ఒకప్పుడు పోస్ట్ ఆఫీసు లేనిదే వ్యవస్థ స్థంబించేది జనాల జీవన విధానం పోస్ట్ ఆఫీసు పై అదరపడేది.
ఒకప్పుడు పోస్ట్ ఆఫీసు లేనిదే వ్యవస్థ స్థంబించేది జనాల జీవన విధానం పోస్ట్ ఆఫీసు పై అదరపడేది కానీ ఎప్పుడు ఆ పరిస్థితులు లేవు.పోస్ట్ ఆఫీస్ సేవలకు ప్రత్యామ్నాయంగా ఎన్నో అందుబాటులోకి వచ్చేసాయి.

పొదుపు:
కానీ ఎన్ని వచ్చిన ప్రజా జీవితం లో పొదుపు అనే మంత్రాన్ని చెప్పింది మాత్రం పోస్ట్ ఆఫీస్ అని కచ్చితంగా చెప్పవచ్చు.మల్టీ నేషనల్ బ్యాంకుల హావ నడుస్తున్న ఈరోజుల్లో పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలపై ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు.

మెరుగైన సాంకేతిక సేవలు:
అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా తీసుకోని తపాలా శాఖలోనూ డిపాజిట్లు చెక్ సదుపాయం,ATM,ఆన్లైన్ నగదు బదిలీల వంటి సౌకర్యాలు వేగాంగా పుంజుకున్నాయి.ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ నిర్వహించే ముఖ్యమైన పథకాల గురించి తెలుసుకుందాం.

పెట్టుబడి పై కచ్చితమైన రాబడి:
పెట్టుబడి పై కచ్చితమైన రాబడి అలాగే సురక్షితమైన పెట్టుబడులతో నెల నెల ఆదాయం కోరుకునే వారికి ఎదో అద్భుత పథకం.విశ్రాంత ఉద్యోగులకు మరియు సీనియర్ సిటిజెన్లకు ఈ పథకం చాల అనుకూలంగా ఉంటుంది.

ఈ పథకం కింద:
ఈ పథకం లో కనీసం రూ.1500 రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రారంభించవచ్చు.సింగల్ ఖాతా లో గరిష్టాంగా రూ.4.5 లక్షలవరకు పెట్టుబడి పెట్టవచ్చు,అదే ఉమ్మడి ఖాతా ఐతే రూ.9.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.దీనికి రాబడి 7.6 శతం వార్షిక వడ్డీ వర్తింపుతో నెల నెలా మీ కథలో జమ చేస్తారు.

కాల పరిమితి:
ఈ నెలవారీ ఆదాయం పథకం పరిమితి ఐదు సంవత్సరాలు,మీరు ఖాతా ప్రారంభ సమయంలో లేదా ఎప్పుడైనా నామినీని ప్రతిపాదించవచ్చు.నామినీగా ఉన్న వారు ఎవరైనా ఎప్పుడైనా మార్చుకునే సౌలభ్యం ఉంది.ఖాతా ప్రారంభ సమయంలో ఈ పద్దతిని కచ్చితంగా పాటించ్చాలి.

MIS ఫారం:
మీ పూర్తి వివరాలు నింపిన MIS ఫారం తో పాటు సంబంధిత చిరునామా అలాగే గుర్తింపు పత్రాలు రెండు ఫోటోలు ఏదైనా పోస్ట్ ఆఫీసులో సమర్పించాలి.ఖాతాను నగదు లేదా చెక్కు ద్వారా ప్రారంభించవచ్చు ఈ పద్దతిలో ముందే ఖాతా కలిగిన వ్యక్తితో సంతకం సవసరం అవుతుంది.

ఎన్ని ఖాతాలైన:
ఒక ఖాతా దారు ఎన్ని MIS ఖాతాలయిన తెరిచే అవకాశం ఉంది,ఐతే అన్ని ఖాతాల్లో మొత్తం రూ.4.5 లక్షల కంటే మించకూడదు.అంతే కాదు నెలవారీ ఆదాయం పథకం ఖాతాకు పాస్ బుక్కు కూడా అందజేస్తారు.ఒకవేల మీరు మీ ఖాతా వేరేచోటికి లేదా వేరే వూరికి బదిలీ చేయాలనుకుంటే ఒక పోస్ట్ ఆఫీస్ నుండి మరో పోస్టాఫీసుకు బదిలీ చేయవచ్చు.

ఏడాది తరువాత:
డిపాజిట్ చేసిన ఏడాది తరువాత ఖాతాను మూసివేసి నగదును ఉపసంహరణ చేసుకోవచ్చు,అదే ఏడాది తరువాత లేక మూడేళ్లకు ముందు ఖాతాను మూసి వేయాలి అనుకుంటే మీ ఖాతా లో మొత్తం నుండి రెండు శతం కూత విధిస్తారు.అదేవిదంగా మూడేళ్లు నిండి ఐదేళ్లు పూర్తి కాకపోతే డిపాజిట్ పై ఒక శాతం కూత విదిస్తుంది.

పెట్టుబడి పెట్టిన రోజు నుండి:
పెట్టుబడి పెట్టిన రోజు నుండి చందాదారుకు నెల నెలా వడ్డీ వస్తుంది,ఈ వడ్డీ పోస్ట్ ఆఫీస్ నుండి నేరుగా తీసుకోవచ్చు లేదా మనం పొదుపు చేసిన ఖాతాలో మరియు బ్యాంకు ఖాతాకు మళ్లించవచ్చు.వడ్ఢిసొమ్ము ఉపసంహరణ చేయకపోతే దానిపై అదనంగా వడ్డీ జమ అవ్వదు.

ఐదేళ్ల కాలపరిమితి ముగిసాక:
ఖాతా ఐదేళ్ల కాలపరిమితి ముగిసాక ఖాతాదారుకు మొత్తం డబ్బును తిరిగి చెల్లిస్తారు.దీనికోసం పూర్తిగా నింపిన ఫారం తో పాటు MIS అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ స్కీం పాస్ బుక్కును పోస్ట్ ఆఫీస్ లో సమర్పించాలి.ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి లేదా దానిపై వడ్డీ రూపం లో వచ్చే ఆదాయానికి ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు.మీకు ఇంకో లాభదాయకం ఏమనగా ఈ పథకం ద్వారా బోనసులు కూడా వస్తాయి MIS ల ద్వారా మంచి లాభాలను పొందాలనుకునే వారు ఈ పథకం ఎంచుకోవడం చాల ఉత్తమం మరియు క్షేమం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications