For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా..?

ఈ మ‌ధ్య వార్త‌లో ఎక్కువ‌గా బిట్ కాయిన్ గురించి వింటూ ఉంటారు. అందులో ఎక్కువ లాభాలు వ‌స్తున్నాయ‌న్న కార‌ణంగా ఎంతో మంది మ‌ధ్య త‌ర‌గ‌తి వారు దానిలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్ర‌మంలో అది

|

ఈ మ‌ధ్య వార్త‌లో ఎక్కువ‌గా బిట్ కాయిన్ గురించి వింటూ ఉంటారు. అందులో ఎక్కువ లాభాలు వ‌స్తున్నాయ‌న్న కార‌ణంగా ఎంతో మంది మ‌ధ్య త‌ర‌గ‌తి వారు దానిలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్ర‌మంలో అది ఎలా ప‌నిచేస్తుంది, చెల్లింపు విష‌యాలు అంటే ఏమిటి తెలుస‌కోవ‌డం ముఖ్యం.బిట్ కాయిన్ అనేది ఈ దేశానికి చెందిన కరెన్సీ కాదు. ఏ దేశ చట్టాలు, ప్రభుత్వాల హామీలు దానికి లేవు. ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచీగా ఉంటాయి. బిట్ కాయిన్ కు అలాంటి పూచీకత్తు లేదు. ఈ క్ర‌మంలో దీని గురించి మ‌రింత లోతుగా తెలుసుకుందాం.

1.ఇది నిజ‌మైన క‌రెన్సీయేనా...

1.ఇది నిజ‌మైన క‌రెన్సీయేనా...

బిట్ కాయిన్ వర్చువల్ కరెన్సీ మాత్రమే. అనగా ఇంటర్నెట్ లో ఉపయోగించే కరెన్సీ మాత్రమే. నిజ ప్రపంచంలో వాస్తవ చెల్లింపులకు బిట్ కాయిన్స్ ఉపయోగించాలంటే మళ్ళీ వాటిని నిజ కరెన్సీగా మార్చుకుంటే గాని చెల్లవు.

2. బిట్ కాయిన్ పేరెలా?

2. బిట్ కాయిన్ పేరెలా?

బిట్ కాయిన్ ను డిజిటల్ కరెన్సీగా చెప్పవచ్చు. కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ప్రపంచం అంతా బిట్లు, బైట్లతోనే నిర్మించబడి ఉంటుంది కదా! అందుకని ఇంటర్నెట్ లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక (1 బైట్ = 8 బిట్లు) దానిని బిట్ కాయిన్ అని పేరు పెట్టుకున్నారు.

3. బిట్ కాయిన్ సృష్టి

3. బిట్ కాయిన్ సృష్టి

బిట్ కాయిన్ కి మూలాధారం ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్ వేర్ ను మొదట 2008లో తయారు చేశారు. 2009 లో మరో వ్యక్తి దానిని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మొదటి బిట్ కాయిన్ సృష్టించారు. బిట్ కాయిన్ ను పీర్ టు పీర్ కరెన్సీగా వాడుకలోకి తెచ్చారు. అనగా మధ్యలో ఇంకెవరూ మధ్యవర్తులు లేకుండా నేరుగా అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ట్రాన్సాక్షన్ (విలువ మార్పిడి) జరుగుతుంది.

 4. అక్ర‌మాల నివార‌ణ‌కు లెడ్జ‌ర్

4. అక్ర‌మాల నివార‌ణ‌కు లెడ్జ‌ర్

బిట్ కాయిన్ మార్పిడిలకు (ట్రాన్సాక్షన్స్) ఏకైక పూచీదారు పబ్లిక్ లెడ్జర్. ప్రతి ఒక్క మార్పిడిని ఇందులో నమోదు చేస్తారు. బిట్ కాయిన్ మార్పిడిలకు ఉద్దేశించిన సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ ను ఉంచుతారు. ప్రతి మార్పిడిని అతి తక్కువ సమయంలో పబ్లిక్ లెడ్జర్ లో నమోదయ్యేలా చూస్తారు. తద్వారా అక్రమాలు జరగకుండా నివారిస్తారు.

5. చెల్లింపుల‌కు సంబంధించిన రికార్డు

5. చెల్లింపుల‌కు సంబంధించిన రికార్డు

చెల్లింపులను బిట్ కాయిన్ యూనిట్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ లో రికార్డు చేస్తారు. బిట్ కాయిన్ నిర్వహణ ఏ ఒక్క కేంద్రీకృత ఆధారిటీ కిందా ఉండదు. మార్పిడిలో పాల్గొనేవారే బిట్ కాయిన్ నిర్వాహకులు. పత్రికలు బిట్ కాయిన్ ను తరచుగా క్రిప్టో కరెన్సీ అనీ డిజిటల్ కరెన్సీ అని సంబోధిస్తుంటాయి.

 6. మైనింగ్

6. మైనింగ్

చెల్లింపుల ప్రాసెసిoగ్ పనికి బహుమతిగా కొత్త బిట్ కాయిన్ లను సృష్టిస్తారు. వినియోగదారులు తమ కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెల్లింపుల అధీకృత స్వభావాన్ని నిర్ధారించుకుని పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఇలా చేయడాన్ని మైనింగ్ అంటారు. మైనింగ్ చేసేవారిని మైనర్లు అంటారు.

7. సొంత స‌ర్వ‌ర్ల‌లో

7. సొంత స‌ర్వ‌ర్ల‌లో

మైనర్లు తమకంటూ సొంత సర్వర్లు నెలకొల్పుకుని బిట్ కాయిన్ సాఫ్ట్ వేర్ ద్వారా నిర్వహణ పనిలో ఉంటారు. వీళ్ళు ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్నారు. తమ తమ సర్వర్లను ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా బిట్ కాయిన్ నెట్ వర్క్ ను నిర్మించారు. ఈ నెట్ వర్క్ లో తగిన సామర్ధ్యం (సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం, సమయం, ఆసక్తి) ఉన్నవారు ఎవరైనా చేరవచ్చు.

8. లావాదేవీలు సుర‌క్షితం

8. లావాదేవీలు సుర‌క్షితం

ఇద్దరు వ్యక్తులు లేదా సంస్ధల మధ్య బిట్ కాయిన్ లలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సంబంధిత అప్లికేషన్ ద్వారా దానిని నెట్ వర్క్ లో ప్రసారం చేస్తారు. బిట్ కాయిన్ సర్వర్లు దీనిని మూల్యాంకనం (validate) చేసి పబ్లిక్ లెడ్జర్ లోకి కాపీ చేస్తాయి. లెడ్జర్ లో పోస్ట్ చేసిన వెంటనే దానిని ఇతర సర్వర్లలోకి కూడా కాపీ అవుతుంది. అనగా సర్వర్లలో ఉండే పబ్లిక్ లెడ్జర్లు ఎప్పటికప్పుడు సింక్ (Synchronise) అవుతుంటాయి.

9. బ్లాక్ చెయిన్

9. బ్లాక్ చెయిన్

బిట్ కాయిన్ నిర్వహణలో వాడుకలో ఉన్న ఒక పదం బ్లాక్ చెయిన్. ఒక గంటకు సరాసరి ఆరు సార్లు చొప్పున ఆమోదం పొందిన ట్రాన్సాక్షన్లను ఒక సముదాయంగా చేసి పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఇలా చేసే ఒక్కో సముదాయాన్ని బ్లాక్ చెయిన్ అంటారు. ఒక బ్లాక్ చెయిన్ నమోదైన వెంటనే మొత్తం సర్వర్లలోకి ఇది పబ్లిష్ అయిపోతుంది. దీనివల్ల డూప్లిసిటీ నివారించబడుతుంది.

ఒక ట్రాన్సాక్షన్ ను సూచించే బిట్ కాయిన్ ఉనికిలో ఉందని చెప్పేందుకు ఏకైక సాక్ష్యం బ్లాక్ చెయిన్ మాత్రమే. ఇది పబ్లిగ్గా వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక మోసం ఉండదని చెబుతారు.

 10. వ్య‌క్తిగ‌త వివ‌రాలు సుర‌క్షిత‌మో కాదో

10. వ్య‌క్తిగ‌త వివ‌రాలు సుర‌క్షిత‌మో కాదో

పబ్లిక్ లెడ్జర్ లోని ఒక సదుపాయం అజ్ఞాతంగా ఉండడం. లెడ్జర్ లో ట్రాన్సాక్షన్ ఉంటుంది గానీ దాని యజమానులు ఎవరు అనే సమాచారం ఉండదు. అయితే దానికి లింక్ చేస్తూ యాజమానుల సమాచారాన్ని కూడా పూర్తి స్ధాయి సర్వర్లు భద్రపరుస్తాయని తెలుస్తోంది. ఈ వ్యక్తిగత వివరాలు అందరికి అందుబాటులో ఉంటాయో ఉండవో సరైన సమాచారం లేదు.

 11. బిట్ కాయిన్ సొంత‌దారు ఎవ‌రో ఎవ‌రికి తెలియ‌దు

11. బిట్ కాయిన్ సొంత‌దారు ఎవ‌రో ఎవ‌రికి తెలియ‌దు

వివిధ బిట్ కాయిన్ మార్పిడుల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్ధల సమాచారం అందుబాటులో ఉంటాయని చేప్పే సమాచారం కొంతవరకు లేకపోలేదు. బిట్ కాయిన్ ఓనర్లు ఎవరో తెలియకుండా ఉండడానికి వివిధ బిట్ కాయిన్ లను మార్పిడి చేసుకుని అందుకు అదనపు చెల్లింపులు చేస్తారట. తద్వారా ఒక బిట్ కాయిన్ మార్పిడి యజమాని ఎవరో తెలియకుండా మరుగున ఉంచుతారు.

12. మైనింగ్ పూల్

12. మైనింగ్ పూల్

బిట్ కాయిన్ మైనర్లు పెరిగేకొద్దీ (అనగా ట్రాన్సాక్షన్ వేలిడిటీ వెరిఫై చేసే నిపుణులు పెరిగే కొందీ) బిట్ కాయిన్ మార్కెట్ తగ్గే పరిస్ధితి ఉంటుంది. ఎందుకంటే ఒక బిట్ కాయిన్ అడ్రస్ లబ్దిదారు ఒక్కరే ఉంటారు. దీనికి పరిష్కారంగా కొందరు మైనర్లు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి మైనింగ్ పూల్ కు శ్రీకారం చుట్టారు. ట్రాన్సాక్షన్ లో పనిని విభజించుకుని దాని నమోదు ద్వారా వచ్చే రివార్డు (బిట్ కాయిన్) ను పంచుకోవడం మొదలు పెట్టారు. ఆలోచించి చూస్తే దీనివల్ల ఫలితం పెద్దగా ఉండదని అర్ధం అవుతుంది.

 13. క‌రెన్సీ మార్పు

13. క‌రెన్సీ మార్పు

బిట్ కాయిన్ లను నిజ కరెన్సీలలోకి మార్చుకునే సదుపాయాలను కల్పించేవారు ఉన్నారు. తద్వారా వారు కొంత కమిషన్ తీసుకుంటారు. బిట్ కాయిన్ చెల్లింపులకు వాటిని వినియోగిస్తారు.

14. ఐటీ కంపెనీలు సైతం బిట్ కాయిన్ దిశ‌గా

14. ఐటీ కంపెనీలు సైతం బిట్ కాయిన్ దిశ‌గా

బిట్ కాయిన్ ను కొన్ని ప్రముఖ ఐ.టి కంపెనీలు కూడా వినియోగిస్తున్నాయి. బిట్ కాయిన్ కరెన్సీ విలువలో బబుల్ వృద్ధి చెందుతోందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనగా వాస్తవ మార్కెట్, విలువల కంటే ఎక్కువ ధర పలకడం. నెట్ వర్క్ లో అనుకోని ఆటంకాలు ఏర్పడితే బిట్ కాయిన్ ట్రేడింగ్, స్పెక్యులేషన్ లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలా ఒకసారి జరిగింది కూడా. సాఫ్ట్ వేర్ వర్షన్ ని వెనక్కి కుదించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకున్నారు.

15. క‌రెన్సీ మార్పిడికి

15. క‌రెన్సీ మార్పిడికి

నిజ కరెన్సీతో బిట్ కాయిన్ లను మార్చుకునే ధోరణి కూడా క్రమంగా పెరుగుతోంది. అనగా బిట్ కాయిన్ పైన నమ్మకం పెరుగుతోందన్నట్లే. పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి ఉన్నందున బిట్ కాయిన్ లతో ఎప్పటికయినా ప్రమాదమే అన్న అనుమానం రాకమానదు.

 16. విదేశాల‌కు ఖ‌ర్చు లేకుండా పంపేందుకు

16. విదేశాల‌కు ఖ‌ర్చు లేకుండా పంపేందుకు

బ్యాంకులు, ప్రభుత్వాల అనుమతులు లాంటి బాదరబందీ లేకుండా డబ్బును విదేశాలకు పంపే సదుపాయాన్ని బిట్ కాయిన్ కరెన్సీ కల్పిస్తోంది. దాంతో బిట్ కాయిన్ ఆకర్షణీయంగా మారింది. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ 327 డాలర్ల ధర పలుకుతోంది. అనగా పెద్ద మొత్తంలో డబ్బును సరిహద్దులు దాటించవచ్చు. ఫలితంగా సహజంగానే ఇది ఆర్ధిక నేరగాళ్లకు ఆకర్షణీయం అయింది.

17. క్రిప్టో క‌రెన్సీల్లో టాప్ బిట్‌కాయిన్

17. క్రిప్టో క‌రెన్సీల్లో టాప్ బిట్‌కాయిన్

వర్చువల్ బిట్ కాయిన్ లకు ప్రతినిధిగా నిజ బిట్ కాయిన్ లు కూడా వాడుకలోకి వస్తున్నాయి. చేతితో పట్టుకోగల ఈ కాయిన్ లలోపల ఇంటర్నెట్ లో ఉపయోగించగల బిట్ కాయిన్ అడ్రస్, క్రిప్టో కీలు ఇమిడి ఉంటాయి. వీటిని ఉపయోగించి ఇంటర్నెట్ లో భౌతిక బిట్ కాయిన్ లను సొమ్ము చేసుకోవచ్చు. ఈ భౌతిక బిట్ కాయిన్ లను కాసేసియస్ బిట్ కాయిన్ లు అని పిలుస్తున్నారు. గోల్డ్ కోటింగ్, సిల్వర్ కోటింగ్, బ్రాస్ కోటింగ్ ల ద్వారా వీటికి వివిధ విలువలు కల్పించారు.

పాన్ కార్డును గురించిన 6 ముఖ్య‌ విష‌యాలు

పాన్ కార్డును గురించిన 6 ముఖ్య‌ విష‌యాలు

పాన్ కార్డును గురించిన 6 ముఖ్య‌ విష‌యాలుపాన్ కార్డును గురించిన 6 ముఖ్య‌ విష‌యాలు

 ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అప్పుడు ప‌ర్స‌న‌ల్ లోన్ బెట‌రా, క్రెడిట్ కార్డు లోన్ బెట‌రా?

ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అప్పుడు ప‌ర్స‌న‌ల్ లోన్ బెట‌రా, క్రెడిట్ కార్డు లోన్ బెట‌రా?

 ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అప్పుడు ప‌ర్స‌న‌ల్ లోన్ బెట‌రా, క్రెడిట్ కార్డు లోన్ బెట‌రా? ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అప్పుడు ప‌ర్స‌న‌ల్ లోన్ బెట‌రా, క్రెడిట్ కార్డు లోన్ బెట‌రా?

ఆధార్లో త‌ప్పులు స‌రిదిద్దుకోవ‌డం ఎలా?

ఆధార్లో త‌ప్పులు స‌రిదిద్దుకోవ‌డం ఎలా?

ఆధార్‌లో త‌ప్పులున్నాయా? స‌వ‌రించుకునేదెలా?ఆధార్‌లో త‌ప్పులున్నాయా? స‌వ‌రించుకునేదెలా?

English summary

బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఈ క‌రెన్సీ సుర‌క్షిత‌మేనా..? | what is the bitcoin Is it a legally valid currency

Bitcoin is a cryptocurrency, a digital asset designed to work as a medium of exchange that uses cryptography to control its creation and management, rather than relying on central authorities.[1] The presumed pseudonymous Satoshi Nakamoto integrated many existing ideas from the cypherpunk community when creating bitcoin.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X