For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ మ్యూచువల్ పండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే 9 ఏళ్లలో ఆరు రెట్లు

|

దేశ ఆర్థికాభివృద్ధిలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల పాత్ర ఎంతో కీలకం. మన రోజు వారి వ్యవహారాల్లోనూ వీటి స్థానాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి ప్రాధాన్యత రంగంలో మదుపు చేయడం ద్వారా లాభాలు అందిపుచ్చుకునే అవకాశం వస్తే ...ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కొత్తగా ప్రారంభించిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పథకం ఈ కోవ‌లోకే వ‌స్తుంది. దానిలో భారీగా రాబ‌డులు రావ‌డ‌మే దీని గురించి చాలా మంది మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డి దారులు చ‌ర్చించుకోవ‌డానికి కార‌ణం. దాని గురించి మ‌రిన్ని విశేషాలు తెలుసుకుందాం.

1. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ నుంచి

1. ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ నుంచి

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్‌కు చెందిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ ఫండ్ 9ఏళ్ల‌లో 6 రెట్ల కన్నా ఎక్కువ‌గా పెరిగింది. ఈ ఫండ్ కేవ‌లం బ్యాంకింగ్‌, ఆర్థిక సేవ‌ల రంగంలోనే పెట్టుబ‌డి పెడుతుంది. జులై 31, 2017 నాటికి వార్షిక సంచిత వృద్ధి రేటు(సీఏజీఆర్‌) 22.43శాతంగా న‌మోదుచేసుకుంది. ఈ ఫండ్ ప్రారంభ‌మైంది ఆగ‌స్టు 22, 2008న‌. ఆ రోజు రూ.16.44ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టి ఉంటే కోటి రూపాయ‌ల కంటే ఎక్కువే అయి ఉండేది. ప్ర‌తి 3ఏళ్ల 3 నెల‌ల్లో మ‌దుప‌రుల సంప‌ద రెట్టింపు అవ్వ‌డం విశేషం.

2. 5 స్టార్ రేటింగ్‌

2. 5 స్టార్ రేటింగ్‌

ఈ ఫండ్‌కు జులై 31, 2017 నాటికి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తుల మొత్తం(అసెట్స్ అండ‌ర్ మేనేజ్‌మెంట్‌) విలువ‌ రూ.2,400 కోట్ల పైమాటే. వాల్యూ రీసెర్చ్ దీనికి 5స్టార్ రేటింగ్ ఇచ్చింది. అంటే రిస్క్ ను స‌మాంత‌ర‌ప‌ర్చుకొని లాభాలు తీసుకురావ‌డంలో ఇది మ‌న దేశంలో టాప్ 10 స్థానంలో చోటుద‌క్కించుకుంది. మార్నింగ్ స్టార్ సైతం ఈ ఫండ్‌కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది.

3. దీర్ఘ‌కాలంలో మంచి ఆదాయం

3. దీర్ఘ‌కాలంలో మంచి ఆదాయం

ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ సెక్టోర‌ల్ ఫండ్‌. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల సేవ‌ల సంస్థ‌ల్లో ఎక్కువ‌గా ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను పెడుతుంది. బ్యాంకింగ్ రంగం దీర్ఘ‌కాల అవ‌కాశాల‌ను, ఆదాయ పెరుగుద‌ల ఇస్తుంద‌ని ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

4. విస్త‌రించే అవ‌కాశ‌మెక్కువ‌..

4. విస్త‌రించే అవ‌కాశ‌మెక్కువ‌..

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి ఎక్కువ మంది వ‌చ్చి చేర‌తార‌ని, ఆర్థిక రంగం విస్త‌రిస్తుంద‌ని... బీమా, మ్యూచువ‌ల్ ఫండ్లు, స్టాక్ బ్రోకింగ్‌, వెల్త్ మేనేజ్‌మెంట్ రంగాలు వేగంగా విస్త‌రిస్తాయ‌ని ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ త‌మ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

5. రూ.5వేల‌తోనూ..

5. రూ.5వేల‌తోనూ..

ఈ ఫండ్‌లో సాధార‌ణ మ‌దుప‌రి క‌నీసం రూ.5000ల‌తో మ‌దుపు ప్రారంభించ‌వ‌చ్చు. దీనికి డివిడెండ్‌, గ్రోత్ ఆప్ష‌న్ల‌తో పాటు డైరెక్ట్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. డివిడెండ్ ఆప్ష‌న్ అంటే డివిడెండ్ ప్ర‌క‌టించిన‌ప్పుడ‌ల్లా ఆదాయం వ‌స్తుంది. ఇక గ్రోత్ ఆప్ష‌న్ అంటే ఇలా వ‌చ్చే ఆదాయం తిరిగి పెట్టుబ‌డిగా మారుతుంది. డైరెక్ట్ ప్లాన్ అంటే నేరుగా మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థే మ‌న పెట్టుబ‌డిని నిర్వ‌హిస్తుంది. త‌ద్వారా ఏజెంటు ఛార్జీలు క‌లిసొస్తాయి. రెగ్యుల‌ర్ ప్లాన్ తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్‌లో కాస్త రాబ‌డులు అధికంగా వ‌స్తాయి.

6. న‌ష్ట‌భ‌యాలు

6. న‌ష్ట‌భ‌యాలు

డైవ‌ర్సిఫైడ్ ఫండ్ల‌తో పోలిస్తే సెక్టార్ ఫండ్లలో రిస్క్ అధికంగా ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌రులు అన్ని అంశాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి దీంట్లో మ‌దుపు చేయవ‌చ్చు.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఈ 10 మార్గాల్లో పెట్టుబ‌డి పెడితే సంప‌న్నుల‌వ్వ‌డం ఖాయం

 పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

పిల్ల‌ల కోసం ఆరు ఉత్త‌మ పొదుపు ఖాతాలు

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న ద్వారా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కూ బ్యాంకు రుణం

 బ్యాంకుల్లో త‌క్కువ వ‌డ్డీయా? అయితే ఈ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టండి

బ్యాంకుల్లో త‌క్కువ వ‌డ్డీయా? అయితే ఈ చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టండి

పెట్టుబ‌డి పెట్టేందుకు 7 చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

Read more about: investments mutual funds
English summary

ICICI Pru Banking & Financial Services Fund Multiplied Wealth 6 Times In 9 Years

ICICI Prudential Mutual Fund's Banking and Financial Services Fund has multiplied investor's wealth by more than 6 times in last nine years. The fund, which invests in companies in the banking and financial services sector only, has delivered a compound annual growth rate (CAGR) of 22.43 per cent (as on July 31, 2017) since its inception on August 22, 2008. It means an investment of Rs. 16.4 lakh made in this fund on August 22, 2008, has become more than Rs. 1 crore by July 31, 2017. Investors' money has doubled in every 3.2 years in this fund.
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more