For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల ద్వారా లాభాలు పొంద‌వ‌చ్చా...

పెట్టుబడి అనేది మనం స్తిరాస్తి , బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం , అద్దె ఆదాయం , షేర్స్ ,మ్యూచువల్ ఫండ్స్,బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్టాఫీసు పొదుపు ఫథకాలు, బంగారం మొదలైన‌ వాటిలో పెడతాము.

|

ఈ మ‌ధ్య ప్రైవేటు ఉద్యోగాల కార‌ణంగా ప్ర‌జ‌ల ఆదాయాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. తాము సంపాదించిన డ‌బ్బును మ‌ళ్లీ పెట్టుబ‌డిగా పెట్టి దాన్ని మ‌ళ్లీ ఇంత‌లింత‌లుగా పెంచుకోవాల‌నుకుంటున్నారు. వ‌చ్చే కాలంలో మ‌నం ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డ‌కూడ‌దంటే భ‌విష్యత్తు లో వచ్చే ఆదాయం కోసం మనం సంపాదించిన సంపదలో మన ఖర్చులు పోగా మిగిలిన సంపదను పెట్టుబడిగా పెట్టి మరింత సంపదను పొందడమే పెట్టుబడి మార్గం. ఈ పెట్టుబడి అనేది మనం స్తిరాస్తి , బ్యాంకు డిపాజిట్లు, వడ్డీ ఆదాయం , అద్దె ఆదాయం , షేర్స్ ,మ్యూచువల్ ఫండ్స్,బాండ్స్, సేవింగ్ సర్టిఫికేట్లు, వివిధ పోస్టాఫీసు పొదుపు ఫథకాలు, బంగారం మొదలైన‌ వాటిలో పెడతాము. ఇలాంటి నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల గురించి ప్రాథ‌మిక అంశాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

1. ఇదీ ఒక మంచి పెట్టుబ‌డి మార్గ‌మే

1. ఇదీ ఒక మంచి పెట్టుబ‌డి మార్గ‌మే

స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డులు అంటే ఏమిటి... స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులంటే ఏమిటి? అనిసాదారణ పౌరుడిని ప్రశ్నిస్తే జూదం , లాటరీ , పేకాట గుర్రపు పందెం లాంటి సమాధానాలు రావచ్చు.కాని నిజానికి అది అపోహ మాత్రమే . లాటరీ , గుర్రపు పందేలు గెలవడానికి అదృష్టం కావాలి కాని స్టాకు మార్కెట్లో డబ్బు సంపాదించడానికి అవగాహన ,మార్కెట్ రిస్కులను ముందే పసిగట్టగల కాసింత జ్ఞానం కావాలి. స్టాకు మార్కెట్ అనేది మంచి పెట్టుబడి సాధనం .

2. స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల‌పై అపోహ‌

2. స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల‌పై అపోహ‌

చక్కటి ప్రణాళిక ద్వారా , క్రమపద్దతిలో సమర్దవంతంగా పెట్టుబడి పెడితే చట్టబద్ధంగా స్టాకు మార్కెట్ లో సంపాదించిన సంపదను ఇంకా దేనిలోనూ సంపాదించలేము.స్టాకు మార్కెట్ అంటే జూదం అన్న భావన విడనాడి పెట్టుబడులకు ఉపయోగమైన వేదికగా భావించాలి. కాని మీకు స్టాక్ మార్కెట్ గురుంచి అవగాహన లేకపోవడం ,అవగాహన ఉన్నా సమయం లేకపోవడం ,మరే ఇతర కారణం చేతనైన మార్కెట్ ను నిత్యం విశ్లేషించలేకపోతే మీలాంటి వారందరూ మ్యూచవల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.అనగా మీరు స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచవల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట.

3. రిస్క్ లేక‌పోతే రాబ‌డులు రావు

3. రిస్క్ లేక‌పోతే రాబ‌డులు రావు

మార్కెట్లో పెట్టుబడులు అంటే రిస్క్ అంటారు.స్తిరాస్తి , బంగారం , చివరకు మనకు అన్నం పెట్టె రైతన్న చేసే వ్యవసాయం లో కూడా ఎంతో రిస్కు ఉంది.పండించే పంట చేతికి వచ్చే వరకు అనుక్షణం రిస్కు వానలు లేకపోవడం . అధిక వానలు, విద్యుత్తు సమస్య ,పురుగులు పట్టడం , మద్దతు ధర మొదలగు రూపాలలో రిస్కు ఉంటుంది. ఇదే విధంగా మీరు ఏ రంగం తీసుకున్న రిస్కు అనేది తప్పకుండా ఉంటుంది.

4. పెట్టుబ‌డి ఉద్దేశం

4. పెట్టుబ‌డి ఉద్దేశం

మన పెట్టుబడి ఒక్క ముఖ్య ఉద్దేశం సంపద సృష్టించడం , దానితో పిల్లల కళాశాల ఫీజులు. పెళ్ళిల్లు, సెలవులలో సరదాగా గడపడం, మంచి జీవన ప్రమాణానికి,రిటైర్మెంట్ తర్వాత జీవితం సాపీగా జరుగుటకు , మీ అనంతరం ఈ సంపద మీ తరాల వారికి చేర్చటం.ఈ పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కంటే అధికంగా ఉండాలి. ఎప్పుడైనా సరే సంపదను కాపాడటం మరియు దానిని అభివృద్ధి చేయడం అనేది ఒక్క కళ.

5. దీర్ఘ‌కాలిక వ్యూహం అవ‌స‌రం

5. దీర్ఘ‌కాలిక వ్యూహం అవ‌స‌రం

షేర్ల‌లో పెట్టుబడి వల్ల మీరు మిగిలిన‌ వాటిలో వ‌చ్చే రాబడి కంటే అధిక రాబడి పొందగలరు. అయితే ఇలా జ‌రగ‌డం అనేది మీకు స్టాకు మార్కెట్ పై పరిపూర్ణ జ్ఞానం, దీర్గాకాలిక పెట్టుబడి వ్యూహం ,సరియైన స్టాకు ను ఎన్నుకోవడం మొదలగు వాటి మీద ఆధారపడి ఉంటుంది. మీ సంపాదన మొదలైన తొలినాళ్ల నుండే క్రమ పద్దతిలో దీర్గాకాలిక వ్యూహంతో పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించాలి. మీరు తొలినాళ్ళ నుండే మొదలు పెడితే అనుకోకుండా జరిగే ఎలాంటి రిస్కులను వ‌చ్చినా తట్టుకోగలరు .అంతే కాకుండా ఒకవేళ‌ మీరు ఉద్యోగం మానేసే నాటికి యాభై లక్షలు సంపాదించడం మీ లక్ష్యం అయితే మీరు మీ సంపాదన తొలినాళ్ల నుండే పెట్టుబడి మొదలు పెడితే మీ లక్ష్యం చేరుకోవటం చాలా సులభం అవుతుంది.

Read more about: stock market share market sensex
English summary

స్టాక్ మార్కెట్ పెట్టుబ‌డుల ద్వారా లాభాలు పొంద‌వ‌చ్చా... | how a middle class person use stock market investments for better returns

Investment lessons for stock market beginners stock market investments are risky. But if you look for long term by understanding fundamentals you will get goodreturns with time.
Story first published: Tuesday, January 16, 2018, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X