For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డు విధించే 6 రకాల చార్జీలు మీకోసం!

By girish
|

డిజిట‌ల్ చెల్లింపుల ప్ర‌స్థానం మొద‌లైన‌ప్ప‌టి నుంచి కార్డుల వాడ‌కం అంత వేగంగా పెర‌గ‌లేదు. అయితే నోట్ల ర‌ద్దు త‌ర్వాత నుంచి ఆన్‌లైన్ చెల్లింపుల,కార్డుల వాడకం కాస్త ఎక్కువైంది. దీంతో చాలా చోట్ల షాపింగ్‌ల కోసం కార్డులను వాడే వారి సంఖ్య ఎక్కువైంది. మొద‌ట డెబిట్ కార్డులు క‌లిగిన వారు సైతం మ‌ళ్లీ క్రెడిట్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్నారు. అవ‌స‌ర‌మైన చోట క్రెడిట్ కార్డు త‌ర‌చూ వాడ‌టానికి సైతం వెనుకాడ‌టం లేదు. మొద‌ట అన్ని ఉచితం అంటూనే క్రెడిట్ కార్డులు నెమ్మ‌దిగా చార్జీల బాదుడు మొద‌లెడ‌తాయి. ఈ క్ర‌మంలో క్రెడిట్ కార్డుల‌కు సంబంధించి ఉండే వివిధ రుసుముల గురించి తెలుసుకుందాం.

ప్రారంభ ఛార్జి :

ప్రారంభ ఛార్జి :

క్రెడిట్‌ కార్డు జారీ చేసే సమయంలో విధించే రుసుము. మీ క్రెడిట్ కార్డు ద‌ర‌ఖాస్తు, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ మొద‌లైన వాటికి కంపెనీకి కొంచెం ఖ‌ర్చ‌వుతుంది. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థ‌లు దీన్ని వినియోగ‌దారు నుంచే వ‌సూలు చేస్తాయి.

వార్షిక నిర్వహణకై:

వార్షిక నిర్వహణకై:

ముందుగా నిర్ణయించిన ప్రకారం సంవత్సరానికి కొంత రుసుము చెల్లించాలి. చాలా బ్యాంకులు ఉచిత క్రెడిట్ కార్డు అంటూ ఊరిస్తాయి. దీన‌ర్థం ఏంటంటే ఏడాది పాటు జాయినింగ్ ఫీజు, వార్షిక నిర్వ‌హ‌ణ రుసుముల్లాంటివి ఉండ‌వు. త‌ర్వాత రెండో ఏడాది నుంచి వార్షిక నిర్వ‌హ‌ణ రుసుము క‌ట్టాల్సిందే. దీన్ని మొద‌ట్లోనే తెలుసుకోవాలి.

డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ పొందినందుకు:

డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ పొందినందుకు:

ఇంటికి స్టేట్‌మెంట్‌ తెప్పించుకున్నందుకు వసూలు చేసే రుసుమునే డూప్లికేట్ స్టేట్ మెంట్ ఫీజు అంటారు. సాధార‌ణంగా మీరు ఇచ్చిన చిరునామాకు లేదా మెయిల్ ఐడీకి స్టేట్‌మెంట్ల‌ను నెల‌వారీ పంపుతారు. పోస్ట‌ల్ అడ్ర‌స్‌కు ఒక‌సారే ఉచితంగా స్టేట్ మెంట్ పంపుతారు. అది కాకుండా అద‌నంగా డూప్లికేట్ స్టేట్ మెంట్ అడిగారో దానికి రుసుము చెల్లించాల్సిందే.

4. ఆలస్య చెల్లింపులపై:

4. ఆలస్య చెల్లింపులపై:

నిర్ణీత గడువులోగా చెల్లించని వాటికి ఆలస్య చెల్లింపు రుసుములను పెనాల్టీగా విధిస్తారు. సాధార‌ణ వ‌డ్డీల‌తో సంబంధం లేకుండా ఇది నిర్ణీత మొత్తంలో ఉంటుంది. రూ.500 నుంచి రూ.20 వేల మ‌ధ్య అయితే అద‌నంగా ఆల‌స్య చెల్లింపు రుసుముల రూపంలో రూ.100 నుంచి రూ.600 వ‌ర‌కూ చెల్లించాలి. ఇది బ్యాంకును బ‌ట్టి మారుతూ ఉంటుంది.

5.నగదు తీసుకున్నందుకు:

5.నగదు తీసుకున్నందుకు:

ఏటీఎమ్‌ల నుంచి నగదు తీసుకుని వాడుకున్నందుకు చెల్లించే రుసుము పరిమితికి మించి వాడుకున్నందుకు కొంత రుసుము చెల్లించాల్సిందే. కొన్ని క్రెడిట్ కార్డు సంస్థ‌లు మాత్ర‌మే ఈ సేవ‌ను ఉచితంగా వాడుకునేందుకు అనుమ‌తిస్తున్నాయి. దాదాపు అన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు ఏటీఎమ్ నుంచి న‌గ‌దు తీసుకుంటే క్రెడిట్ కార్డుదారుల‌పై రుసుముల భారం వేస్తున్నాయి. ప్రతి క్రెడిట్‌ కార్డుకు పరిమితి ఉంటుంది. పరిమితికి మించి వాడుకుంటే అందుకు ప్రత్యేకమైన రుసుములను విధిస్తారు.

6. సేవా రుసుము:

6. సేవా రుసుము:

క్రెడిట్‌ పరిమితి, వడ్డీ, ఇతర రుసుములన్నింటినీ కలుపుకుని వాటి మీద సేవా రుసుము ఉంటుంది

Read more about: credit card
English summary

క్రెడిట్ కార్డు విధించే 6 రకాల చార్జీలు మీకోసం! | Credit Card Charges You Must Know

Since the beginning of digital payments, the use of cards has not grown rapidly. However, after the termination of banknotes, the use of online payments and cards increased slightly.
Story first published: Thursday, November 29, 2018, 11:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X