For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసలు ఈ టర్మ్ పాలసీ అంటే ఏంటో తెలుసా?అసలు ఎందుకు ఈ టర్మ్ పాలసీకి ఇప్పుడు ఇంత డిమాండ్!

By Sabari
|

ఈ మధ్యకాలంలో టర్మ్‌ పాలసీ అనే మాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సంప్రదాయ బీమా కంపెనీలతోపాటు, మల్టీనేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలూ టర్మ్‌ పాలసీలకు బాగా ప్రచారం కల్పించడంతోపాటు, వాటిని ఖాతాదారునికి మరింత దగ్గరగా చేస్తున్నాయి.

జీవితబీమా

జీవితబీమా

జీవితబీమా పాలసీల్లో అత్యంత సులభంగా అర్థమయ్యేది టర్మ్‌ జీవితబీమా పాలసీ. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే.. పెద్ద మొత్తంలో బీమా మొత్తం నామినీకి అందుతుంది. పాలసీ వ్యవధిలో ఏ ఆపదా రాకపోతే అప్పటివరకూ చెల్లించిన ప్రీమియం వెనక్కిరాదు. ఇప్పుడంతా ఆన్‌లైన్‌ లేదా డిజిటలైజేషన్‌దే హవా కనుక టర్మ్‌ పాలసీలను ఆన్లోలైన్లోనూ తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది.

ఆన్‌లైన్‌లో.. టర్మ్‌ పాలసీ

ఆన్‌లైన్‌లో.. టర్మ్‌ పాలసీ

టర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు.. ఇలాంటప్పుడు వీలైనంత వరకూ ప్రీమియంలో రాయితీ లభిస్తున్నప్పుడు వదులుకోకూడదు. ఆఫ్‌లైన్‌లో తీసుకున్న పాలసీలతో పోలిస్తే ఆన్‌లైన్‌ పాలసీల్లో ప్రీమియం దాదాపు 40 శాతం వరకూ తక్కువగా ఉండొచ్చు. కాబట్టి, చాలామంది ఆన్‌లైన్‌లో టర్మ్‌పాలసీ తీసుకునేందుకు మొగ్గు చూపిస్తుంటారు.

అదనపు ప్రయోజనాలనూ

అదనపు ప్రయోజనాలనూ

ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని రుసుములు తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు డాక్యుమెంట్ల ఖర్చు, ఏజెంట్ల కమిషన్‌, పరిశీలనా రుసుములాంటివి ఉండవు. బీమా కంపెనీలు ఈ మొత్తాన్ని పాలసీదారులకు మళ్లిస్తాయి. దీంతోపాటు కొన్నిసార్లు అదనపు ప్రయోజనాలనూ అందిస్తాయి.

ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీ

ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీ

ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీ కొనాలంటే కచ్ఛితంగా మంచి సాంకేతికతపై అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. సులభంగా పాలసీని తీసుకుని, ప్రీమియం చెల్లించవచ్చు. ఆన్‌లైన్‌లో టర్మ్‌ పాలసీలు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరగడానికి కారణం బీమా సంస్థలు టర్మ్‌ పాలసీ లను ఆన్‌లైన్‌లో తీసుకునే వారి సౌకర్యం కోసం, ఎంతో సులువుగా ఆ ప్రక్రియ ఉండేలా చూస్తున్నాయి.

పాలసీదారుడు

పాలసీదారుడు

లావాదేవీ తేలికగా నిర్వహించేందుకు, అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌ టర్మ్‌పాలసీలు వ్యక్తులను బట్టి, వారికి ఏది అనుకూలంగా ఉంటుందో దాన్నే ఎంచుకునేందుకు వీలు కల్పిస్తాయి. అంటే, పాలసీదారుడు తన ఇష్టానుసారం పాలసీలోని అంశాలను నిర్ణయించుకోవచ్చు. తమకు అనువైన పాలసీలను ఎంచుకోవాలని భావించేవారికి ఆన్‌లైన్‌ టర్మ్‌ పాలసీలు అనువైనవి.

Read more about: policy
English summary

అసలు ఈ టర్మ్ పాలసీ అంటే ఏంటో తెలుసా?అసలు ఎందుకు ఈ టర్మ్ పాలసీకి ఇప్పుడు ఇంత డిమాండ్! | What is Term Policy and Benefits of Term Policy

In the meantime, term policy has become very popular. In addition to traditional insurance companies, multinational insurance companies provide better coverage for term policy and make it more close to the client.
Story first published: Tuesday, August 28, 2018, 11:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X