మినిమం బ్యాలన్స్ లేని ఖాతాలపై బ్యాంకులు విధించే ఛార్జ్ ఎంతో తెలుసా?
బ్యాంకుల్లో రెగ్యులర్ పొదుపు ఖాతాలకు ప్రతి నెల మినిమం యావరేజ్ బ్యాలన్స్ (MAB) నిర్వహించడం వినియోగదారులకు అవసరం.
బ్యాంకుల్లో రెగ్యులర్ పొదుపు ఖాతాలకు ప్రతి నెల మినిమం యావరేజ్ బ్యాలన్స్ (MAB) నిర్వహించడం వినియోగదారులకు అవసరం. పట్టణ, మెట్రో, పాక్షిక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్ల ఖాతాకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటివి నెలవారీ సగటు బ్యాలన్స్ అవసరాలు స్థిరపరిచాయి.
ఒక నెలలో MAB నిర్వహించకుండా విఫలమైన వినియోగదారులు పెనాల్టీ ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. శాఖ స్థానాన్ని బట్టి పెనాల్టీ మొత్తం మారుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)
మెట్రో మరియు పట్టణ శాఖలలో ఎస్బిఐ కస్టమర్లు ప్రతి నెల కనీస సగటు బ్యాలన్స్ రూ. 3,000 .పాక్షిక పట్టణ శాఖల ఖాతాదారులకు కనీస సగటు బ్యాలన్స్ రూ. 2,000, మరియు గ్రామీణ శాఖలలో ఖాతాలను కలిగి ఉన్నవారు Rs.1000 రూపాయల చూపిన ఉండాలని బ్యాంకు యొక్క వెబ్సైట్ sbi.co.in లో తెలిపింది.

హెచ్డిఎఫ్సి బ్యాంక్
మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచీలలో సాధారణ పొదుపు ఖాతా కలిగిన వినియోగదారుడు నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ. 10,000. పాక్షిక పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన నెలసరి సగటు రూ. 5,000 మరియు రూ. 2,500 రూపాయలు ఉండాలని బ్యాంక్ వెబ్సైట్ hdfcbank.com లో తెలిపింది.

ICICI బ్యాంక్:
మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న ICICI బ్యాంక్ బ్రాంచీలలో సాధారణ పొదుపు ఖాతా కలిగిన వినియోగదారుడు నెలవారీ కనుస నిలువలు రూ. 10,000 రూపాయలు ఉండాలి అని బ్యాంకు వెబ్సైట్ icicibank.com లో తెలిపింది.

కొటక్ మహీంద్రా బ్యాంక్:
మెట్రో మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న కొటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచీలలో సాధారణ పొదుపు ఖాతా కలిగిన వినియోగదారుడు నెలసరి సగటు బ్యాలన్స్ నిర్వహణరూ.10,000 రూపాయలు ఉండాలని బ్యాంకు వెబ్సైట్ kotak.com లో తెలిపింది.


Click it and Unblock the Notifications