For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు SBI క్రెడిట్ కార్డు కావాలా? చాలా ఈజీగా వస్తుంది.

By girish
|

ఖాతాదారుల‌ను డిజిట‌ల్ మార్గం వైపు మ‌ళ్లించ‌డంలో ఎస్‌బీఐ ఎప్పుడూ ముందుంటుంది. క‌నీస నిల్వ రూ.25 వేలను ఖాతాలో క‌లిగి ఉన్న వారంద‌రికీ క్రెడిట్ కార్డు ఇచ్చే స‌రికొత్త ప‌థ‌కం ఉన్న‌తిని ప్ర‌వేశ‌పెడుతున్న‌ది. కేవైసీ ప‌త్రాలు, క్రెడిట్ ద‌ర‌ఖాస్తు ఉంటే చాలు ఉన్న‌తి(క్రెడిట్‌) కార్డు జారీ అవుతుంద‌ని ఎస్‌బీఐ కార్డులు,చెల్లింపుల సేవ‌ల ముఖ్య కార్య‌నిర్వ‌హణాధికారి విజ‌య్ జ‌సుజా వెల్ల‌డించారు. దీని గురించి మ‌రిన్ని అంశాల‌ను తెలుసుకుందాం.

ఖాతాలో

ఖాతాలో

తమ ఖాతాలో కనీసం రూ.25 వేల నిల్వ నిర్వహించేవారికి ఎస్బీఐ అందించే కార్డు ఎస్బీఐ ఉన్నతి. ఈ కార్డుకు సంబంధించిన వార్షిక రుసుము రూ.499ని మొదటి నాలుగు సంవత్సరాల పాటు రద్దు చేశారు.

అడ్వాన్స్

అడ్వాన్స్

ప్రతి రూ. 100 ఖర్చుకు కస్టమర్లు ఒక పాయింటుని గెలుచుకుంటారు. నగదు అడ్వాన్స్, నగదు బదిలీ, ఎన్క్యాష్, ఫ్లెక్సీపే, ఇంధనం కోసం చేసే బిల్లు చెల్లింపులు వంటివి రివార్డు పాయింట్ల కార్యక్రమం కిందకు రావు. రూ. 500 నుంచి రూ. 3000 మధ్య చేసే పెట్రోలు, డీజిల్ కొనుగోలుకు సంబంధించి 2.5% ఫ్యూయల్ సర్చార్జీ మినహాయింపు ఉంటుంది. ఒక్కో స్టేట్మెంట్ సైకిల్లో సర్చార్జీ మినహాయింపు రూ. 100 వరకూ ఉంటుంది.

ఎస్బీఐ ఉన్నతి

ఎస్బీఐ ఉన్నతి

దేశంలో ఉన్న 3,25,000 అవుట్లెట్లు, అంతర్జాతీయంగా ఉన్న 2.4 కోట్ల అవుట్లెట్లను ఎస్బీఐ ఉన్నతి కార్డును వాడుకోవచ్చు. వీసా లేదా మాస్టర్ కార్డును అంగీకరించే ఏ అవుట్లెట్లో అయినా కార్డును ఉపయోగించే వీలుంది.

ఈఎంఐ

ఈఎంఐ

ఈ కార్డును ఖాతాలో ఉండే డిపాజిట్ ఆధారంగా అందిస్తున్నారు. ఒకసారి ఖాతాదారులకు క్రెడిట్ హిస్టరీ వచ్చిన 12 నెలల తర్వాత డిపాజిట్ నిబంధనను సడలిస్తారు. ఈ కార్డు ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఈఎంఐల కోసం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, ఈజీ మనీ, ఫ్లెక్సి పే, యాడ్ ఆన్ ఆప్షన్ సదుపాయాలను పొందవచ్చు.

ఎస్‌బీఐ దేశంలో

ఎస్‌బీఐ దేశంలో

ఎస్‌బీఐ దేశంలో అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకు. దేశ‌మంతా ఏటీఎమ్ నెట్వ‌ర్క్ విస్త‌ర‌ణ‌తో పాటు, చాలా గ్రామీణ ప్రాంతాల‌కు చేరువ‌లో శాఖ‌లు క‌లిగిన బ్యాంకు ఇది.అటువంటి బ్యాంకులో అనుబంధ బ్యాంకుల‌న్నీ విలీనం కావ‌డంతో ప్ర‌పంచ స్థాయికి ఇది ఎదగ‌టానికి అవ‌కాశం వ‌చ్చింది

రుసుము

రుసుము

  • వార్షిక రుసుము: 499 (మొద‌టి నాలుగేళ్ల పాటు ఉండ‌దు)
  • రెన్యువ‌ల్ రుసుము: 5వ ఏట నుంచి రూ.499
  • యాడ్‌-ఆన్ రుసుము: ఏమీ ఉండ‌దు
  • క్యాష్ అడ్వాన్స్ లిమిట్‌:

    క్యాష్ అడ్వాన్స్ లిమిట్‌:

    గ‌రిష్టంగా రోజుకు రూ.12 వేలు ఉండేలా; మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 80% వ‌ర‌కూ; ఫ‌్రీ క్రెడిట్ పీరియ‌డ్ :ఉండ‌దు ఫైనాన్స్ రుసుము: గ‌రిష్టంగా 2.50% వ‌రకూ; లావాదేవీల నుంచి వార్షికంగా 30 శాతం అమ‌ల‌య్యేలా ఈ రుసుములు ఉంటాయి.

    వ‌డ్డీ ర‌హిత కాల‌ప‌రిమితి :

    వ‌డ్డీ ర‌హిత కాల‌ప‌రిమితి :

    20 నుంచి 50 రోజులు, ఇంత‌కు ముందు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ చెల్లించి ఉంటే రిటైల్ కొనుగోళ్ల‌పై ఇది అమ‌ల‌వుతుంది. ఫైనాన్స్ రుసుములు: గ‌రిష్టంగా 2.50% వ‌రకూ; లావాదేవీల నుంచి వార్షికంగా 30 శాతం అమ‌ల‌య్యేలా ఈ రుసుములు ఉంటాయి. క‌నీస నిల్వ నిర్వ‌హ‌ణ‌(మిన‌మ‌మ్ అమౌంట్ డ్యూ): మొత్తం రుణ(చెల్లించాల్సిన దానిలో) ప‌రిమితిలో క‌నీసం 5%(క‌నీసం రూ.200+ప‌న్నులు అద‌నం+ఈఎంఐ+ఓవీఎల్ అమౌంట్‌(ఏదైనా ఉంటే))

    ఆల‌స్య చెల్లింపు రుసుములెలా ఉన్నాయి?

    ఆల‌స్య చెల్లింపు రుసుములెలా ఉన్నాయి?

    రూ. 0-200వ‌ర‌కూ : ఎటువంటి ఫైన్ లేదు రూ. 200- రూ. 500 : రూ. 100 రూ. 500- రూ. 1000 : రూ. 400 రూ. 1000- రూ. 10,000: రూ. 500 రూ. 10 వేల‌కు పైన : రూ. 750

    ఎస్‌బీఐ కార్డులో

    ఎస్‌బీఐ కార్డులో

    ఎస్‌బీఐ కార్డులో త‌న వాటాను 74 శాతానికి పెంచుకునే విధంగా స్టేట్ బ్యాంక్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. రెండు ఉమ్మ‌డి వెంచ‌ర్ల‌యిన ఎస్‌బీఐ కార్డ్‌(ఎస్‌బీఐసీపీఎస్ఎల్‌), జీఈ క్యాపిట‌ల్ బిజినెస్ ప్రాసెసింగ్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ లిమిటెడ్‌ల‌లో రూ. 1160 కోట్ల పెట్టుబ‌డికి ఎస్‌బీఐ అనుమ‌తించింది. జీఈ వ‌ద్ద 26 శాతం వాటాను ఉంచుకుంటూ మిగిలిన వాటాను ఎస్‌బీఐకి అమ్మేయాల‌నేది ఎస్‌బీఐ ప్ర‌తిపాద‌న‌. దీనిపై జీఈ నిర్ణ‌యం తీసుకోవాల్సింది ఉంద‌ని ఎస్‌బీఐ ఛైర్‌ప‌ర్స‌న్ తెలిపారు.

     క్రెడిట్ కార్డు

    క్రెడిట్ కార్డు

    దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ 1998లో క్రెడిట్ కార్డు వ్యాపారంలోకి దిగింది. యూఎస్‌కు చెందిన జీఈ సంస్థ‌కు చెందిన‌ ఆర్థిక విభాగం అయిన జీఈ క్యాపిట‌ల్ ఇండియా ద్వారా క్రెడిట్ కార్డు రంగంలోకి స్టేట్ బ్యాంకు ప్ర‌వేశించింది. 43 ల‌క్ష‌ల ఎస్‌బీఐ కార్డు వినియోగ‌దారులున్న ఈ సంస్థ స్టేట్ బ్యాంకు వినియోగ‌దారులంద‌రినీ ల‌క్ష్యంగా చేసుకుని ఉన్న‌తి కార్డును త‌యారుచేసింది

Read more about: sbi
English summary

మీకు SBI క్రెడిట్ కార్డు కావాలా? చాలా ఈజీగా వస్తుంది. | SBI Credit Card With Less Amount

SBI always prefers to channel the clients towards digital route. Minimum reserve Rs 25,000 is the introduction of a new scheme for credit card issuers
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X