తిరిగి చెల్లించగలరు. లేకపోతే మీరే చెల్లించాల్సి వస్తుంది.

క్రెడిట్ స్కోర్
మీ ఆదాయం అస్థిరంగా ఉన్నా, ఆర్థికపరమైన బాధ్యతలు ఎక్కువగా ఉన్నా, మీ క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోయినా కో-సైన్ చేయకూడటమే ఉత్తమం. ఇలాంటి పరిస్థితుల్లో ష్యూరిటీ సంతకం పెడితే మీరు మరింత అప్పుల పాలయ్యే అవకాశముంది.

వాయిదాలు
ఇప్పటికే ష్యూరిటీ సంతకం పెట్టినట్టైతే కాస్త అప్రమత్తంగా ఉండాలి. అప్పు తీసుకున్న వ్యక్తిని అప్పుడప్పుడూ కలుస్తూ ఉండండి. లోన్ రీపేమెంట్ ఎంతవరకు వచ్చిందో ఆరా తీయండి. వాయిదాలు చెల్లించనట్టైతే. మీరు ఒత్తిడి తీసుకురండి.

12 నెలలు
అప్పు తీసుకున్న వ్యక్తి తన విశ్వసనీయతను తెలిపేందుకు, క్రెడిట్ స్కోర్ పెంచుకునేందుకు 12 నెలలు చాలు. ఆ తర్వాత కో-సైన్ లేకుండా ఉన్న లోన్‌నే రీఫైనాన్స్ చేయించొచ్చు. లోన్ ఒప్పందం నుంచి కో-సైనర్‌గా తప్పించాలని బ్యాంకును కోరొచ్చు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications