ప్రస్తుతం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని అనుకుంటే తక్షణమే గుర్తుకు వచ్చేది సిబిల్ క్రెడిట్‌స్కోర్. రుణం పొందాలనుకునేవారు తమ క్రెడిట్ స్కోర్ ఏవిధంగా ఉందో ఒకసారి చూసుకోవడం మంచిది. దీన్ని పట్టించుకోకుండా బ్యాంకుకు వెళితే మన దరఖాస్తు తిరస్కరణకు గురికావచ్చు. ఇల్లు, కారు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత కాలంలో బ్యాంకు నుంచి ఆశించిన స్థాయిలో రుణం పొందడం అంత సులభమైన వ్యవహారమేమీకాదు. ఇందుకోసం దరఖాస్తుకు ముందు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఈ సందర్బంలో రుణ గ్రహీతలందరికీ క్రెడిట్ స్కోర్ ఎంతగానో సహకరిస్తుంది. దేశంలో ఎక్కువ శాతం రుణ సంస్థలు సిబిల్ క్రెడిట్‌స్కోర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

క్రెడిట్ కార్డు మొదలుకొని గృహ రుణం వరకూ సిబిల్ క్రెడిట్‌స్కోర్‌కు ముడిపెట్టిన క్రమంలో దీని గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. క్రెడిట్ స్కోర్‌ను ఎవరు జారీ చేస్తారు? క‌్రెడిట్‌స్కోర్ ఎంత ఉండాలి? అనే విషయాల్లో చాలా మంది తికమకపడుతూ ఉంటారు. ఈ క్రమంలో దాని గురించి ఐదు విషయాలు తెలుసుకుందాం
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ స్కోర్(సీఐఆర్): సీఐఆర్ అంటే క్రెడిట్ బ్యూరో జారీ చేసే మూడంకెల సంఖ్య. ఇది 300 నుంచి మొదలుకొని 900 వరకూ ఉంటుంది. ఇది వ్యక్తుల రుణ చరిత్ర ఆధారంగా మారుతూ ఉంటుంది. ఇందులో మీ పొదుపు, పెట్టుబడులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వివరాలు ఉండవు. ఒక నిర్ణీత కాలానికి సంబంధించి రుణ గ్రహీత చేసిన చెల్లింపుల వివరాలు ఇందులో ఉంటాయి.
సిబిల్ క్రెడిట్ స్కోర్ ఆన్‌లైన్ నమోదు:సిబిల్ వద్ద వినియోగదారుగా చేరేందుకు ఆన్‌లైన్ మార్గం సులువుగా ఉంటుంది. ఇందుకోసం సిబిల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఒక ఆన్‌లైన్ నమోదు పత్రాన్ని పూర్తి చేయాలి. ఇందుకోసం ఒకసారి స్కోర్ నివేదిక తెచ్చుకునేందుకు రూ. 550 చెల్లించాలి. మీ వివరాలను ఆన్‌లైన్ నమోదు ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత మీ రుణ చరిత్ర, క్రెడిట్‌స్కోర్‌లు మెయిల్ ఐడీకి వస్తాయి.
సిబిల్ క్రెడిట్ స్కోర్ ఆఫ్‌లైన్ నమోదు :ఆన్‌లైన్ సదుపాయం అంతగా అందుబాటులో ఉండనివారు, అది ఇష్టం లేనివారు ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. మొదట వెబ్‌సైట్ నుంచి నమోదు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సీఐఆర్ కోసం అభ్యర్థిస్తూ ఒక మెయిల్‌ను పంపాలి. నమోదు పత్రంలో వివరాలను నింపాలి. నమోదు పత్రానికి, కేవైసీ పత్రాలు, రూ. 550 డీడీ జతపరుస్తూ నిర్దేశిత చిరునామాకు పోస్ట్ చేయాలి.
డాక్యుమెంట్లు(సిబిల్ అంగీకరించే డాక్యుమెంట్ల జాబితా)
- 1. పాన్‌కార్డు
- 2. ఓటరు గుర్తింపు పత్రం
- 3. పాస్‌పోర్టు
- 4. డ్రైవింగ్ లైసెన్సు పైన తెలిపిన వాటిలో ఏదైనా ఒక దాన్ని ఇస్తే సరిపోతుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications