డిజిటల్ మోసాల నుండి మీ డబ్బును ఎలా కాపాడుకోవాలి?

Subscribe to GoodReturns Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    నేడు మనం ఉపయోగించే అనేక వస్తువుల కోసం డిజిటల్ లావాదేవీలను అనుసరిస్తున్నాం.పలు పరికరాలను ఉపయోగించడం వల్ల ముఖ్యంగా మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన డేటాను బయటపెట్టడం మరియు మీ సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల మీకు హాని కలిగించవచ్చు. మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించేటప్పుడు దొంగతనాల బారిన పడకుండా ఇలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.పాస్వర్డ్ లు, రహస్య ప్రశ్నలు మరియు బ్యాంకులు అలాగే ఆర్బిఐ మీ సొంత తప్పులు వల్ల డేటాను కాపాడటం కుదరదు.

    ఆన్లైన్ మోసాల నుండి మీరు మీ డబ్బును ఏలా కాపాడుకోవాలో కొన్ని చర్యలు చూడండి:

    స్మార్ట్ సెక్యూరిటీ ప్రశ్నలను ఎంచుకోండి:

    స్మార్ట్ సెక్యూరిటీ ప్రశ్నలను ఎంచుకోండి:

    మీ నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ను మార్చడం లేదా మీ ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ ఖాతా కేవలం రెండు భద్రతా ప్రశ్నలకు దూరంగా ఉంటుంది. మీరు "మీ తండ్రి పేరు ఏమిటి?" వంటి సాధారణ ప్రశ్నలను ఎంచుకుంటే లేదా "మీకు ఇష్టమైన ఆట ఏమిటి? వంటి ప్రశ్నలకు మీ సోషల్ మీడియా ఖాతాల నుండి ఎవరైనా సులభంగా సమాధానమివ్వబడుతుంది మరియు మీ ఖాతాను హ్యాక్ కూడా చేయగలదు.

    సోషల్ మీడియాలో జాగ్రత్తలు వహించండి:

    సోషల్ మీడియాలో జాగ్రత్తలు వహించండి:

    మీ సోషల్ మీడియా సైట్లలో ఏ ప్రభుత్వ ఐడి ప్రూఫ్ చిత్రాలు కానీ , పుట్టిన తేదీ వంటి వివరాలను బహిర్గతం చేయడం వలన సోషల్ మీడియాలో మీ డాటాను సులభంగా హ్యాక్ చేయొచ్చు. మీ ఇష్టమైన విషయాల వంటి వ్యక్తిగత వివరాలు భద్రతా ప్రశ్నలకు విరుద్ధంగా సహాయపడతాయి.

    ATM లలో క్లోనింగ్ పరికరాలు:

    ATM లలో క్లోనింగ్ పరికరాలు:

    ఢిల్లీ మరియు కోల్కతా వాసుల యొక్క క్లోన్ కార్డులను ఉపయోగించి ATM ల నుండి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసిన అనేక కేసులు భారతదేశంలో మరియు విదేశాలలో వివిధ ప్రాంతాలలో నమోదయ్యాయి.

    బ్యాంకులు ఈ సమస్యను గుర్తించాయి మరియు చిప్ లతో మాగ్నెటిక్ స్ట్రిప్ ఉన్న ATM కార్డుల వాటిలో భర్తీ చేస్తున్నాయి, ఎందుకంటే అయస్కాంత స్ట్రిప్స్తో ఉన్న పాత కార్డులను క్లోన్ చేయగలరు. మీరు ఇంకా మీ కార్డును మార్చనట్లయితే, వెంటనే మార్చుకోండి.

    ఫోన్ కాల్స్:

    ఫోన్ కాల్స్:

    క్రెడిట్ కార్డులు లేదా రుణాలు గురించి మీరు స్వీకరించే అన్ని కాల్స్ ప్రామాణికమైనవి కావు. పలువురు మోసపూరిత వ్యక్తులు మీ వ్యక్తిగత వివరాలను మరియు మీ బ్యాంక్ యొక్క పూతి వివరాలను దొంగిలించడానికి కాల్స్ చేస్తారు.ఇది అలాగే ఇమెయిల్స్ కూడా వర్తిస్తుంది. ఈ మోసగాళ్లు ఉదాహరణకు hdfcbank@gmail.com వంటి అధికారిక ఇమెయిల్ చిరునామాలను అబ్దిస్తారు, ఇది పూతిగా నకిలీ ఇమెయిల్స్.

    మీ బ్యాంకు శాఖను సందర్శించి నేరుగా కార్డుల కోసం అప్లై చేయండి.కొందరు నేరగాళ్లు బ్యాంకులు లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ నుండి రిఫండ్ వంటి వాటికోసం ఫోన్లు చేసినపుడు OTP, పాస్వర్డ్లు, పాన్ కార్డు నంబర్లు, ఆధార్ నంబర్లు లేదా జనన తేదీ వంటి వివరాలు ఏవి ఇవ్వకండి.

    చట్టబద్ధమైన సాఫ్ట్ వేర్ లేదా యాప్ లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి:

    చట్టబద్ధమైన సాఫ్ట్ వేర్ లేదా యాప్ లను మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి:

    మార్కెట్లో ఉచిత సాఫ్టువేర్ ​​మరియు యాప్ లు పెద్ద ఎత్తున చలామణిలో ఉన్నాయి, అది కేవలం ఒక టచ్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లు మీ పరికరంలో స్థానం, SMS, మొదలైనవి వంటి సమాచారాన్ని బహిర్గతం చేయడానికి అనుమతిని అభ్యర్థిస్తాయి, మీరు నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదం ఉంది. మీరు మీ స్వంత డేటాను మాత్రమే బహిర్గతం చేయడమే కాకుండా మీ ఫోన్ లో ఉన్న పరిచయాల లిస్ట్ కూడా బహిర్గతం అవుతుంది.

    ఆన్లైన్ షాపింగ్:

    ఆన్లైన్ షాపింగ్:

    ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లతో మీ కార్డు వివరాలను మరియు CVV ని స్టోర్ చేయవద్దు,మీరు తరచు ఆన్లైన్ షాపింగ్ చేయడం లో ఇది సులభతరంగా ఉంటుందని చాలామంది తమ వివరాలు నమోదు చేసి ఉంచుతారు కానీ ఇది చాల తప్పు. వెబ్ సైట్ నుండి ఎటువంటి దొంగతనం ఉండదు, మీరు మీ లాప్టాప్, డెస్క్టాప్ లేదా ఫోన్ అనువర్తనం మీ సైట్లో లాగ్ ఇన్ చేసాక మీరు లేనప్పుడు మీ ఆర్థిక వివరాలను బహిర్గతం చేస్తారు. మీ సిస్టమ్ను మూసివేసిన తర్వాత ఈ వెబ్సైట్లు సాధారణంగా తమ సొంత లాగ్ అవుట్ చేయవు.

    ఎల్లప్పుడూ మీ ఫోన్ను లాక్ చేయండి:

    ఎల్లప్పుడూ మీ ఫోన్ను లాక్ చేయండి:

    ఆధార్ ప్రమాణీకరణతో సహా దాదాపు ప్రతి లావాదేవీ కేవలం ఒక OTP ను ఉపయోగించి జరపవచ్చు. మీ ఫోన్ మీ పాస్వర్డ్ను, ఇమెయిల్ చిరునామా మరియు ఖాతాకు నమోదు చేసిన ఫోన్ నంబర్ను మార్చడానికి ఎవరికైనా ప్రాప్యతను ఇవ్వగలదు మరియు అది మీకు కూడా తెలియదు. పాస్వర్డ్లను మీ ఫోన్లో భద్రంగా ఉంచుకోండి మరియు ఎవరితోనూ భాగస్వామ్యం చేయవద్దు.

    Read more about: bank fraud digital fraud
    English summary

    How to Protect Your Money From Digital Thefts?

    From paying for groceries to cars, today, we are highly exposed to digital transactions. Using multiple devices and exposing important data especially related to your finances can leave you vulnerable to misuse of information.
    Story first published: Monday, August 27, 2018, 17:36 [IST]
    Company Search
    Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
    Thousands of Goodreturn readers receive our evening newsletter.
    Have you subscribed?

    Find IFSC

    Get Latest News alerts from Telugu Goodreturns

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more