English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

క్రెడిట్ కార్డు ఉండే వారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన 10 ముఖ్య విష‌యాలు

Written By:
Subscribe to GoodReturns Telugu

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు వాడటం ఎక్కువైపోయింది. ఐతే చాలా మంది వాటిని వాడటం సరిగ్గా రాకపోవటం వల్ల ఎక్కువ మొత్తంలో బ్యాంకులకు చెల్లిచాల్సి వస్తుందని వాపోతున్నారు. అందుకే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు వాటి నిబంధనలను తప్పక తెలుసుకోవాలి. ఎంత పరిమితి మొత్తాన్ని ఆ కార్డు ద్వారా ఉపయోగించుకోవచ్చు, ఆ కార్డుకు చెల్లించాల్సిన ఫీజు ఏమిటి, మనం వాడుకున్న మొత్తంపై ఎంత శాతం వడ్డీ విధిస్తారు మొదలైన వివరాలు తెలుసుకోవాలి. ఇలాంటి క్రెడిట్ కార్డు సంబంధిత ముఖ్య విష‌యాల‌ను తెలుసుకునేందుకు ఈ క‌థ‌నాన్ని చ‌ద‌వండి

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మ‌ధ్య తేడాను గుర్తించాలి

క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మ‌ధ్య తేడాను గుర్తించాలి

ఎవరైనా మిమ్మల్ని క్రెడిట్ కార్డుకి డెబిట్ కార్డుకి తేడా వివరించమంటే మీరు ఏం చెబుతారు? క్రెడిట్ కార్డు వాడటం షాపింగ్ చేయడానికి తక్కువ సమయంలో తీసుకునే అప్పు అని చెబుతారు అని నమ్ముతున్నాం.చూడటానికి ఒకేలా ఉన్నా, క్రెడిట్ కార్డుకి డెబిట్ కార్డులా డబ్బులు నేరుగా ఖాతా నుంచి తీయబడవు.

క్రెడిట్ కార్డుకి వడ్డీ కూడా ఉంటే అదనపు పాయింట్లు జోడించబడతాయి.బిల్లింగ్ చక్రంలోపు క్రెడిట్ కార్డు బిల్లు కట్టేస్తే ఆ వడ్డీని నివారించచ్చు.

2. రెండు రకాల క్రెడిట్ కార్డులు

2. రెండు రకాల క్రెడిట్ కార్డులు

క్రెడిట్ కార్డులు రెండు రకములు.ఒకటి సురక్షితమైనది, ఒకటి అసురక్షితమైనది.సురక్షితమైనదంటే అందులో డబ్బు జమ చేయాలి.సురక్షితమైన క్రెడిట్ కార్డు , సున్నా లేక తక్కువ క్రెడిట్ ఉన్నదానికి మంచిది. కానీ దాని వలన నష్టం ఏంటంటే ఆ కార్డు పరిమితిలో ఎంత డబ్బు జమ చేసామో అంతే ఉంటుంది. అసురక్షితమైన కార్డుకి కూడా పరిమితి ఉంది,కాని అది మీ క్రెడిట్ చరిత్ర మరియు ఆదాయం బట్టి నిర్ణయించబడుతుంది.

3. ఏ పి ఆర్ గురించి

3. ఏ పి ఆర్ గురించి

మీరు వాణిజ్య ప్రకటనలలో చూసే ఏ పి ఆర్ అంటే వార్షిక రేటు శాతం. ఏ పి ఆర్ అంటే మీకు గుర్తు ఉండకపోయినా పర్వాలేదు కాని, మీరు క్రెడిట్ కార్డుకి దరఖాస్తు చేసే ముందు సరైన ఏ పి ఆర్ శాతం చూసుకోవాలి.ఎందుకంటే మీ బిల్లు బాకి ఉంటే కట్టాల్సింది ఏ పి ఆర్ యే.కొన్ని ఏ పి ఆర్ లు 30% అంత ఎక్కువ కూడా ఉంటాయి.

4. ప్రామణికం కాని ఫీజు గురించి చూడండి

4. ప్రామణికం కాని ఫీజు గురించి చూడండి

కొన్ని క్రెడిట్ కార్డులకి ప్రామణికం కాని ఫీజులు ఉంటాయి- మీరు అంచనా వేసిన విధంగానే వాటి పేర్లు వైవిధ్యమైనవి.మంచి క్రెడిట్ కార్డులకు ఎప్పుడూ ప్రామాణికం కాని ఫీజులు ఉండవు.ఆడిట్ ఫీజు, మార్పిడి ఫీజు,త్రైమాసిక టెక్నాలజీ ఫీజు మరియు భద్రతా ఫీజు మొదలైనవి ఉండవు.

5. కనీస చెల్లింపు కంటే ఎక్కువే కట్టేలాగా ప్రణాళిక వేయండి

5. కనీస చెల్లింపు కంటే ఎక్కువే కట్టేలాగా ప్రణాళిక వేయండి

ప్రతీ నెలా మీరు కేవలం క్రెడిట్ కార్డు బిల్ మీద కనీసమే చెల్లించాల్సి వస్తే,కొంచమే కదా అని చెల్లించకుండా వదిలేయవచ్చు.అందుకని మంచి అలవాటుగా మొత్తం నెలలో వచ్చిన క్రెడిట్ కార్డు బిల్లు కట్టేయండి.ఇంకో మాటల్లో మీ దగ్గర లేనంత ఖర్చు చేయకండి.

6. వార్షిక ఫీజు గురించి చూడండి

6. వార్షిక ఫీజు గురించి చూడండి

మీరు తరచు క్రెడిట్ కార్డు వాడకపోతే,వార్షిక ఫీజు లేని క్రెడిట్ కార్డు తీసుకోవడమే మంచిది.ఈ ఫీజు ఏడాదికి $100 నుంచి $300 దాకా ఉంటుంది.వార్షిక ఫీజు ఉన్న అన్ని క్రెడిట్ కార్డులు చెడ్డవి కావు అనుకోండి,మరియు అవి లేకుండా కూడా చాలా ఉంటాయి.

7. క్రెడిట్ కార్డుల ప్రయోజనాలని అర్థం చేసుకోండి

7. క్రెడిట్ కార్డుల ప్రయోజనాలని అర్థం చేసుకోండి

క్రెడిట్ కార్డు ప్రయోజనాలు కొన్ని నిబంధనలు మరియు షరతులతో వస్తాయి.ఉదాహరణకి మీకు రివార్డు పాయింట్లు ఇస్తామంటారు కానీ అవి నాణ్యమైన కొనుగోలు పై మాత్రమే ఉండచ్చు మరియు ప్రతీ త్రైమాసికానికి మారచ్చు.అందుకే క్రెడిట్ కార్డ్ యొక్క ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా తెలియకపోతే, క్రెడిట్ కార్డ్ నుంచి మొత్తం లాభం పొందలేరు.

8. క‌నీస లావాదేవీ

8. క‌నీస లావాదేవీ

మ‌న ద‌గ్గ‌ర అవ‌స‌రాల‌కు స‌రిప‌డా న‌గ‌దు లేకుంటే ప్ర‌తి చిన్న దానికి కార్డు స్వైప్ చేస్తుంటాం. అలాంట‌ప్పుడు ఒక కిరాణా కొట్టులో మీరు చేసే 200,300 బిల్లుకు క్రెడిట్ కార్డును దుకాణదారుడు అంగీక‌రించ‌క‌పోవ‌చ్చు. క‌నీసం ఇంత‌కంటే ఎక్కువ బిల్లు చేస్తేనే కార్డు అంగీక‌రిస్తామ‌ని చెబుతారు. అదే క‌నీస లావాదేవీ. ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల‌లో సైతం ఏవైనా కొనుగోళ్లు జ‌రిపితే ఉచిత డెలివ‌రీ సౌక‌ర్యం కోసం క‌నీస షాపింగ్ నిబంధ‌న ఉంటుంది కదా. ఇదీ అలాంటిదే.

9. కొనుగోలు చేయడం మర్చిపోకండి

9. కొనుగోలు చేయడం మర్చిపోకండి

లెక్కలేనన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి.అందుకే ఏదైనా కొనుగోలు చేసే ముందు వేరే వాటితో పోల్చుకొని కొనండి.బిల్లు కట్టే సమయంలో ఒత్తిడికి లోనయ్యి స్టోర్ క్రెడిట్ కార్డు తీసుకోకండి.ఒక్క నిమిషం ఆగి ఇంకేమేమి క్రెడిట్ కార్డులు ఉన్నాయో చూసి తీసుకుంటే భవిష్యత్తులో కష్టాలు రావు.

10. క్రెడిట్ కార్డు మినిమమ్ డ్యూ

10. క్రెడిట్ కార్డు మినిమమ్ డ్యూ

కార్డుకు సంబంధించి ప్రారంభంలో ఈ విష‌యంలో చాలామంది తిక‌మ‌క‌ప‌డుతూ ఉంటారు. మీరు బిల్లులో ఇంత మొత్తం చాలిస్తే చాలు అని మెసేజ్ వ‌స్తుంది. దాన్ని మినిమ‌మ్ బ్యాలెన్స్ అంటారు. ఈ మినిమ‌మ అమౌంట్ డ్యూల‌ను చెల్లించి ఊరుకుంటే మొత్తం అప్పు తీరినట్లు కాదు. ఎందుకంటే మిగిలిన మొత్తంపై విధించే వ‌డ్డీలు బాగా ఉంటాయి. అందుకే వాడిన మొత్తం బిల్లును బిల్లు తేదీ తుది గ‌డువు లోపు క‌ట్టేయాలి. సాధార‌ణంగా మ‌నం వాడుకున్న బ్యాలెన్స్‌లో 5శాతాన్ని మినిమ‌మ్ అమౌంట్ డ్యూగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు

English summary

10 important things to know about credit card

Credit card is a small plastic card that allows you to borrow money instantly at the point of sale from your card provider to pay for purchases. The total borrowed amount has to be paid by the cardholder at the end of the billing cycle (it is generally a month long). Credit card payment is one of the most convenient and beneficial ways to pay for products. Unlike cash, credit card can be used to make online payments as well. Apart from allowing people to borrow money, these cards offer various rewards and benefits such as discounts, cashback, lounge access and memberships among many others.
Story first published: Monday, January 8, 2018, 12:15 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns