బీమా ప్రతీ ఒక్కరికీ అవసరం. అది మీ జీవితంలో ఓ భాగంగా మారిపోవాలి. మరి ఏఏ పాలసీలు ఉండాలో తెలుసుకోండి.

ఇన్సూరెన్స్ పాలసీ
ఇంటి యజమానికి ఓ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే చాలని గతంలో అనుకునేవారు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. పరిస్థితులు, అవసరాలు మారుతున్నా కొద్దీ బీమా కవర్ తీసుకోవాలన్న స్పృహ పెరుగుతోంది. ఎందుకంటే ఆరోగ్య అత్యవసర పరిస్థితి వస్తే ఇన్సూరెన్స్ పాలసీ ఆదుకోదు. దానికి మెడిక్లెయిమ్ ఉండాల్సిందే. ఇలా జీవితంలో ఒక్కో అవసరానికి ఒక్కో తరహా పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

జీవిత బీమా
ఇది ప్రతీ ఒక్కరికీ ఉండాల్సిన బీమా. టర్మ్ ప్లాన్ తీసుకోవడం చాలా అవసరం. ఇది మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. ఆకస్మిక మరణం, ప్రాణాంతక రోగాలబారిన పడటం, వైకల్యం... ఈ మూడు పరిస్థితుల్లో టర్మ్ ప్లాన్ ఆదుకుంటుంది. వార్షిక ఆదాయం కన్నా 10 రెట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలన్నది అందరూ పాటించే నియమం.

ఆరోగ్య బీమా
టర్మ్ ప్లాన్ ఎంత ముఖ్యమో హెల్త్ ప్లాన్ కూడా అంతే ముఖ్యం. మీ కంపెనీ ఇచ్చినదానికన్నా ఎక్కువే హెల్త్ ప్లాన్ తీసుకోండి. కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా తప్పనిసరి. రూ.20 లక్షల వరకు తీసుకోవడం మంచిది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రూ.25 లక్షల వరకు ఉండాలని అంటుంటారు నిపుణులు.

వాహన బీమా
మీకు జీవిత బీమా ఉన్నా, వాహనానికి ఇన్సూరెన్స్ ఉన్నా... థర్డ్ పార్టీ కవర్ తప్పనిసరి. ఎందుకంటే మీ వాహనం కారణంగా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే... ఆ బాధితుడికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం అందించొచ్చు. ఇవి కాకుండా ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, రోడ్ అసిస్టెన్స్ కవర్, జీరో డిప్రిసియేషన్ కవర్ పేరుతో కొన్ని పాలసీలున్నాయి

ఇంటికో పాలసీ
మీ ఇంటికి హోమ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు షాప్ ఉంటే 'షాప్‌కీపర్స్ ఇన్సూరెన్స్' తీసుకోవచ్చు. హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తికి బ్యాంకులు ఇన్సూరెన్స్‌లు ఇస్తాయి. ఎందుకంటే... హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మిగతా ఈఎంఐలు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది.

రిటైర్మెంట్ పాలసీ
మీరు రిటైర్ అయ్యాక నెలనెలా కొంత ఆదాయం కావాలనుకుంటే మాత్రం ఇప్పట్నుంచే రిటైర్మెంట్ పాలసీ తీసుకోవాలి. రిటైర్ అయ్యాక మీరు బతికున్నన్నాళ్లు ఇన్సూరెన్స్ కంపెనీ నెలనెలా డబ్బులు చెల్లిస్తుంది

చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ
ఈ రోజుల్లో చదువులు చాలా ఖరీదయ్యాయి. వీటిని దృష్టిపెట్టుకొని కంపెనీలు చైల్డ్ పాలసీలను అందిస్తున్నాయి. పిల్లలు పెద్దయ్యాక వారి మంచి కోర్సుల్లో చేరే సమయానికి పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చు.

పాలసీలను
అయితే మీరు ఏ పాలసీ తీసుకోవాలన్నా ముందుగా కంపెనీల ట్రాక్ రికార్డుతో పాటు పాలసీలను, వచ్చే లాభాలను పోల్చి చూసుకోవాలి. లేదా గైడెన్స్ కోసం ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలవడం మంచిది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications