For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు అధిక సంఖ్యలో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.ఐతే ఇది చూడండి.

మీకు అధిక మొత్తం లో డబ్బు అత్యవసర పరిస్థితుల్లో సమకూర్చే వాటిలో క్రెడిట్ కార్డు ప్రస్తుత ఆధునిక ప్రపంచం లో చాల ముఖ్యమైనది.

|

మీకు అధిక మొత్తం లో డబ్బు అత్యవసర పరిస్థితుల్లో సమకూర్చే వాటిలో క్రెడిట్ కార్డు ప్రస్తుత ఆధునిక ప్రపంచం లో చాల ముఖ్యమైనది. డబ్బు ఖర్చు చేయడానికి పలు విధాలుగా చాల వాటికి ఖర్చుచేయాల్సి ఉంటుంది, వీటికోసం క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు. చాలామంది క్రెడిట్ కార్డు సంస్థలు తమ వినియోగదారులకు మెరుగైన విలువ ప్రతిపాదనలను అందించడానికి వేర్వేరు ఉత్పత్తి మరియు సేవలను అందించారు. దీని వలన వినియోగదారుడు ఎన్నో కార్డులను తన ప్రియమైన ఖర్చు కేటగిరిలో పొందుతాడు.కార్డు లోని ప్రతి విభాగంలో పలు ప్రయోజనాలు మరియు లాభాలు ఉన్నాయి, కొన్ని నగదు పధకాలతో మరియు మరికొన్ని డిస్కౌంట్ పద్ధతుల్లో మరియు ప్రయోజనాలను అదనంగా అందిస్తుంది, కొన్ని ప్రీమియమ్ కార్డులకు ప్రీమియర్ హోటల్స్, గోల్ఫ్ క్లబ్బులు లేదా లాయల్టీ కార్యక్రమాలు, ప్రత్యేక విధమైన క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా దాని విధేయత పాయింట్లు పొందవచ్చని అమర్ప్రీత్ కౌర్,

TASS భాగస్వామి సలహాదారులు చెప్పారు. మీరు తరచుగా విమాన ప్రయాణాలు,వస్త్ర దుకాణదారుడు, ఇ-దుకాణదారుడు లేదా గాడ్జెట్ ఔత్సాహికుడు ఐతే మీకు ఇష్టమైన అంశాలపై గొప్ప ఒప్పందాలు అందిస్తున్న అనేక క్రెడిట్ కార్డులను మీరు పొందవచ్చు. కానీ, అనేక క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం కూడా మీకు హాని కలిగించవచ్చు .

మీకు ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటే మంచిదో ఇక్కడ మేము చెప్తున్నాము:

క్రెడిట్ కార్డు సహాయం అవసరమైనప్పుడు:

క్రెడిట్ కార్డు సహాయం అవసరమైనప్పుడు:

క్రెడిట్ కార్డు మీకు ముందస్తు డబ్బును ఉత్తమంగా ఇస్తుంది, మీరు కోరినప్పుడు దానిని ఉపయోగించుకోవచ్చు మరియు వడ్డీ లేని ఉచిత క్రెడిట్ కాలవ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు, ఇందులో మీకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. అత్యవసర సమయంలో మీరు మీ పొదుపు డబ్బు అయిపోయినప్పుడు మరియు కొన్ని నిధులు అవసరం అయినప్పుడు, మీ క్రెడిట్ కార్డు యొక్క క్రెడిట్ పరిమితి మీకు గొప్ప సహాయంగా అందిస్తుంది. మీ క్రెడిట్ కార్డు క్రమం తప్పకుండా మీరు ఉపయోగించినట్లయితే, మంచి క్రెడిట్ చరిత్రను నిర్వహించడం మరియు మంచి క్రెడిట్ స్కోర్ను రూపొందించడంలో ఇది మీకు సహాయపడుతుంది. మీరు అరుదుగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్న వ్యక్తి అయితే మరియు క్రెడిట్ కార్డు చెల్లింపు కోసం అధిక సమయం కేటాయించడం వంటివి వద్దు అనుకుంటే, మీరు ఒక్క క్రెడిట్ కార్డు మాత్రమే వాడటం ఎంతో ఉత్తమం.

మీరు అధిక సంఖ్యలో కార్డులను కలిగి ఉన్నారా?

మీరు అధిక సంఖ్యలో కార్డులను కలిగి ఉన్నారా?

మీరు తరచుగా క్రెడిట్ కార్డు వినియోగదారునిగా మరియు క్రెడిట్ కార్డుల మీద ఆధారపడినట్లయితే, మీ రోజువారీ ఉపయోగాలకు అనేక చెల్లింపులు జరిపి ఉంటే, మీరు కొన్ని కార్యాచరణలు మరియు సాంకేతిక అవాంతరాలను ఎదుర్కోడానికి సిద్ధం కావాలి. అవి కార్డు సంబంధిత,యంత్రానికి సంబంధించిన, నెట్వర్క్ సంబంధించిన లేదా చెల్లింపు గేట్వే సంబంధించిన అంశాలు ఉంటాయి. అంతేకాక, మీ కార్డును మీరు పోగొట్టుకున్నట్లయితే మరల కొత్త కార్డు కోసం కొంత సమయం వేచి చూడాలి. అటువంటి కొన్ని సందర్భాల్లో, మీ క్రెడిట్ కార్డులలో ఒకదానిలో అందుబాటులో లేకపోయినా లేదా క్రియాత్మకంగా పనిచేయకపోయినా కూడా చెల్లింపు చేయడానికి అనుమతించే రెండో క్రెడిట్ కార్డు మీకు చాల ఉపయోగపడుతుంది. రెండవ కార్డు మీ మొత్తం క్రెడిట్ పరిమితిని పెంచుతుంది మరియు అందుకే అత్యవసర పరిస్థితిని నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది.

బహుళ కార్డులను ఎలా చెల్లించాలి?

బహుళ కార్డులను ఎలా చెల్లించాలి?

క్రెడిట్ పరిమితి తక్కువ ఉపయోగం మంచి క్రెడిట్ ప్రవర్తనపై మంచి స్కోరును కేటాయించే క్రెడిట్ బ్యూరోలచే వివేక ప్రవర్తనగా పరిగణించబడుతుంది. అధిక క్రెడిట్ వినియోగం వెళ్ళినపుడు అది ప్రతికూలంగా మీ క్రెడిట్ స్కోరు మీద ప్రభావితం చేయవచ్చు. మీకు ఒకే ఒక క్రెడిట్ కార్డు ఉంటే, మీరు సాధారణంగా క్రెడిట్ పరిమితిలో ఎక్కువ భాగం ఉపయోగించుకుంటారు. మరోవైపు, మీరు అనేక క్రెడిట్ కార్డులను కలిగి ఉంటే, మీరు మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో కొద్ది శాతం మాత్రమే ఖర్చు చేస్తారు. మీరు మీ అన్ని కార్డుల యొక్క క్రెడిట్ పరిమితి లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే ఉపయోగించుకునే విధంగా మీ ఖర్చులను ప్లాన్ చేసుకోవచ్చు మరియు మీరు బహుళ క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నట్లయితే ఒకేసారి పెద్ద మొత్తం లో డబ్బు మీ అవసరాలను తీర్చవచ్చు. ఇది సానుకూల లక్షణంగా పరిగణించబడుతుంది మరియు మీ క్రెడిట్ స్కోర్ను పెంచడంలో సహాయపడుతుంది. మరిన్ని క్రెడిట్ కార్డులు కూడా మీ మొత్తం క్రెడిట్ పరిమితిని మెరుగుపరుస్తాయి, తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోగల సామర్థ్యం మీకు లభిస్తుంది.

ఇది ఎపుడు భాదిస్తుంది:

ఇది ఎపుడు భాదిస్తుంది:

క్రెడిట్ కార్డులు సౌలభ్యం అందించే వరకు బాగా నిర్వహించగలము కాకపోతే, దానిని సక్రమంగా వినియోగించుకోక దుర్వినియోగం చేస్తే మీకు చుక్కలు కనపడటం కాయం. మొదట మీరు వాడుతున్న అనేక కార్డుల చెల్లింపు గడువు తేదీలు గుర్తుంచుకోండి, అప్పుడు సకాలంలో చెల్లింపు నిర్వహించడానికి అనుగుణంగా నగదు ప్రవాహం ప్రణాళికలు తయారవుతాయి.అనేక క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వలన మీకు సమస్యలు తలెత్తవచ్చు. మీ ఖర్చులను మించి కాకుండా, సరైన ఖాతాలను నిర్వహించడం మరియు తిరిగి రాబట్టడం వంటి సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు.అన్ని బహుళ క్రెడిట్ కార్డుల చెల్లింపు తేదీలు పెరిగి వడ్డీ రేట్లు / చివరి ఫీజులు పెరగవచ్చు మరియు అది మీ క్రెడిట్ స్కోరు ప్రభావితం చేయవచ్చు అని ఆమన్ప్రీత్ చెప్పారు. మీరు దుర్వినియోగానికి పాల్పడినట్లయితే, మీకు అధిక జరిమానాలు విదయించి ఆపై మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతీయవచ్చు, ఇది భవిష్యత్తులో మీకు ఎలాంటి క్రెడిట్ను పొందగల ఆస్కారం ఉండదు.

పరిమితి సంఖ్యలో కార్డులు ఉపయోగించడం:

పరిమితి సంఖ్యలో కార్డులు ఉపయోగించడం:

రెండు క్రెడిట్ కార్డుల స్టేట్మెంట్స్ మరియు గడువు తేదీలు సకాలం లో ట్రాక్ చేయడం మీకు ఒక టాస్క్ లాంటిది. అందువలన, మీరు నిర్వహించగలిగే అనేక కార్డులకు మించి వాడకపోవడం చాల మంచిది.క్రెడిట్ కార్డుల సంఖ్యను నియంత్రించడం ద్వారా, ఒకరికి రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులను కలిగి ఉండకూడదు,దీనివల్ల ఒక వ్యక్తి తన అధికారిక మరియు వ్యక్తిగత ఖర్చులను సులభంగా వేరుచేయవచ్చు.అంతేకాకుండా, ఒక కార్డు మాత్రమే ఆన్లైన్ కొనుగోళ్లకు ఉపయోగించ్చలి,అధిక కార్డులు వాడటం వలన ఆన్లైన్ మోసాల ప్రమాదానికి గురికావచ్చు.

Read more about: credit cards personal finance
English summary

మీరు అధిక సంఖ్యలో క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.ఐతే ఇది చూడండి. | How Many Credit Cards Should You Have?

Instant availability of credit at your disposal is among the finest conveniences offered by modern financial world. There are plenty of avenues to spend money, so are the ways credit card can be used.
Story first published: Wednesday, August 29, 2018, 11:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X