మీకు ఉద్యోగం పోయిన భద్రత కలిపించే కొన్ని మార్గాలు మీకోసం!

ఈరోజుల్లో చదువుకున్న విద్యార్థులు ఎక్కువైపోయారు దీనివల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతంది. అది కాక ఐటీ కంపెనీలు ఈమధ్య ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు కేవలం ఒక ఐటీ కాదు ఇంకా చాలా వ్యవస్థలలో ఉద్యోగాలకు చాలా కష్టపడుతున్నారు.

 టెక్నాలజీ

టెక్నాలజీ

ఇప్పుడు ఇంకా మొత్తం అంతా టెక్నాలజీ అభివృద్ధి జరుగుతాంది ఇక ఐటీ వైపుకి వస్తే మొత్తం అంతా ఆటోమేషన్ జరుగుతోంది అంటే ఇక ఆటోమేషన్ వస్తే మనుషులతో అవసరం ఉండదు. ఈ సమయంలో మీరు చేస్తున్న ఉద్యోగం పోతే మరి మీ ఆర్ధిక లావాదేవీలు ఆగిపోతాయి ఇలా జరుగుతే ఏమి చేయాలో మీకు తెలుసా?

ఉద్యోగం

ఉద్యోగం

మీకు ఉద్యోగం పోతుంది అని మీకు తెలిసిన వెంటనే మీరు వేరే ఉద్యోగానికి సిద్ధం కావాలి. కొత్త జాబ్ దొరికేవరకూ అవసరాలు ఆగకూడదు. వీటి కోసం అత్యవసర నిధి ఏర్పాటు బీమా రక్షణ, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని రంగాల ఉద్యోగులకూ ఇవి తప్పనిసరి. ఉద్యోగంలో ఉన్నప్పుడే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నది నిపుణుల సలహా.

 బీమా పాలసీ

బీమా పాలసీ

ఉద్యోగం పోతే రోజువారీ అవసరాలు ఆగకూడదు. లోన్లు తీసుకుని ఉంటే వాటికి చేసే చెల్లింపులూ ఆగకూడదు. మీకు వివాహం జరిగి పిల్లలు ఉంటేవారికీ కుటుంబ ఖర్చులు ఎక్కువే ఉంటాయి. అందుకే కనీసం ఓ ఆరు నెలల కుటుంబ, ఇతర అవసరాలకు సరిపడా డబ్బుని ఉద్యోగంలో ఉన్నపుడే పక్కన పెట్టుకోవాలి. ఇంటి ఖర్చులనూ, బీమా పాలసీలను పరిగణనలోకి తీసుకోవాలి. కొంచెం కూడా రిస్క్ ఇష్టం లేని వారు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ చేసే సిప్ పెట్టుబడులు లేదా రికరింగ్ డిపాజిట్లను కూడా కలుపుకుంటే మంచిది. ఎంత మొత్తం కావాలో స్పష్టత వచ్చాక ఆ మేరకు నిధిని సమకూర్చుకోవాలి. ముఖ్యంగా ఈ నిధి సమకూరేంత వరకు ప్రతి నెలా ఇతర అవసరాలను త్యాగం చేయడానికి వెనకాడకూడదు

సేవింగ్స్

సేవింగ్స్

అత్యవసర నిధి సమకూరాక వీలును బట్టి సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో లేదా లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే అవసరమైన సమయంలో వెంటనే తీసుకునేందుకు వీలుంటుంది. కాకపోతే ఈ రెండింట్లో లిక్విడ్ ఫండ్స్‌లో రాబడి ఎక్కువ. బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో నిల్వలపై 4 శాతమే వడ్డీ కాగా, దీంతో పోల్చుకుంటే లిక్విడ్ ఫండ్స్‌లో రాబడి రెండు శాతం ఎక్కువే ఉంటుంది. ఇలా అత్యవసర నిధి సమకూరాక ఉద్యోగం కోల్పోయినా, లేదా మీ అంతట మీరు మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాన్ని వదిలినా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. నెలవారీ అవసరాలకు ఇబ్బంది ఏర్పడదు. అన్ని చెల్లింపులూ యథావిధిగా అత్యవసర నిధి నుంచి చేసేయవచ్చు. బీమా రక్షణ తప్పనిసరి. ఉద్యోగం కోల్పోయి మరో ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో మీకంటూ ఆరోగ్య బీమా రక్షణ తప్పకుండా కొనసాగడం అవసరం.

హెల్త్ ఇన్సూరెన్స్

హెల్త్ ఇన్సూరెన్స్

బీమా పాలసీలో మీతోపాటు జీవిత భాగస్వామి, పిల్లలకు కూడా కవరేజీ తప్పకుండా ఉండాలి. ఇలా కాకుండా సీనియర్ సిటిజన్ ఇన్సూరెన్స్ పేరుతో పెద్దలకు ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆ పాలసీని తీసుకోవడం మంచి ఆలోచనే. సాధారణంగా కంపెనీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకూ కవరేజీ ఉంటుంది. ఒకవేళ ఆ సంస్థ నుంచి తప్పుకుంటే, బీమా రక్షణ కొనసాగుతుందా? అన్నది స్పష్టం చేసుకోవాలి. కవరేజీ కొనసాగదంటే విడిగా పాలసీ తీసుకోవడం అన్ని విధాలుగా మంచిది. ముఖ్యంగా ఖర్చులకు కళ్లెం వేయాలి.. ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ ఖర్చులను నియంత్రించుకోవడం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. మరీ ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయే ముప్పు ఉన్నవారికి ఇది మరీ అవసరం.

 దీర్ఘకాలిక లక్ష్యాలు

దీర్ఘకాలిక లక్ష్యాలు

క్రెడిట్ కార్డు ఉండి దానిపై రుణం తీసుకుని ఉంటే, వీలైనంత వేగంగా చెల్లింపులు చేసేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఇక ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో ఏవి త్యాగం చేసినా దీర్ఘకాలిక అవసరాలకు ఉద్దేశించిన పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. తాత్కాలిక అవసరాల కోసం దీర్ఘకాలిక లక్ష్యాలు దెబ్బతినకుండా చూసుకోవడం అవసరం. రెండు మూడు నెలలే కదా, ఆపితే ఏం కాదులేనన్న ధోరణి వల్ల నష్టమే. ఉద్యోగం లేని పరిస్థితులను అధిగమించేందుకు ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+